
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ చెల్లింపుదారులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. జీఎస్టీఆర్-3బీ రిటర్న్ దాఖలుకు సంబంధించి ఆలస్య రుసుంను ప్రభుత్వం తగ్గించింది. దీంతో జులై 2017 నుంచి జులై 2020కు సంబంధించిన జీఎస్టీఆర్-3 బీ రిటర్న్స్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 30లోపు దాఖలు చేస్తే ఆలస్య రుసుం గరిష్టంగా 500 రూపాయలుగానే ఉండనుంది. ఇక పన్ను చెల్లించనవసరం లేని పక్షంలో ఆలస్య రుసుం చెల్లించాల్సిన పని లేదని కేంద్ర పరోక్ష పన్నుల బోర్డ్ (సీబీఐసీ) ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే తగ్గించిన ఆలస్య రుసుం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ దాఖలు చేసిన జీఎస్టీఆర్-3 బీ రిటర్స్న్‌కు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment