జీవిత బీమాలో దగా.. | Cheating in the LIC | Sakshi
Sakshi News home page

జీవిత బీమాలో దగా..

Published Sat, Feb 11 2017 1:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

జీవిత బీమాలో దగా.. - Sakshi

జీవిత బీమాలో దగా..

  • గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో బయటపడ్డ భారీ మోసం
  • సూక్ష్మ బీమా సొమ్ము దారి మళ్లింపు
  • పాలసీలు సరెండర్‌ చేసి రూ.కోట్లు కొల్లగొట్టిన ఎల్‌ఐసీ అధికారులు, డిస్ట్రిబ్యూటర్లు!
  • తీవ్రంగా నష్టపోయిన పేదలు, కార్మికులు, రైతులు, రైతు కూలీలు
  • సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: సూక్ష్మ బీమా పేరిట పేదల నుంచి రూ.కోట్లు కొల్ల గొట్టారు. భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)లో భారీ కుంభకోణం చోటుచేసు కుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దా దాపు అన్ని జిల్లాల్లోనూ పేదలు, కార్మికులు, రైతులను మోసం చేశారు. అయినా ఎల్‌ఐసీ గానీ, ప్రభుత్వం గానీ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

    లక్షల్లో డమ్మీ పాలసీలు
    సూక్ష్మ బీమా పథకాన్ని ఎల్‌ఐసీ దాదాపు దశాబ్దం క్రితం ప్రారంభించింది. ప్రీమియం వసూలు చేయడానికి ఎన్జీఓలను, ప్రైవేట్‌ సంస్థలను నియమించింది. వారిని ‘డిస్ట్రి బ్యూటర్లు’గా వ్యవహరిస్తోంది. ఈ డిస్ట్రిబ్యూ టర్లు తమ కింద పెద్ద సంఖ్యలో ఏజెంట్లను నియమించుకున్నారు. వారిని ‘మైక్రో ఏజెంట్లు’గా పిలుస్తారు. సూక్ష్మ బీమా గురించి ఎల్‌ఐసీ విస్తృతంగా ప్రచారం చేయడం, ఎల్‌ఐసీ బ్రాండ్, లోగోతో బ్రోచర్లు ముద్రించడం వల్ల ప్రజలు సులభంగా నమ్మారు. ప్రీమియం కూడా తక్కువ కావడంతో లక్షల సంఖ్యలో సూక్ష్మ బీమా పాలసీలు తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలో 1.7 లక్షల మంది, కృష్ణా జిల్లాలో 1.5 లక్షలు, నెల్లూరు జిల్లాలో 1.4 లక్షల మంది ఈ పాలసీలు తీసుకున్నారు. మిగతా జిల్లాల్లోనూ లక్షల సంఖ్యలో పాలసీలు తీసుకున్నారు. ఏజెంట్లు వసూలు చేసిన ప్రీమియం సొమ్మును ఎల్‌ఐసీ కార్యాలయాల్లోనే జమ చేయడానికి అవకాశం కల్పించారు. వారంతా ఆ డబ్బును సూక్ష్మ బీమా పాలసీలకు జమ చేయకుండా అతి తక్కువ ప్రీమియంతో ప్రారంభించిన లక్షలాది ‘డమ్మీ’ పాలసీలకు మళ్లించారు. తర్వాత ఆ పాలసీలను సరెండర్‌ చేసి సొమ్ము చేసుకున్నారు.

    సొమ్ము హాంఫట్‌...
    ఎల్‌ఐసీ జీవన్‌ మధుర్, జీవన్‌దీప్, జీవన్‌ మంగళ్, భాగ్యలక్ష్మి, న్యూ భాగ్యలక్ష్మి... ఇవన్నీ సూక్ష్మ బీమా పాలసీల పేర్లు. ప్రకాశం జిల్లాలో ఎల్‌ఐసీ జీవన్‌ మధుర్‌ పేరిట 1.7 లక్షల పాలసీలను జారీ చేశారు. జాన్‌బాబు నేతృ త్వంలోని ‘భాను హోమ్‌ ఫర్‌ డిస్టిట్యూడ్‌ అండ్‌ అల్‌లైడ్‌ ఆర్గనైజేషన్‌’కు ప్రీమియం వసూలు చేసిపెట్టే బాధ్యతను 2008లో ఎల్‌ఐసీ అప్పగించింది. ఐదేళ్ల తర్వాత తమ పాలసీలు మెచ్యూరై డబ్బు తీసుకోవడానికి ఎల్‌ఐసీ కార్యాలయా లకు వెళ్లిన వారికి.. పాలసీలన్నీ ల్యాప్స్‌ అయ్యా యని, తాము చెల్లించిన సొమ్ము తమ పాలసీ ఖాతాలో జమ కాలేదని గుర్తించారు. ఎల్‌ఐసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పెద్దగా స్పం దించలేదు.

    పోలీస్‌ స్టేషన్‌లో కేసులు పెట్టి నా.. పోలీసులు విచారణ జరపలేదు. ప్రకా శం, నెల్లూరు జిల్లాల్లో కేసులు నమోదవుతుం టే.. మచిలీపట్నం డివిజన్‌లో న్యూ జీవన్‌ మంగళ్‌ పేరిట కొత్తగా సూక్ష్మ బీమాను ఎల్‌ఐసీ ప్రారంభించింది. ప్రకాశం జిల్లాలో ప్రజలను మోసం చేసిన జాన్‌బాబే తన బంధువుల పేరిట ‘గ్రీన్స్‌ మైక్రో ఇన్సూరెన్స్‌’ పేరిట ఏర్పాటు చేసిన సంస్థకు ప్రీమియం వసూలు చేసే బాధ్యతను ఎల్‌ఐసీ అప్పగించ డం గమనార్హం. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 3.2 లక్షల మందికిపైగా పాలసీదారులను మోసం చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement