కెయిర్న్ డీల్‌పై ఎల్‌ఐసీతో వేదాంత వర్గాల భేటీ | Cairn India officials meet LIC brass, allay concerns | Sakshi
Sakshi News home page

కెయిర్న్ డీల్‌పై ఎల్‌ఐసీతో వేదాంత వర్గాల భేటీ

Published Wed, Jun 17 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM

కెయిర్న్ డీల్‌పై ఎల్‌ఐసీతో వేదాంత వర్గాల భేటీ

కెయిర్న్ డీల్‌పై ఎల్‌ఐసీతో వేదాంత వర్గాల భేటీ

ముంబై: కెయిర్న్-వేదాంత విలీనానికి సంబంధించి మైనారిటీ వాటాదారు ఎల్‌ఐసీ అధికారులతో కెయిర్న్ ఇండియా అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. డీల్ వేల్యుయేషన్, విలీనానంతరం ఏర్పడే సంస్థ రుణ భారం తదితర అంశాలపై ఎల్‌ఐసీ వర్గాలు సందేహాలు వ్యక్తం చేశాయి. అయితే, వీటన్నింటిపై కెయిర్న్ ఇండియా అధికారులు తగు వివరణ ఇచ్చినట్లు సమాచారం. వేదాంత-కెయిర్న్ విలీనం కంపెనీకి ప్రయోజనం చేకూర్చగలదని వారు పేర్కొన్నట్లు ఎల్‌ఐసీ వర్గాలు వివరించాయి. విలీనానికి సంబంధించి వివిధ కోణాలన్నీ పరిశీలించాక..కెయిర్న్ ఇండియా ఏజీఎం తేదీ లోగా తమ నిర్ణయాన్ని తెలియజేయనున్నట్లు తెలిపాయి. జులై 21న కెయిర్న్ ఇండియా ఏజీఎం నిర్వహించనుంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement