న్యూఢిల్లీ: కేంద్ర కెబినెట్ కొత్త తరహాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను ఆమోదించినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. పీఎస్‌యుల ప్రయివేటీకరణను ప్రభుత్వం వేగవంతం చేయనుందని సీనియర్ అధికారులు పేర్కొన్నారు. ఈ కొత్త పాలసీ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అధ్వర్యంలో డీఐపీఏఎమ్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మెనెజ్‌మెంట్) వ్యూహాత్మక అమ్మకాలను చేపడుతుందని, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని అధికారులు తెలిపారు. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కెబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం
కాగా, నీతి అయోగ్, డీఐపీఏఎమ్ సంయుక్తంగా పెట్టబడుల ఉపసంహరణను చేపడుతుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.05 లక్షల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేట్ పన్ను మినహాయింపు నిర్ణయానికి ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తోందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీలో ద్రవ్యలోటును 3.3శాతం తేవడానికి పెట్టుబడుల ఉపసంహరణ కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment