
ముంబై : అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో సానుకూల పరిణామాలతో స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడుతున్నాయి. బ్యాంక్, ఆటోమొబైల్ సహా దాదాపు అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది. కొనుగోళ్ల మద్దతుతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 41,000 మార్క్ ఎగువన కొనసాగుతోంది. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్ 176 పాయింట్ల లాభంతో 40,092 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 61 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 12,099 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment