కొనుగోలుకు ఇదే సరైన సమయం
ఐదేళ్ల క్రితం స్థానిక రాజకీయాంశం కారణంగా స్థిరాస్తి రంగం బాగా దెబ్బతింది. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులంటే ఆలోచించేవారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక.. విధాన నిర్ణయాలు, ప్రోత్సాహాలు, పారిశ్రామిక, ఐటీ పాలసీలు, ఐటీ-హబ్ వంటి వాటితో పారిశ్రామిక రంగంలో కొత్త ఉత్సాహం వచ్చింది. యాపిల్, ఐకియా, ఫ్లిప్‌కార్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలు నగరంలో కార్యాలయాలు, గిడ్డంగుల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. వీటితో ఆఫీస్ స్పేస్‌కు గిరాకీ పెరిగిం ది. ఆయా ఉద్యోగుల కోసం నివాస సముదాయాలు, వాణిజ్య సముదాయాలనూ నిర్మిం చాల్సి ఉంటుంది. దీంతో స్థిరాస్తి రంగం మళ్లీ గాడిన పడే అవకాశం పుష్కలంగా ఉంది. కాబట్టి స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం.
♦ బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి ఇతర మెట్రో నగరాలే కాదు విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలతో పోల్చి చూసిన సరే హైదరాబాద్‌లోనే స్థిరాస్తి ధరలు తక్కువగానే ఉన్నాయి. స్థలాల అందుబాటులో ఉండటమే.
♦ ఐటీ కంపెనీలతో కూకట్‌పల్లి నుంచి గచ్చిబౌలి రోడ్డు, ఆదిభట్ల, పోచారం ప్రాంతాలూ ఇప్పుడు హాట్ ఏరియాలుగా మారాయి. ఇవి పెట్టుబడులకు మంచి ప్రాంతాలని చెప్పవచ్చు. సమీప భవిష్యత్తులో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధిని ఊహకందనిది. అందుకే ఘట్‌కేసర్‌లోనూ లే-అవుట్ ప్రాజెక్ట్‌ను చేయాలని నిర్ణయించాం.
అవార్డుతో బాధ్యత పెరిగింది..
ఇచ్చిన గడువులోగా కొనుగోలుదారులకు ఇళ్లను అందించడం, నిర్మాణంలో నాణ్యత, నిర్వహణలో నిశ్చింతతోనే ఈ అవార్డు దక్కింది. దీంతో బాధ్యత మరింత పెరిగింది. గతంలో 2004లో ‘రాష్ట్రీయ నిర్మాణ్ రతన్ అవార్డ్’, 2006లో ‘మోస్ట్ ప్రిఫర్డ్ బిల్డర్ ఇన్ సదరన్ రీజియన్’ అవార్డులు కూడా వరించాయి.