సంపన్న భారతీయుడు ముకేశ్ అంబానీ
♦ 19.3 బిలియన్ డాలర్లతో 36వ స్థానంA
♦ జాబితాలో మనోళ్లు 84 మంది
♦ అగ్రస్థానంలో బిల్ గేట్స్
న్యూయార్క్: ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితా-2016లో చోటుదక్కించుకున్న భారతీయులందరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ టాప్‌లో నిలిచారు. ఈయన 19.3 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచవ్యాప్త కుబేరుల్లో 36వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఫోర్బ్స్ ప్రపంచ జాబితాలో మొత్తం 84 మంది భారతీయులు స్థానం దక్కించుకున్నారు. 75 బిలియన్ డాలర్ల సంపదతో బిల్ గేట్స్ ఎప్పటిలాగానే అగ్రస్థానంలో ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ప్రపంచ బిలియనీర్ల సంఖ్య 1,826 నుంచి 1,810కి పడింది. వీరి మొత్తం సంపద 6.5 ట్రిలియన్ డాలర్లు. జాబితాలో స్థానం పొందిన భారతీయుల్లో లక్ష్మీ మిట్టల్ (135వ స్థానం), సునీల్ మిట్టల్ (219), గౌతమ్ అదానీ (453), సావిత్రి జిందాల్ (453), రాహుల్ బజాబ్ (722), ఎన్‌ఆర్ నారాయణ మూర్తి (959), ఆనంద్ మహీంద్రా (1,577) తదితరులు ఉన్నారు.