హెచ్‌డీఎఫ్‌సీ నుంచి కేన్సర్ బీమా పాలసీ
బీమా రంగ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ తాజాగా కేన్సర్ కేర్ బీమా పాలసీని ప్రవేశపెట్టింది. ఆరంభ, తదనంతర దశల కేన్సర్‌కు సంబంధించి పాలసీదారుకు ఆర్థిక రక్షణ అందించేలా దీన్ని రూపొందించింది. 18-65 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. దీని కాల వ్యవధి 10 నుంచి 20 ఏళ్లు ఉంటుంది. రూ.10 లక్షల నుంచి రూ. 40 లక్షల దాకా సమ్ అష్యూర్డ్‌ను ఎంచుకోవచ్చు.
కవరేజీ ప్రయోజనాలను బట్టి సిల్వర్, గోల్డ్, ప్లాటినం అంటూ మూడు ప్లాన్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. 35 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలవ్యవధి కోసం రూ. 20 లక్షల కవరేజీ ఎంచుకుంటే ఏడాదికి రూ. 1,800 కంటే తక్కువ ప్రీమియం ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రతి క్లెయిమ్ ఫ్రీ ఇయర్‌కు సమ్ అష్యూర్డ్‌ను 10 శాతం మేర పెంచుకోవచ్చని వివరించింది.
కేన్సర్ నిర్ధారణ అయితే, ప్రీమియం వెయివర్ ఆప్షన్ ఉంటుందని తెలిపింది. మేజర్ కేన్సర్ చికిత్సకు సంబంధించి కుటుంబానికి అయిదేళ్ల పాటు ఆదాయ ప్రయోజనం కూడా ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ పేర్కొంది. కేన్సర్ చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నదయిన నేపథ్యంలో (రూ. 3 లక్షల నుంచి రూ. 25 లక్షల పైగా) ఈ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ ఎండీ అమితాబ్ చౌదరి తెలిపారు. ఇది ఆన్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చని వివరించారు.