రాబడినిచ్చే షేర్లివే...బ్రోకరేజ్‌ల సిఫార్సులు | brokarage recomandations | Sakshi
Sakshi News home page

రాబడినిచ్చే షేర్లివే...బ్రోకరేజ్‌ల సిఫార్సులు

Published Tue, May 19 2020 3:18 PM | Last Updated on Tue, May 19 2020 3:35 PM

stocks  - Sakshi

stock recomandations

గత రెండు మూడు సెషన్లలో దేశీయ మార్కెట్లు ఆటుపోట్లకు గురవుతున్నాయి. అంతర్జాతీయంగా, దేశీయంగాను  ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా, అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేయాలనీ బ్రోకరేజ్‌ సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతమున్న మార్కెట్‌ స్థితిగతులకు అనుగుణంగా వివిధ షేర్లపై ఏంజిల్‌ బ్రోకింగ్‌, ఆనంద్‌ రాఠీల సిఫార్సులు ఈ విధంగా ఉన్నాయి.

కంపెనీ పేరు: భారతీ ఎయిర్‌టెల్‌
బ్రోకరేజ్‌ సంస్థ: ఏంజిల్‌ బ్రోకింగ్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.629
ప్రస్తుత ధర: రూ.593 

బ్రోకరేజ్‌ సంస్థ ఏంజిల్‌ బ్రోకింగ్‌ భారతీ ఎయిర్‌టెల్‌ షేరుకు బై రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్‌ ధరను రూ.629గా నిర్ణయించింది. ఈ కంపెనీ గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నికర నష్టం రూ.5,237 కోట్లుగా నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో  నికర లాభం రూ.107.2 కోట్లుగా ఉంది. గతేడాది క్యూ4తో పోలిస్తే  ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు రాబడి (ఏఆర్‌పీయూ )రూ.123 నుంచి 154 పెరిగింది. దీంతో నాలుగో త్రైమాసికంలో కంపెనీ వృద్ధి 15.1 శాతం నమోదు చేసి కన్సాలిడేటెడ్‌ ఆదాయం రూ.23,723 కోట్లుగా నమోదైందని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. 2019 నవంబర్‌లో టెలికాం కంపెనీలు టారీఫ్‌లు 35 శాతం పెంచాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మరోసారి టెలికాం కంపెనీలు టారీఫ్‌లు పెంచే అవకాశం ఉందని, అప్పుడు ఈ కంపెనీకి మంచి లాభాలు వస్తాయని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ ప్రస్తుతం రూ.319177.38 కోట్లుగా ఉంది. ప్రస్తుతం బీఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్‌ షేరు ధర రూ.593.10గా ఉంది.

కంపెనీపేరు: ఆల్‌కెమ్‌ ల్యాబ్స్‌
బ్రోకరేజ్‌సంస్థ: ఏంజిల్‌ బ్రోకింగ్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.3,300
ప్రస్తుత ధర: రూ.2,349

ఆల్‌కెమ్‌ ల్యాబ్స్‌కు బ్రోకరేజ్‌సంస్థ ఏంజిల్‌ బ్రోకింగ్‌ బై రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్‌ రేటింగ్‌ను రూ.3,00గా నిర్ణయించింది. ఈ ల్యాబ్స్‌కు దేశీయ జనరిక్‌ మందులు, ఏపీఐ వ్యాపారాల ద్వారా 67 శాతం ఆదాయం వస్తుదని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. యాంటీ ఇన్‌ఫెక్టివ్‌ అండ్‌ క్రోనిక్‌ వ్యాపారాలు సైతం రెవెన్యూ వృద్ధికి తోడ్పడతాయని వెల్లడించింది. వచ్చే రెండేళ్లలో ఈ కంపెనీ 1.5 రెట్లు వృద్ది రేటును నమోదు చేస్తుందని అంచనావేస్తున్నట్లు తెలిపింది. మరికొద్ది సంవత్సరాలలో ఆల్‌కెమ్‌ ల్యాబ్స్‌ టాప్‌లైన్‌ వృద్ధి 13-15 శాతం ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.28674.68 కోట్లుగా ఉంది. బీఎస్‌ఈలో ప్రస్తుతం ఈ కంపెనీ షేరు ధర రూ.2349.95 గా ఉంది.

కంపెనీ పేరు: ఆర్తి డ్రగ్స్‌
బ్రోకరేజ్‌సంస్థ: ఆనంద్‌ రాఠీ
రేటింగ్‌: కొనవచ్చు
టర్గెట్‌ ధర: రూ.1,028
ప్రస్తుత ధర: రూ.777

బ్రోకరేజ్‌ సం‍స్థ ఆనంద్‌ రాఠీ ఆర్తి డ్రగ్స్‌ షేరుకు బై రేటింగ్‌ను ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం-22లో ఈపీఎస్‌ 12 రెట్లు పెరుగుతుందన్న ప్రాతిపదికన ఈ షేరుకు టార్గెట్‌ ధరను రూ.1,028గా నిర్ణయించింది. కోవిడ్‌-19 కారణంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో ఈ కంపెనీ నాలుగో త్రైమాసిక ఫలితాల్లో వార్షిక ప్రాతిపదికన 2 శాతం నష్టపోయిందని తెలిపింది. ఏపీఐలు 10-15 శాతం పెరగడంతో, వార్షిక ప్రాతిపదికన స్థూల మార్జిన్‌ 704 బేసిస్‌ పాయింట్లు పెరిగి 37 శాతానికి చేరిందని తెలిపింది. వార్షిక ప్రాతిపదికన 15.9 శాతం ఇబిటా మార్జిన్‌ 368 బేసిస్‌ పాయింట్లకు విస్తరించిందని తెలిపింది. అంతేగాకుండా ఇబిటా 27.5 శాతం పెరిగి రూ.713 మిలియన్లకు చేరిందని తెలిపింది.ఆర్థిక సంవత్సరం 20-22లలో నికర లాభం 13.7 శాతం, 20.3 శాతంగా ఉండవచ్చని వెల్లడించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.1879.15 కోట్లుగా ఉంది. బీఎస్‌ఈలో ప్రస్తుతం ఈ కంపెనీ షేరు రూ.777 గా ఉంది.

కంపెనీ పేరు: సీజీ కన్జూమర్‌ ఎలక్ట్రీకల్స్‌
బ్రోకరేజ్‌ సంస్థ: ఆనంద్‌ రాఠీ
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.270
ప్రస్తుత ధర: రూ.202

బ్రోకరేజ్‌ సం‍స్థ ఆనంద్‌ రాఠీ సీజీ కన్జూమర్‌ ఎలక్ట్రీకల్స్‌ షేరుకు బై రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్‌ ధరను రూ.270 నిర్ణయించింది.కోవిడ్‌-19 కారణంగా విక్రయాలు మందగించి వార్షిక ప్రాతిపదికన సీజీ కన్జూమర్స్‌ ఆదాయం 16శాతం, ఇబిటా 18 శాతం, నికర లాభం 30 శాతానికి పడిపోయాయని బ్రోకరేజ్‌ సం‍స్థ తెలిపింది. లాడౌన్‌ తర్వాతా విక్రయాలు పుంజుకుంటాయని, ఈషేర్లు కొనవచ్చని ఆనంద్‌ రాఠీ తెలిపింది. ప్రస్తుతం సీజీ కన్జూమర్‌ ఎలక్ట్రీకల్స్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.12859.32 కోట్లుగా ఉంది. బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు ధర ప్రస్తుతం రూ.202.95గా ఉంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement