న్యూఢిల్లీ: బ్రిటిష్ ఏయిర్‌వేస్ సంస్థ విమాన టికెట్ల బేస్ చార్జీల్లో 74 శాతం వరకూ డిస్కౌంట్‌నిస్తోంది. భారత్ నుంచి అమెరికా నగరాలకు వెళ్లే విమాన సర్వీసులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని బ్రిటిష్ ఎయిర్‌వేస్ రీజనల్ కమర్షియల్ మేనేజర్(సౌత్ ఏషియా) క్రిష్టోఫర్ ఫర్‌డైస్ చెప్పారు. ఈ నెల 5 నుంచి 15 వరకూ బుక్ చేసే టికెట్లకు, క్లబ్ వరల్డ్(బిజినెస్ క్లాస్), వరల్డ్ ట్రావెలర్(ఎకానమీ క్లాస్)లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. వచ్చే ఏడాది మార్చి 15 వరకూ ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. ఈ ఆఫర్ కారణంగా ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు అన్ని కలుపుకొని టు-వే టికెట్ల ధర రూ.53,760 ఉంటుందని తెలిపారు. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించి 90 సంవత్సరాలైన సందర్భంగా ఈ ఆఫర్‌లనిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కంపెనీ వారానికి 49 విమాన సర్వీసులను నడుపుతోంది.