Cairn-Vedanta
-
వేదాంత కెయిర్న్ ఆయిల్ సీఈవోగా నిక్ వాకర్
న్యూఢిల్లీ: వేదాంతకు చెందిన కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ నూతన సీఈవోగా నిక్ వాకర్‌ను నియమించుకుంది. జనవరి 5 నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చినట్టు ప్రకటన విడుదల చేసింది. దీనికి ముందు వరకు నిక్ వాకర్ యూరప్‌కు చెందిన ప్రముఖ అన్వేషణ, ఉత్పత్తి కంపెనీ అయిన లండిన్ ఎనర్జీకి సీఈవో, ప్రెసిడెంట్‌గా పనిచేశారు. -
కెయిర్న్ డీల్‌పై ఎల్ఐసీతో వేదాంత వర్గాల భేటీ
ముంబై: కెయిర్న్-వేదాంత విలీనానికి సంబంధించి మైనారిటీ వాటాదారు ఎల్ఐసీ అధికారులతో కెయిర్న్ ఇండియా అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. డీల్ వేల్యుయేషన్, విలీనానంతరం ఏర్పడే సంస్థ రుణ భారం తదితర అంశాలపై ఎల్ఐసీ వర్గాలు సందేహాలు వ్యక్తం చేశాయి. అయితే, వీటన్నింటిపై కెయిర్న్ ఇండియా అధికారులు తగు వివరణ ఇచ్చినట్లు సమాచారం. వేదాంత-కెయిర్న్ విలీనం కంపెనీకి ప్రయోజనం చేకూర్చగలదని వారు పేర్కొన్నట్లు ఎల్ఐసీ వర్గాలు వివరించాయి. విలీనానికి సంబంధించి వివిధ కోణాలన్నీ పరిశీలించాక..కెయిర్న్ ఇండియా ఏజీఎం తేదీ లోగా తమ నిర్ణయాన్ని తెలియజేయనున్నట్లు తెలిపాయి. జులై 21న కెయిర్న్ ఇండియా ఏజీఎం నిర్వహించనుంది.