న్యూఢిల్లీ: బీఎస్–6 ప్రమాణాల వాహనాలకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉంటామని వాహన తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ప్రకటించింది. అత్యున్నత న్యాయస్థానం స్పష్టత నేపథ్యంలో 2020 ఏప్రిల్ 1 నుంచి కేవలం బీఎస్–6 వాహనాల విక్రయం, రిజిస్ట్రేషన్ మాత్రమే జరిగేలా పూర్తి స్థాయి లో కృషి చేస్తామని వివరించింది. అమ్ముడుపోకుండా మిగిలిపోయిన బీఎస్–6యేతర వాహనాలను నిర్దిష్ట గడువు తర్వాత కూడా విక్రయించుకునేలా కొంత వ్యవధి ఇవ్వాలన్న వాదనలను సుప్రీం కోర్టు తోసిపుచ్చడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment