ఇండియాబుల్స్ డిస్కవరీ ఫండ్
ఇండియాబుల్స్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ‘వేల్యూ డిస్కవరీ ఫండ్’ పేరుతో ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా సేకరించిన మొత్తాన్ని లార్జ్, మిడ్‌క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తారు. సెప్టెంబర్ 3న ప్రారంభమైన ఈ పథకం ఎన్‌ఎఫ్‌వో సెప్టెంబర్ 7తో ముగుస్తుంది. కనీస ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ. 500గా నిర్ణయించారు.
ఐడీబీఐ చైల్డ్ యూలిప్
ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘వెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యూచర్ స్టార్ ఇన్సూరెన్స్’ పేరుతో యూలిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. పిల్లల భవిష్యత్తు అవసరాలకు అక్కరకు వచ్చే విధంగా తీర్చిదిద్దిన ఈ పథకంలో పాలసీదారుడు వారి రిస్క్ సామర్థ్యం బట్టి ఇన్వెస్ట్ చేయడానికి 9 రకాల ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. పాలసీ తీసుకున్న 5, 10 ఏళ్ల తర్వాత గ్యారంటీ లాయల్టీ అడిషన్ కూడా ఉంది.
మ్యాక్స్‌లైఫ్ వెల్త్‌ప్లాన్
యాక్స్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘ప్లాటినమ్ వెల్త్‌ప్లాన్’ పేరుతో యూలిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా అధికాదాయ వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ పథకంలో ప్రీమియాన్ని రెగ్యులర్‌గా ప్రతీ ఏడాదితో పాటు ఒకేసారి లేదా ఐదేళ్లలో చెల్లించే అవకాశాన్ని కల్పిస్తోంది. పాలసీ కాలపరిమితి 10 లేదా 20 ఏళ్లుగా నిర్ణయించారు. ఇన్వెస్ట్ చేయడానికి ఐదు రకాల ఫండ్ ఆప్షన్స్‌ను అందిస్తోంది.
బజాజ్ అలయంజ్ మనీ బ్యాక్
బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ దీర్ఘకాలిక మనీ బ్యాక్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘క్యాష్ అష్యూర్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం 20, 28 ఏళ్ల కాలపరిమితుల్లో లభిస్తుంది. 20 ఏళ్ల కాలపరిమితి ఎంచుకుంటే ప్రతీ 5, 10, 15 ఏళ్లకు 20 శాతం చొప్పున వెనక్కి వస్తుంది. అదే 28 ఏళ్ళ కాలాన్ని ఎంచుకుంటే 7, 14, 21 ఏళ్లకు 30 శాతం చొప్పున వెనక్కి వస్తుంది.
బ్రీఫ్స్
Published Mon, Sep 7 2015 12:00 AM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM
Advertisement