
భారతి ఎయిర్‌టెల్
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ తమ ఆఫ్రికా విభాగాన్ని అంతర్జాతీయ స్టాక్ ఎక్సే్చంజీలో లిస్టింగ్ చేయాలని యోచిస్తోంది. నెదర్లాండ్స్ కేంద్రంగా ఆఫ్రికా కార్యకలాపాలను పర్యవేక్షించే భారతి ఎయిర్‌టెల్ ఇంటర్నేషనల్ (బెయిన్ బీవీ) ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సే్చంజీలో షేర్ల లిస్టింగ్‌కు సంబంధించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేలా వివిధ బ్యాంకులు, మధ్యవర్తిత్వ సంస్థలతో సంస్థ యాజమాన్యం చర్చలు జరిపేందుకు ఇది ఉపయోగపడనుంది. ఆఫ్రికాలోని 14 దేశాల్లో భారతి ఎయిర్‌టెల్ టెలికం కార్యకలాపాలు సాగిస్తోంది. మొత్తం 14 దేశాల్లో 3జీ సర్వీసులు, ఎయిర్‌టెల్ మనీ సేవలు అందిస్తోంది.