stock booking
-
స్టాక్ ఫలితాల వేళ ఇవి పాటిస్తే మేలు
దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు ఒక్కొక్కటిగా తమ రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. స్టాక్ ఫలితాలకు తగ్గట్టుగా మన పెట్టుబడి వ్యూహాన్ని మారుస్తుంటాం. అయితే కొన్ని రోజులుగా మార్కెట్‌ను అనుసరిస్తున్నవారు, కొత్తగా మార్కెట్లోకి వచ్చినవారు ఈ సమయంలో ఎలా స్పందించాలో నిపుణులు కొన్ని సలహాలు సూచనలు చేస్తున్నారు. • మన పోర్ట్‌ఫోలియోలోని కంపెనీలు వాటి ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తుందో ట్రాక్ చేయాలి. ఇది సాధారణంగా ముందుగానే షెడ్యూల్ చేస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇన్వెస్టర్ రిలేషన్స్ వెబ్సైట్లో పొందుపరుస్తారు. • ఫలితాల్లో కంపెనీలు తమ ఆదాయాలు, బ్యాలెన్స్ షీట్, క్యాష్‌ఫ్లో సహా దాని ఆర్థిక నివేదికలను ప్రకటిస్తాయి. స్టాక్‌కు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేముందు వాటిని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. ఈ నివేదికల వల్ల కంపెనీ పనితీరును సమీక్షించడానికి వీలువతుంది. • కంపెనీలు ఫలితాలు విడుదల చేయడానికి ముందే ఆర్థిక నిపుణలు, విశ్లేషకులు తరచు సంస్థ పనితీరును గమనిస్తూ రిజల్ట్స్‌ను అంచనా వేస్తారు. ఈ అంచనాలతో వాస్తవ ఫలితాలను సరిపోల్చాలి. ఒకవేళ ఫలితాలు అంచనాలను మించి ఉంటే అది సానుకూలంగా పరిగణించవచ్చు. • గతంలో కంపెనీ పనితీరు ఎలా ఉంది.. ఫలితాలు ప్రభావితం చేసే ఏవైనా ఆర్థిక అంశాలు ఉన్నాయో అర్థం చేసుకోవాలి. • చాలా కంపెనీలు వాటి భవిష్యత్ పనితీరుపై మార్గదర్శకత్వం లేదా ఔట్‌లుక్‌ను విడుదల చేస్తాయి. సానుకూలంగా నివేదికలు అందించే కంపెనీల్లో స్టాక్ పెరుగుదల చూడవచ్చు. • ఫలితాల వల్ల మార్కెట్ ఎలా స్పందిస్తుందో గమనించాలి. ఒక్కోసారి స్టాక్ ధర వేగంగా పడిపోవచ్చు..పెరగొచ్చు. స్టాక్ సంబంధించిన అన్ని అంశాలను గమనించాలి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులైతే స్టాక్ ధరలో హెచ్చుతగ్గులు అంతగా పట్టించుకోవద్దు. స్వల్పకాలిక మార్కెట్ కదలికల ఆధారంగా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకూడదు. • ఒకే కంపెనీలో కాకుండా పోర్ట్‌ఫోలియో డైవర్సిఫై చేయడం ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏదైనా కంపెనీ అనుకున్న ఫలితాలు విడుదల చేయకపోయినా పోర్ట్‌ఫోలియో పెద్దగా నష్టాల్లోకి వెళ్లకుండా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలు, లాభాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఫలితాల ఆధారంగా స్టాక్ అమ్మాలో, కొనాలో అనే నిర్ణయం తీసుకోవడానికి ముందు కంపెనీ భవిష్యత్తు పనితీరును పరిగణలోకి తీసుకోవాలి. -
సంవత్ 2077కు 5 బ్లూచిప్ స్టాక్స్
ముంబై: ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడిన లిక్విడిటీ, ఇటీవల కొద్ది రోజులుగా వేగమందుకున్న ఆర్థిక రికవరీ వంటి అంశాలు దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ నిస్తున్నట్లు బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తాజాగా పేర్కొంది. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ.. ప్రస్తుతం 18 పీఈలో ట్రేడవుతున్నట్లు తెలియజేసింది. దీర్ఘకాలిక సగటుకు చేరువలో నిఫ్టీ కదులుతున్నదని, ఈ స్థాయిలో మార్కెట్లు మరీ ఖరీదైనవిగా పోల్చకూడదని అభిప్రాయపడింది. ఇటీవల కనిపిస్తున్న ఆర్థిక పురోగతి, ప్రపంచ మార్కెట్ల లిక్విడిటీ తదితరాలతో కంపెనీలు మెరుగైన పనితీరు ప్రదర్శించే వీలున్నట్లు అంచనా వేస్తోంది. ఇవన్నీ మార్కెట్లకు అనుకూలంగా కనిపిస్తున్నట్లు తెలియజేసింది. అయితే ఇటీవల ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 రెండో దశ.. రిస్కులు పెంచుతున్నట్లు పేర్కొంది. దీంతో మార్కెట్ కరెక్షన్లకూ అవకాశమున్నట్లు అభిప్రాయపడింది. ప్రధానంగా జీడీపీ రికవరీ ప్రభావం చూసే అంశమని తెలియజేసింది. ఈ పరిస్థతుల నేపథ్యంలో రానున్న 12 నెలల కాలానికి ఐటీ, హెల్త్ కేర్, గ్రామీణం- వ్యవసాయం, టెలికం, కన్జూమర్, ఫైనాన్షియల్ రంగాలపట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలియజేసింది. వెరసి సంవత్ 2077కు ఐదు లార్జ్ క్యాప్ కంపెనీలు పెట్టుబడులకు అనువైనవిగా భావిస్తున్నట్లు పేర్కొంది. బ్రోకింగ్ సంస్థ అభిప్రాయాలు చూద్దాం.. భారతీ ఎయిర్టెల్ గత కొద్ది త్రైమాసికాలలో కంపెనీ నిర్వహణ భారీగా మెరుగుపడింది. గత రెండు క్వార్టర్లలో మొబైల్ బిజినెస్ ఇబిటా 16 శాతం పురోగమించడం ద్వారా ఈ అంశం వెల్లడవుతోంది. ఈ కాలంలో 10 మిలియన్ కొత్త వినియోగదారులను జత చేసుకుంది. ఫలితంగా మొత్తం ఏఆర్ పీయూ 5 శాతం బలపడింది. ప్రస్తుత ధర: రూ. 450- టార్గెట్: రూ. 650 స్టేట్ బ్యాంక్ లాభార్జన సాధారణ స్థాయికి చేరుకునే పరిస్థితులు ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులలో స్టేట్ బ్యాంక్ ఉత్తమ సంస్థకాగా.. ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టడం, 71 శాతం పీసీఆర్, పటిష్ట నెట్వర్క్, పెట్టుబడుల సామర్థ్యం సానుకూల అంశాలుగా చెప్పవచ్చు. నిర్వహణ లాభాలు మెరుగుపడుతున్నాయి. ప్రస్తుత ధర: రూ. 218- టార్గెట్: రూ. 300 హీరో మోటోకార్ప్ ప్రత్యర్థి సంస్థలతో పోలిస్తే ద్విచక్ర వాహన విభాగంలో కనిపిస్తున్న వేగవంత రికవరీని హీరో మోటోకార్ప్ అందిపుచ్చుకునే వీలుంది. గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఎంట్రీలెవల్, ఎగ్జిక్యూటివ్ విభాగాలలో పట్టు కంపెనీకి సానుకూల అంశాలు. బీఎస్-6 ప్రమాణాల తదుపరి పోటీలో ముందుంటోంది. ప్రస్తుత ధర: రూ. 2,943- టార్గెట్: రూ. 3,700 ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22) నుంచీ పుంజుకోనున్న ఐటీ వ్యయాలు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ కు అవకాశాలను పెంచే వీలుంది. భవిష్యత్‌లో సాఫ్ట్ వేర్ సర్వీసుల రంగానికి డిమాండ్ కొనసాగనుంది. తద్వారా కంపెనీ లబ్ది పొందనుంది. ప్రాధాన్యతగల డీల్స్ కుదుర్చుకోవడం, మార్జిన్లను మెరుగుపరచుకోవడం వంటి సానుకూలతలకు చాన్స్ ఉంది. ప్రస్తుత ధర: రూ. 1,119- టార్గెట్: రూ. 1,355 అల్ట్రాటెక్ సిమెంట్ దేశవ్యాప్తంగా పంపిణీ విభాగంలో పటిష్ట నెట్వర్క్ కలిగి ఉంది. మౌలిక సదుపాయాల కీలక ప్రాజెక్టులకు ప్రాధాన్యమున్న సరఫరా సంస్థగా నిలుస్తోంది. దీంతో అటు సంస్థాగత, ఇటు రిటైల్ విభాగంలో సిమెంటుకు ఏర్పడే డిమాండ్ ను అందుకునే అవకాశముంది. ప్రస్తుత ధర: రూ. 4,565- టార్గెట్: రూ. 5,600 (గమనిక: ఇవి బ్రోకింగ్ సంస్థ అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేపట్టేముందు మార్కెట్ నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి. ) -
జేఎంసీ ప్రాజెక్ట్స్, కేపీఐటీ టెక్ బై:బ్రోకరేజ్‌ల సిఫార్సులు
దాదాపు మూడు నెలల తర్వాతా ఇప్పుడిప్పుడే ప్రజలు, పరిశ్రమలు క్రమక్రమంగా మునుపటి జీవనశైలికి అలవాటుపడుతున్నారు. దీంతో దేశీయంగానేగాక, అంతర్జాతీయంగాను పరిస్థితులు కాస్త కుదుటపడుతున్నట్లు కనిపిస్తునప్పటికీ స్టాక్ మర్కెట్లు వోలటాలిటీని ప్రదర్శిస్తున్నాయి. ఇక ఇండియాలో మే 31తో లాక్డౌన్ 4.0 ముగియనుండడంతో జూన్ 1 నుంచి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి స్టాక్ మార్కెట్లు ట్రేడ్ అవుతాయని బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. ఇటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో కొన్ని షేర్లను కొనవచ్చని ఇన్వెస్టర్లకు బ్రోకరేజ్‌లు సిఫార్సు చేస్తున్నాయి. అవి ఈ కింది విధంగా ఉన్నాయి. కంపెనీ పేరు: జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ బ్రోకరేజ్ సంస్థ: జియోజిత్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.1,903 ప్రస్తుత ధర: రూ.1658 బ్రోకరేజ్ సంస్థ జియోజిత్ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ షేరుకు బయ్ రేటింగ్‌ను ఇస్తూ, టార్గెట్ ధరను రూ.1,903 గా నిర్ణయించింది.లాక్డౌన్ కారణంగా నాలుగో త్రైమాసికంలో జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఆదాయ వృద్ధి తగ్గిందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. వార్షిక ప్రాతిపదికన స్టాండెలోన్ రెవెన్యూ 3.8శాతం పెరిగి రూ.898 కోట్లకు చేరిందని వెల్లడించింది. కోవిడ్ సంక్షోభంలో జీరో కాంటాక్ట్ డెలివరీ బిజినెస్ మోడల్‌ను ఈ కంపెనీ ప్రారంభించిందని, దీంతో క్రమంగా విక్రయాలు పుంజుకుని వృద్ధి నమోదవుతుందని తెలిపింది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు ధర రూ.1658.50గా ఉంది. కంపెనీ పేరు: కేపీఐటీ టెక్నాలజీస్ బ్రోకరేజ్ సంస్థ: సెంట్రమ్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.72 ప్రస్తుత ధర: రూ.49 బ్రోకరేజ్ సంస్థ సెంట్రమ్ కేపీఐటీ టెక్నాలజీస్ షేరుకు బయ్ రేటింగ్‌ను సిఫార్సు చేస్తోంది. ఆర్థిక సంవత్సరం-22లో 11 పీఈ అంచనాతో టార్గెట్ ధరను రూ.72 గా నిర్ణయించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కేపీఐటీ టెక్నాలజీస్ డాలర్ ఆదాయాలు, ఇబిటా మార్జిన్లు స్థిరంగా ఉన్నాయని, నికర లాభం అంచనాలను అందుకోలేక పోయిందని తెలిపింది. కోవిడ్, మీడియం టర్మ్ సవాళ్ల కారణంగా ఆర్థిక సంవత్సరం-21లోలో డాలర్ రెవెన్యూ 15 శాతం పడిపోతుందని వెల్లడించింది. కాగా బీఎస్ఈలో కేపీఐటీ షేరు ప్రస్తుత ధర రూ.49.20 గా ఉంది. కంపెనీ పేరు:జేఎంసీ ప్రాజెక్ట్స్ బ్రోకరేజ్ సంస్థ: యస్ సెక్యూరిటీస్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.50 ప్రస్తుత ధర: రూ.44 యస్ సెక్యూరిటీస్ జేఎంసీ ప్రాజెక్ట్స్ షేరుకు బయ్ రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్ ధరను రూ.50 గా నిర్ణయించింది.వార్షిక ప్రాతిపదికన క్యూ4లో ఈ కంపెనీ స్టాండేలోన్ రెవెన్యూ తగ్గి రూ.940 కోట్లుగా నమోదైందని, లాక్డౌన్ ప్రభావంతో ఆదాయం తగ్గిందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. దాదాపు 10-12 రోజుల పాటు లాక్డౌన్ ప్రభావం ఉన్నప్పటికీ మార్జిన్ మాత్రం 11.3 శాతం పెరిగిందని తెలిపింది. టాప్‌లైన్, మార్జిన్స్‌పై కోవిడ్ ప్రభావాన్ని దృష్టిలోపెట్టుకుని ఆర్థిక సంవత్సరం-21,22లలో అంచనాలను తగ్గిస్తున్నట్లు బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో ఈ కంపెని షేరు ధర రూ.44.50 గా ఉంది. కంపెనీ పేరు: జీహెచ్‌సీఎల్ బ్రోకరేజ్ సంస్థ: ఎమ్కే గ్లోబల్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.155 ప్రస్తుత ధర: రూ.106 జీహెచ్‌సీఎల్ కంపెనీ షేరుకు బ్రోకరేజ్ సంస్థ ఎమ్కే గ్లోబల్ బయ్ రేటింగ్‌ను ఇస్తూ ఏడాది కాలానికి గాను టార్గెట్ ధరను రూ.155 గా నిర్ణయించింది. ఈ కంపెనీ ఆదాయం నాలుగో త్రైమాసికంలో బ్రోకరేజ్ అంచనాలను అందుకోలేకపోయిందని తెలిపింది. వార్షిక ప్రాతిపదికన రెవెన్యూ 6.2 శాతం పడిపోయిందని తెలిపింది. ఆటోమొబైల్,కన్స్ట్రక్షన్ సెక్టార్లు నెమ్మదించడంతో సోడాయాష్‌కు డిమాండ్ పడిపోయిందని, టెక్స్టైల్స్ విభాగం భారీగా దెబ్బతిందని తెలిపింది. టెక్స్టైల్స్ సోడాయష్ వ్యాపారాలను రెండింటి కలిపి ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదనను జీహెచ్‌సీఎల్ చేసిందని, దీనికి రెగ్యులేటరీ నుంచి ఆమోదం లభిస్తే జీహెచ్‌సీఎల్ వ్యాపారం పుంజుకుంటుందని తెలిపింది. ఆర్థిక సంవత్సరం-23లో ఇబిటా మూడు రెట్లు పెరుగుతుందని బ్రోకరేజ్ సంస్థ అంచనావేసింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో జీహెచ్‌సీఎల్ షేరు ధర రూ.106 గా ఉంది. -
రాబడినిచ్చే షేర్లివే...బ్రోకరేజ్‌ల సిఫార్సులు
గత రెండు మూడు సెషన్లలో దేశీయ మార్కెట్లు ఆటుపోట్లకు గురవుతున్నాయి. అంతర్జాతీయంగా, దేశీయంగాను ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా, అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేయాలనీ బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతమున్న మార్కెట్ స్థితిగతులకు అనుగుణంగా వివిధ షేర్లపై ఏంజిల్ బ్రోకింగ్, ఆనంద్ రాఠీల సిఫార్సులు ఈ విధంగా ఉన్నాయి. కంపెనీ పేరు: భారతీ ఎయిర్టెల్ బ్రోకరేజ్ సంస్థ: ఏంజిల్ బ్రోకింగ్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.629 ప్రస్తుత ధర: రూ.593 బ్రోకరేజ్ సంస్థ ఏంజిల్ బ్రోకింగ్ భారతీ ఎయిర్టెల్ షేరుకు బై రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్ ధరను రూ.629గా నిర్ణయించింది. ఈ కంపెనీ గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నికర నష్టం రూ.5,237 కోట్లుగా నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.107.2 కోట్లుగా ఉంది. గతేడాది క్యూ4తో పోలిస్తే ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు రాబడి (ఏఆర్పీయూ )రూ.123 నుంచి 154 పెరిగింది. దీంతో నాలుగో త్రైమాసికంలో కంపెనీ వృద్ధి 15.1 శాతం నమోదు చేసి కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.23,723 కోట్లుగా నమోదైందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. 2019 నవంబర్‌లో టెలికాం కంపెనీలు టారీఫ్‌లు 35 శాతం పెంచాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మరోసారి టెలికాం కంపెనీలు టారీఫ్‌లు పెంచే అవకాశం ఉందని, అప్పుడు ఈ కంపెనీకి మంచి లాభాలు వస్తాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.319177.38 కోట్లుగా ఉంది. ప్రస్తుతం బీఎస్ఈలో భారతీ ఎయిర్టెల్ షేరు ధర రూ.593.10గా ఉంది. కంపెనీపేరు: ఆల్కెమ్ ల్యాబ్స్ బ్రోకరేజ్‌సంస్థ: ఏంజిల్ బ్రోకింగ్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.3,300 ప్రస్తుత ధర: రూ.2,349 ఆల్కెమ్ ల్యాబ్స్‌కు బ్రోకరేజ్‌సంస్థ ఏంజిల్ బ్రోకింగ్ బై రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్ రేటింగ్‌ను రూ.3,00గా నిర్ణయించింది. ఈ ల్యాబ్స్‌కు దేశీయ జనరిక్ మందులు, ఏపీఐ వ్యాపారాల ద్వారా 67 శాతం ఆదాయం వస్తుదని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. యాంటీ ఇన్ఫెక్టివ్ అండ్ క్రోనిక్ వ్యాపారాలు సైతం రెవెన్యూ వృద్ధికి తోడ్పడతాయని వెల్లడించింది. వచ్చే రెండేళ్లలో ఈ కంపెనీ 1.5 రెట్లు వృద్ది రేటును నమోదు చేస్తుందని అంచనావేస్తున్నట్లు తెలిపింది. మరికొద్ది సంవత్సరాలలో ఆల్కెమ్ ల్యాబ్స్ టాప్‌లైన్ వృద్ధి 13-15 శాతం ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.28674.68 కోట్లుగా ఉంది. బీఎస్ఈలో ప్రస్తుతం ఈ కంపెనీ షేరు ధర రూ.2349.95 గా ఉంది. కంపెనీ పేరు: ఆర్తి డ్రగ్స్ బ్రోకరేజ్‌సంస్థ: ఆనంద్ రాఠీ రేటింగ్: కొనవచ్చు టర్గెట్ ధర: రూ.1,028 ప్రస్తుత ధర: రూ.777 బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ ఆర్తి డ్రగ్స్ షేరుకు బై రేటింగ్‌ను ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం-22లో ఈపీఎస్ 12 రెట్లు పెరుగుతుందన్న ప్రాతిపదికన ఈ షేరుకు టార్గెట్ ధరను రూ.1,028గా నిర్ణయించింది. కోవిడ్-19 కారణంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో ఈ కంపెనీ నాలుగో త్రైమాసిక ఫలితాల్లో వార్షిక ప్రాతిపదికన 2 శాతం నష్టపోయిందని తెలిపింది. ఏపీఐలు 10-15 శాతం పెరగడంతో, వార్షిక ప్రాతిపదికన స్థూల మార్జిన్ 704 బేసిస్ పాయింట్లు పెరిగి 37 శాతానికి చేరిందని తెలిపింది. వార్షిక ప్రాతిపదికన 15.9 శాతం ఇబిటా మార్జిన్ 368 బేసిస్ పాయింట్లకు విస్తరించిందని తెలిపింది. అంతేగాకుండా ఇబిటా 27.5 శాతం పెరిగి రూ.713 మిలియన్లకు చేరిందని తెలిపింది.ఆర్థిక సంవత్సరం 20-22లలో నికర లాభం 13.7 శాతం, 20.3 శాతంగా ఉండవచ్చని వెల్లడించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1879.15 కోట్లుగా ఉంది. బీఎస్ఈలో ప్రస్తుతం ఈ కంపెనీ షేరు రూ.777 గా ఉంది. కంపెనీ పేరు: సీజీ కన్జూమర్ ఎలక్ట్రీకల్స్ బ్రోకరేజ్ సంస్థ: ఆనంద్ రాఠీ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.270 ప్రస్తుత ధర: రూ.202 బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ సీజీ కన్జూమర్ ఎలక్ట్రీకల్స్ షేరుకు బై రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్ ధరను రూ.270 నిర్ణయించింది.కోవిడ్-19 కారణంగా విక్రయాలు మందగించి వార్షిక ప్రాతిపదికన సీజీ కన్జూమర్స్ ఆదాయం 16శాతం, ఇబిటా 18 శాతం, నికర లాభం 30 శాతానికి పడిపోయాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. లాడౌన్ తర్వాతా విక్రయాలు పుంజుకుంటాయని, ఈషేర్లు కొనవచ్చని ఆనంద్ రాఠీ తెలిపింది. ప్రస్తుతం సీజీ కన్జూమర్ ఎలక్ట్రీకల్స్ మార్కెట్ క్యాప్ రూ.12859.32 కోట్లుగా ఉంది. బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ధర ప్రస్తుతం రూ.202.95గా ఉంది. -
ఇక స్టాక్‌యార్డుల్లో నిండుగా ఇసుక
సాక్షి, అమరావతి: వర్షాలు తగ్గడంతో రీచ్‌లలో నీరు ఇంకిపోగానే స్టాక్ యార్డుల నిండుగా ఇసుక నింపి, కోరిన వారికి కోరినంత సరఫరా చేసేందుకు ఏపీఎండీసీ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇసుక పాలసీ అమల్లోకి తెచ్చిన సమయంలోనే ఎగువ ప్రాంతాల్లో, వర్షాలు కురవడం, నదుల్లో వరదనీరు పోటెత్తడం వల్ల ఇసుక సరఫరాలో సమస్య ఏర్పడింది. కొత్త రీచ్‌లకు పర్యావరణ అనుమతులు తీసుకోవడం, స్థలాలు సమకూర్చి స్టాక్ యార్డులను సిద్ధం చేయడం లాంటి పనులన్నీ రాష్ట్ర ప్రభుత్వం–ఏపీఎండీసీ పూర్తి చేశాయి. కొత్త విధానం అమల్లోకి వచ్చి నెల రోజులు కూడా పూర్తికాక ముందే స్వల్ప కాలంలోనే 1.25 లక్షల టన్నుల ఇసుకను ప్రజలకు సరఫరా చేయడం గమనార్హం. కొత్త ఇసుక విధానం సెప్టెంబరు 5న అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి గత నెలాఖరు వరకూ ఇసుక కావాలంటూ 10,358 మంది ఏపీఎండీసీకి ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న రోజు లేదా మరుసటి రోజు ఉదయమే ఇసుక సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో ఓపెన్ రీచ్‌లు ►మొత్తం గుర్తించినవి: 138 ►పర్యావరణ అనుమతులు ఉన్నవి: 115 ►పర్యావరణ అనుమతులు ►పెండింగ్‌లో ఉన్నవి: 23 ►నీట మునిగి ఉన్నవి: 80 ►ఇసుక తవ్వకాలు సాగుతున్నవి: 25 ►డిసిల్టేషన్ కేంద్రాలుమొత్తం: 32 ►ప్రస్తుతం పనిచేస్తున్నవి: 9 రైతుల పట్టా భూములు ►గుర్తించిన రీచ్‌లు: 82 ►తవ్వకాలు జరుగుతున్నవి: 5 -
కమీషన్లకు నోచుకోని మీ సేవ కేంద్రాలు
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: గ తేడాది నవంబర్ నుంచి కమీషన్లు అందలేదని మీ సేవ కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు. వివిధ శాఖలకు, ప్రజలకు వారధిగా ఉంటున్న మీ సేవ కేంద్రాల నిర్వహణ తడిసిమోపెడవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, ఏపీఎస్పీడీసీఎల్, రవాణ, స్టాక్ బుకింగ్, మున్సిపాలిటీ, ట్రాన్సక్షన్ తదితర సేవలను అందిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా శ్రీవెన్ ఏజెన్సీ కింద మీ సేవ కేంద్రాలు నడుస్తున్నాయన్నారు. శ్రీవెన్ ఏజెన్సీ వారు ఏడు నెలలుగా కమీషన్ ఇవ్వడంలేదన్నారు. దీంతో వీటి నిర్వహణ కష్టతరమైందని ఆవేదన చెందుతున్నారు. గది బాడుగ, విద్యుత్ బిల్లు, ఇతర ఖర్చులు భరించలేకున్నామన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులను కలిసినా వారు స్పందించడం లేదన్నారు. ఒక్కోసారి రీచార్జి చేసుకోవాలంటే రూ.50వేలు అవుతుందన్నారు. పెట్టుబడి పెడితేనే లాభాలు వస్తాయని చెబుతున్నారేగానీ, కమీషన్లు ఇవ్వాలన్న ఆలోచన వారికి లేనట్లుందని నిర్వాహకులు అంటున్నారు. సమైక్యాంధ్ర సమ్మె కాలంలో రీచార్జి చేసుకున్నందుకు చార్జీల పేరుతో రు.2,500లకుపైగా వసూలు చేశారని వారు ఆరోపించారు. నిరుద్యోగులకు ప్రభుత్వం కల్పించిన భృతికి ఏజెన్సీవారు గండికొడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. ఒక్కో మీ సేవ కేంద్రానికి ఇప్పటి వరకు రు.70వేల నుంచి లక్ష వరకు కమీషన్లు రావాల్సి ఉందన్నారు. ఈ ఏడాది మార్చిలో శ్రీవెన్ ఏజెన్సీవారు మీ సేవ సాఫ్ట్‌వేర్‌ను మార్చారన్నారు. దీంతో అప్పటివరకు జరిగిన లావాదేవీలు, వాటి వివరాలు, కమీషన్ ఎంత అనే విషయాలు కనిపించడంలేదని నిర్వాహకులు వాపోతున్నారు. ఈ విషయమై కలెక్టర్ స్పందించి తమకు కమీషన్లు ఇప్పించాలని వారు కోరుతున్నారు. వారంలోపు కమీషన్లు చెల్లిస్తాం.. 2013 నవంబర్ నుంచి మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు కమీషన్లు రాలేదని, మరో వారంలోపు చెల్లిస్తామని శ్రీవెన్ ఏజెన్సీ మీ సేవ కేంద్రాల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రాజు ‘న్యూస్‌లైన్’కు వివరణ ఇచ్చారు.