రూ. 6 వేలు దాటిన తెల్ల బంగారం | cotton rate hikes in kareemnagar market | Sakshi
Sakshi News home page

రూ. 6 వేలు దాటిన తెల్ల బంగారం

Published Thu, Jun 23 2016 1:08 AM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

రూ. 6 వేలు దాటిన తెల్ల బంగారం

రూ. 6 వేలు దాటిన తెల్ల బంగారం

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్‌లో పత్తి ధర పరుగులు పెడుతోంది. నెల రోజుల నుంచి క్రమంగా పెరుగుతూ బుధవారం క్వింటాల్ పత్తిగరిష్టంగా రూ.6,021 పలికింది. జమ్మికుంట మార్కెట్‌లో పలికిన ధర ఈ సీజన్‌లో రాష్ట్ర స్థాయిలోనే  రికార్డుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బేళ్లకు, గింజలకు ఉహించని విధంగా డిమాండ్ పలుకుతుండడంతో వ్యాపారులు పోటీ పడి పత్తికి ధరలు చెల్లిస్తున్నారు.. ఇదే మార్కెట్‌లో 2013 సీజన్‌లో పత్తి ధర రూ.6,000-6,800 వరకు పలికింది.

 వరంగల్‌లో రూ. 6వేలకు చేరువలో..: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం క్వింటాలు పత్తి రూ.5,915 ధర పలికి ంది. మూడేళ్లలో ఇదే రికార్డు ధర. హన్మకొండ మండలం ముల్కలగూడెం గ్రామానికి చెందిన ఎల్లగౌడ్ అనే రైతు చాలాకాలం పత్తి నిల్వ చేసి, ఇప్పుడు ధర ఆశాజనకంగా ఉండడంతో 250 బస్తాల పత్తిని మమత ట్రేడర్స్ వారి వద్దకు అమ్మకానికి తెచ్చాడు. మొదటి వేలం పాటలోనే జమ్మికుంటకు చెందిన నర్సింహ ఇండస్ట్రీస్ వ్యాపారి రూ.5,915 అత్యధిక ధరతో కొనుగోలు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement