జేఎంసీ ప్రాజెక్ట్స్‌, కేపీఐటీ టెక్‌ బై:బ్రోకరేజ్‌ల సిఫార్సులు | stock recomandations | Sakshi
Sakshi News home page

జేఎంసీ ప్రాజెక్ట్స్‌, కేపీఐటీ టెక్‌ బై:బ్రోకరేజ్‌ల సిఫార్సులు

Published Fri, May 29 2020 4:25 PM | Last Updated on Fri, May 29 2020 4:37 PM

stock recomandations - Sakshi

 దాదాపు మూడు నెలల తర్వాతా ఇప్పుడిప్పుడే ప్రజలు, పరిశ్రమలు క్రమక్రమంగా మునుపటి జీవనశైలికి అలవాటుపడుతున్నారు. దీంతో దేశీయంగానేగాక, అంతర్జాతీయంగాను పరిస్థితులు కాస్త కుదుటపడుతున్నట్లు కనిపిస్తునప్పటికీ స్టాక్‌ మర్కెట్లు వోలటాలిటీని ప్రదర్శిస్తున్నాయి. ఇక ఇండియాలో మే 31తో లాక్‌డౌన్‌ 4.0 ముగియనుండడంతో జూన్‌ 1 నుంచి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి స్టాక్‌ మార్కెట్లు ట్రేడ్‌ అవుతాయని బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. ఇటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో కొన్ని షేర్లను కొనవచ్చని  ఇన్వెస్టర్లకు బ్రోకరేజ్‌లు సిఫార్సు చేస్తున్నాయి. అవి ఈ కింది విధంగా ఉన్నాయి.


కంపెనీ పేరు: జూబిలెంట్‌ ఫుడ్‌ వర్క్స్‌
బ్రోకరేజ్‌ సంస్థ: జియోజిత్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.1,903
ప్రస్తుత ధర: రూ.1658

బ్రోకరేజ్‌ సంస్థ జియోజిత్‌ జూబిలెంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ షేరుకు బయ్‌ రేటింగ్‌ను ఇస్తూ, టార్గెట్‌ ధరను రూ.1,903 గా నిర్ణయించింది.లాక్‌డౌన్‌ కారణంగా నాలుగో త్రైమాసికంలో  జూబిలెంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ ఆదాయ వృద్ధి తగ్గిందని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. వార్షిక ప్రాతిపదికన స్టాండెలోన్‌ రెవెన్యూ 3.8శాతం పెరిగి రూ.898 కోట్లకు చేరిందని వెల్లడించింది. కోవిడ్‌ సంక్షోభంలో జీరో కాంటాక్ట్‌ డెలివరీ బిజినెస్‌ మోడల్‌ను  ఈ కంపెనీ ప్రారంభించిందని, దీంతో క్రమంగా విక్రయాలు పుంజుకుని వృద్ధి నమోదవుతుందని తెలిపింది. ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ షేరు ధర రూ.1658.50గా ఉంది.

కంపెనీ పేరు: కేపీఐటీ టెక్నాలజీస్‌
బ్రోకరేజ్‌ సంస్థ: సెంట్రమ్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.72
ప్రస్తుత ధర: రూ.49

బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ కేపీఐటీ టెక్నాలజీస్‌ షేరుకు బయ్‌ రేటింగ్‌ను సిఫార్సు చేస్తోంది. ఆర్థిక సంవత్సరం-22లో 11 పీఈ అంచనాతో  టార్గెట్‌ ధరను రూ.72 గా నిర్ణయించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కేపీఐటీ టెక్నాలజీస్‌ డాలర్‌ ఆదాయాలు, ఇబిటా మార్జిన్‌లు స్థిరంగా ఉన్నాయని, నికర లాభం అంచనాలను అందుకోలేక పోయిందని తెలిపింది. కోవిడ్‌, మీడియం టర్మ్‌ సవాళ్ల కారణంగా ఆర్థిక సంవత్సరం-21లోలో డాలర్‌ రెవెన్యూ 15 శాతం పడిపోతుందని వెల్లడించింది. కాగా బీఎస్‌ఈలో కేపీఐటీ షేరు ప్రస్తుత ధర రూ.49.20 గా ఉంది.

కంపెనీ పేరు:జేఎంసీ ప్రాజెక్ట్స్‌
బ్రోకరేజ్‌ సంస్థ: యస్‌ సెక్యూరిటీస్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.50
ప్రస్తుత ధర: రూ.44

యస్‌ సెక్యూరిటీస్‌ జేఎంసీ ప్రాజెక్ట్స్ షేరుకు బయ్‌ రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్‌ ధరను రూ.50 గా నిర్ణయించింది.వార్షిక ప్రాతిపదికన క్యూ4లో ఈ కంపెనీ స్టాండేలోన్‌ రెవెన్యూ తగ్గి రూ.940 కోట్లుగా నమోదైందని, లాక్‌డౌన్‌ ప్రభావంతో ఆదాయం తగ్గిందని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. దాదాపు 10-12 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రభావం ఉన్నప్పటికీ మార్జిన్‌ మాత్రం 11.3 శాతం పెరిగిందని తెలిపింది. టాప్‌లైన్‌, మార్జిన్స్‌పై కోవిడ్‌ ప్రభావాన్ని దృష్టిలోపెట్టుకుని ఆర్థిక సంవత్సరం-21,22లలో అంచనాలను తగ్గిస్తున్నట్లు బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ కంపెని షేరు ధర రూ.44.50 గా ఉంది.

కంపెనీ పేరు: జీహెచ్‌సీఎల్‌
బ్రోకరేజ్‌ సంస్థ: ఎమ్‌కే గ్లోబల్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.155
ప్రస్తుత ధర: రూ.106

జీహెచ్‌సీఎల్‌ కంపెనీ షేరుకు బ్రోకరేజ్‌ సంస్థ ఎమ్‌కే గ్లోబల్‌ బయ్‌ రేటింగ్‌ను ఇస్తూ ఏడాది కాలానికి గాను టార్గెట్‌ ధరను రూ.155 గా నిర్ణయించింది. ఈ కంపెనీ ఆదాయం నాలుగో త్రైమాసికంలో బ్రోకరేజ్‌ అంచనాలను అందుకోలేకపోయిందని తెలిపింది. వార్షిక ప్రాతిపదికన  రెవెన్యూ 6.2 శాతం పడిపోయిందని తెలిపింది. ఆటోమొబైల్‌,కన్‌స్ట్రక‌్షన్‌ సెక్టార్‌లు నెమ్మదించడంతో సోడాయాష్‌కు డిమాండ్‌ పడిపోయిందని, టెక్స్‌టైల్స్‌ విభాగం భారీగా దెబ్బతిందని తెలిపింది. టెక్స్‌టైల్స్‌ సోడాయష్‌ వ్యాపారాలను రెండింటి కలిపి ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదనను జీహెచ్‌సీఎల్‌ చేసిందని, దీనికి రెగ్యులేటరీ నుంచి ఆమోదం లభిస్తే జీహెచ్‌సీఎల్‌ వ్యాపారం పుంజుకుంటుందని తెలిపింది. ఆర్థిక సంవత్సరం-23లో ఇబిటా మూడు రెట్లు పెరుగుతుందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనావేసింది. కాగా ప్రస్తుతం బీఎస్‌ఈలో జీహెచ్‌సీఎల్‌ షేరు ధర రూ.106 గా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement