
ముంబై : అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంలో జాప్యం నెలకొంటుందనే సంకేతాలతో బుధవారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల ట్రెండ్ సైతం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. మెటల్, పీఎస్‌యూ సహా పలు రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతుండగా, ఐటీ షేర్లు స్వల్పంగా లాభపడుతున్నాయి. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్ 101 పాయింట్ల నష్టంతో 40,573 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 36 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 12,000 పాయింట్ల దిగువన 11,957 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment