ఫ్లిప్‌కార్ట్‌పై సీసీఐకి ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఈకామర్స్ సైట్ల డిస్కౌంట్లపై వివాదం చెలరేగిన నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర ఆన్‌లైన్ రిటైలర్లపై ఫిర్యాదు వచ్చినట్లు గుత్తాధిపత్య వ్యాపార ధోరణుల నియంత్రణ సంస్థ సీసీఐ వర్గాలు తెలిపాయి. సదరు సంస్థలు అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టే అంశం మీద త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వివరించాయి.
అక్టోబర్ 6న బిగ్ బిలియన్ డే పేరుతో ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ సేల్ ప్రకటించడం, మిగతా ఈకామర్స్ సంస్థలు కూడా పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ఇస్తుండటం వంటి అంశాలపై చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సంప్రదాయ స్టోర్స్‌ను దెబ్బతీస్తున్న ఇలాంటి ఆన్‌లైన్ సంస్థల వ్యాపారాలను నియంత్రించాలని వ్యాపార సంస్థల సమా ఖ్య సీఏఐటీ గతంలోనే వాణిజ్య శాఖను కోరింది.