IT-hub
-
ఐటీ హబ్‌లు వెలవెల! భారీగా పడిపోయిన నియామకాలు..
ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్లో ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. నియామకాలు బాగా నెమ్మదించాయి. భారత్‌లో ముఖ్యంగా ఐటీ హబ్‌లు వెలవెలబోతున్నాయి. దేశంలో ఉద్యోగాల క్షీణతకు సంబంధించి తాజాగా ఓ నివేదిక వెల్లడైంది. పుణె, బెంగళూరు, హైదరాబాద్ వంటి భారతీయ ఐటీ హబ్‌లలో గడిచిన అక్టోబర్ నెలలో ఉద్యోగాల క్షీణత కనిపించిందని నివేదిక వెల్లడించింది. మొత్తం మీద అక్టోబర్‌లో ఇతర రంగాల కంటే ఐటీ రంగంలో నియామకాలు అత్యధికంగా పడిపోయాయి. మరోవైపు, చమురు, గ్యాస్, విద్యుత్ రంగాల్లో అత్యధిక వృద్ధి కనిపించింది. ఐటీ నియామకాల్లో 14% క్షీణత నౌకరీ జాబ్‌స్పీక్ నివేదిక ప్రకారం.. గతేడాది అక్టోబర్‌తో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఐటీ రంగం నియామకాల్లో 14 శాతం క్షీణతను చూసింది. నౌకరీ డాట్ కామ్ రెజ్యూమ్ డేటాబేస్‌పై ఈ నెలవారీ నివేదిక విడుదలైంది. ఇతర నగరాల్లో వృద్ధి కోల్‌కతాతో పాటు ఐటీ పరిశ్రమ కేంద్రాలుగా ఉన్న బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై వంటి మెట్రో నగరాల్లో నియామకాల్లో 6 నుంచి 11 శాతం క్షీణత ఉండగా మరోవైపు ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై నగరాల్లో మాత్రం కొత్త జాబ్ ఆఫర్లలో వరుసగా 5, 4 శాతాల చొప్పున వృద్ధి నమోదైనట్లు నివేదిక పేర్కొంది. ఇక చెన్నైలో అత్యధికంగా 11 శాతం, బెంగళూరులో 9 శాతం, హైదరాబాద్‌లో 7 శాతం నియామకాలు పడిపోయాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ అక్టోబర్‌లో పుణె, కోల్‌కతాలో నియామకాలు 6 శాతం తగ్గాయి. చిన్న నగరాల విషయానికి వస్తే.. కొచ్చిలో 18 శాతం, కోయంబత్తూరులో 7 శాతం తగ్గింది. మరోవైపు మెట్రో నగరాలైన ఢిల్లీ 5 శాతం, ముంబై 4 శాతం వృద్ధిని సాధించాయి. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వడోదరలో అత్యధికంగా 37 శాతం వృద్ధి నమోదైంది. ఆ తర్వాత అహ్మదాబాద్‌లో 22 శాతం, జైపూర్‌లో 10 శాతం నియామకాల్లో వృద్ధి నమోదైనట్లు నౌకరీ జాబ్ స్పీక్ రిపోర్ట్ పేర్కొంది. ఈ రంగాల్లో జోష్ ఐటీ రంగంలో నియామకాల్లో క్షీణత ఉన్నప్పటికీ కొన్ని ఇతర రంగాల్లో మాత్రం కొత్త నియామకాల్లో జోష్ కనిపించినట్లు తాజా వివేదిక తెలిపింది. చమురు & గ్యాస్/పవర్ రంగం అత్యధికంగా 24 శాతం వృద్ధిని సాధించింది. ఆ తర్వాత ఫార్మా పరిశోధన, అభివృద్ధి (19 శాతం), బ్యాంకింగ్/ఫైనాన్స్/బ్రోకింగ్ (13 శాతం) ఉన్నాయి. ఇక నియామకాల్లో క్షీణత అత్యధికంగా ఉన్న రంగాలలో ఐటీ తర్వాత విద్య (10 శాతం), టెలికాం (9 శాతం) ఉన్నాయి. భారత్‌లో వైట్ కాలర్ నియామకానికి సంబంధించిన ఇండెక్స్ విలువ ఈ ఏడాది అక్టోబర్‌లో 2484గా ఉంది. ఇది గతేడాది అక్టోబర్‌లో 2455గా నమోదైంది. -
ఐటీ.. మేడిన్ ఖమ్మం!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్‌లను విస్తృతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో భాగంగా ఖమ్మం ఐటీ హబ్‌ను అన్ని హంగులతో నిర్మించి హైదరాబాద్, బెంగళూరు నగరాలకు దీటుగా ఐటీ సేవలు అందించనున్నామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తెలిపారు. ఖమ్మంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు. ఐటీ హబ్‌కు ప్రఖ్యాతి గాంచిన కంపెనీలు రావడంతో ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే వాటికి మేడిన్ ఖమ్మంగా పేరొచ్చే అవకాశం కనుచూపు మేరల్లోనే ఉందన్నారు. సర్వీసు కంపెనీలకన్నా ఐటీ రంగంలో ప్రోడక్ట్ కంపెనీలు ఖమ్మం వైపు దృష్టి సారించడంతో ఇది సాధ్యం కానుందన్నారు. ఐటీ హబ్ రెండో దశ తక్షణ నిర్మాణం కోసం రూ. 20 కోట్లను మంజూరు చేస్తున్నామని, తద్వారా అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశం కలుగుతుందన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్(టాస్క్) ఆధ్వర్యంలో నిరంతరం వృత్తి నైపుణ్య శిక్షణ కొనసాగాలని, దీంతో ఉద్యో గావకాశాలు ఏ రూపంలో ఉన్నా ఖమ్మం యువత అందిపుచ్చుకొనే అవకాశం ఉందన్నారు. అభివృద్ధిలో ఖమ్మం దూసుకెళ్తోంది: అభివృద్ధిలో ఖమ్మం దూసుకుపోతోందని, నగరాన్ని ఎలా సుందరీకరించుకోవాలో.. ప్రభుత్వం నుంచి నిధులు ఎలా రాబట్టుకోవాలో మంత్రి అజయ్ నుంచి తెలుసుకొని ప్రజాప్రతినిధులు స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందన్నారు. స్థానికంగా ఉన్న వనరులను వినియోగించుకోవడంలో ఖమ్మం ప్రజలు ముందంజలో ఉన్నారని, దీనికి ఉదాహరణే.. ఎన్నెస్పీ కాల్వపై వాకింగ్ ట్రాక్, పలుచోట్ల పార్కుల నిర్మాణమని, వైకుంఠధామాన్ని సైతం అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం మంత్రి పువ్వాడకే సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి పోలీస్ కమిషనరేట్‌ను ఖమ్మంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఐటీ రంగం కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా.. ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు. ఆయన ఆలోచనల మేరకు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట వంటి ప్రాంతాల్లో ఐటీ హబ్‌లు ఏర్పాటయ్యాయని వివరించారు. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి... మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిరంతర విద్యార్థి అని.. 70 ఏళ్లు పైబడిన తర్వాత కూడా కంప్యూటర్ నేర్చుకున్నారని, 14 భాషలు నేర్చుకున్నారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. పీవీకి కేంద్రం భారతరత్న ప్రకటించాలని కోరారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కరణ వాది అయిన పీవీకి భారతరత్న ప్రకటించడం ఎంతైనా సమంజసమన్నారు. ప్రవాస భారతీయులు, తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని కోరుకుంటున్నారన్నారు. ఖమ్మంలో పీవీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం విశేషమన్నారు. అభివృద్ధిలో రాజకీయాలు చూడం... అభివృద్ధిలో రాజకీయాలు ఉండవని, ఇందుకు ఉదాహరణే.. నగరంలోని సుందరయ్య నగర్లో ఏర్పాటు చేసిన పార్కును ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వామపక్ష కార్పొరేటర్ ద్వారా ప్రారంభింపజేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో.. పనులు ఎంత వేగంగా కొనసాగుతున్నాయో ఖమ్మంను స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల చైర్మన్లను, నగరపాలక సంస్థ మేయర్లను కోరుతున్నానని, త్వరలో వారందరినీ ఖమ్మంలో పర్యటించాలని కోరతానన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, టాస్క్ సీఈఓ శ్రీకాంత్‌సిన్హా, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, టెక్నోజెన్ సీఈఓ లాక్స్ చేకూరి పాల్గొన్నారు. -
కొనుగోలుకు ఇదే సరైన సమయం
ఐదేళ్ల క్రితం స్థానిక రాజకీయాంశం కారణంగా స్థిరాస్తి రంగం బాగా దెబ్బతింది. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులంటే ఆలోచించేవారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక.. విధాన నిర్ణయాలు, ప్రోత్సాహాలు, పారిశ్రామిక, ఐటీ పాలసీలు, ఐటీ-హబ్ వంటి వాటితో పారిశ్రామిక రంగంలో కొత్త ఉత్సాహం వచ్చింది. యాపిల్, ఐకియా, ఫ్లిప్‌కార్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలు నగరంలో కార్యాలయాలు, గిడ్డంగుల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. వీటితో ఆఫీస్ స్పేస్‌కు గిరాకీ పెరిగిం ది. ఆయా ఉద్యోగుల కోసం నివాస సముదాయాలు, వాణిజ్య సముదాయాలనూ నిర్మిం చాల్సి ఉంటుంది. దీంతో స్థిరాస్తి రంగం మళ్లీ గాడిన పడే అవకాశం పుష్కలంగా ఉంది. కాబట్టి స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం. ♦ బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి ఇతర మెట్రో నగరాలే కాదు విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలతో పోల్చి చూసిన సరే హైదరాబాద్‌లోనే స్థిరాస్తి ధరలు తక్కువగానే ఉన్నాయి. స్థలాల అందుబాటులో ఉండటమే. ♦ ఐటీ కంపెనీలతో కూకట్పల్లి నుంచి గచ్చిబౌలి రోడ్డు, ఆదిభట్ల, పోచారం ప్రాంతాలూ ఇప్పుడు హాట్ ఏరియాలుగా మారాయి. ఇవి పెట్టుబడులకు మంచి ప్రాంతాలని చెప్పవచ్చు. సమీప భవిష్యత్తులో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధిని ఊహకందనిది. అందుకే ఘట్కేసర్లోనూ లే-అవుట్ ప్రాజెక్ట్‌ను చేయాలని నిర్ణయించాం. అవార్డుతో బాధ్యత పెరిగింది.. ఇచ్చిన గడువులోగా కొనుగోలుదారులకు ఇళ్లను అందించడం, నిర్మాణంలో నాణ్యత, నిర్వహణలో నిశ్చింతతోనే ఈ అవార్డు దక్కింది. దీంతో బాధ్యత మరింత పెరిగింది. గతంలో 2004లో ‘రాష్ట్రీయ నిర్మాణ్ రతన్ అవార్డ్’, 2006లో ‘మోస్ట్ ప్రిఫర్డ్ బిల్డర్ ఇన్ సదరన్ రీజియన్’ అవార్డులు కూడా వరించాయి.