రైతు సంఘాల నాయకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జోగు రామన్న, పక్కన కలెక్టర్ సిక్తా పట్నాయక్
సాక్షి, ఆదిలాబాద్: పత్తి ధర క్వింటాల్‌కు మార్కెట్‌లో రూ.8.300 పలికింది. నాణ్యమైన పత్తికి కేంద్ర మద్దతు ధర రూ.6,380 ఉండగా, ప్రస్తుత మద్దతు ధర మించి లభిస్తోంది. వానాకాలం పంట దిగుబడి కొనుగోళ్లను ఆదిలాబాద్ మార్కె ట్‌లో శుక్రవారం ప్రారంభించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే జోగు రామన్న, మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఇ.మల్లేశం, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అజ్మీర రాజు సమక్షంలో కొనుగోళ్లు ప్రారంభించారు.
ఉదయం వేలం నిర్వహించగా, వ్యాపారులు రూ.7,800 నుంచి మొదలు పెట్టారు. క్రమంగా పెరుగుతూ రూ.8,300 వరకు ధర పలికింది. మొదటి రోజు కేవలం 242 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు మాత్రమే జరిగాయి. తేమ శాతం అధికంగా రావడంతో వ్యాపారులు 8 శాతం దాటిన తర్వాత ప్రతి అదనపు శాతానికి రూ.82 కోత విధించారు. ప్రస్తుతం ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో పత్తిలో సహజంగానే 20 శాతానికి పైగా తేమ వస్తుందని రైతులు వాపోతున్నారు. కాగా గతేడాది పత్తికి రూ.10వేల వరకు మార్కెట్లో ధర లభించింది. ఈసారి కూడా అంతకుమించి లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment