న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి పీ చిదంబరం మార్చి 5న ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకుల అధిపతులతో సమావేశం కానున్నారు. మొండిబకాయిల భారం, రుణ వృద్ధి, ద్రవ్యపరమైన పనితీరు వంటి అంశాలపై ఆయన ఈ సందర్భంగా చర్చించనున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఆర్థికశాఖ సీనియర్ అధికారులు కూడా సమావేశంలో పాల్గొననున్నారు. తాజా మూలధనం సమకూర్చడంలో భాగంగా 2014- 15 ఆర్థిక సంవత్సరంలో రూ.11,200 కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇవ్వాలని తాజా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ భేటీ జరుగనుంది. ఈ నిధులు ఏ మూలకూ సరిపోవని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఇప్పటికే ప్రకటించింది. నడుస్తున్న ఆర్థిక సంవత్సరం (2013-14) ప్రభుత్వం వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.14,000కోట్లు సమకూర్చినట్లు బడ్జెట్ ప్రసంగంలో చిదంబరం పేర్కొన్నారు.
5న పీఎస్‌యూ బ్యాంకుల చీఫ్స్‌తో చిదంబరం భేటీ
Published Fri, Feb 21 2014 1:20 AM | Last Updated on Mon, Oct 8 2018 7:35 PM
Advertisement
Advertisement