న్యూఢిల్లీ: టెలికం పరిశ్రమలో ఇటీవలి కాలంలో జియో రాక తర్వాత భారీ స్థిరీకరణతో ఉద్యోగాలకు నష్టం ఏర్పడగా, వచ్చే ఐదేళ్లలో మాత్రం ఏకంగా కోటి ఉద్యోగాల కల్పన జరుగుతుందని టెలికం రంగ నైపుణ్య మండలి అంటోంది. ‘‘టెలికం రంగంలో 40 లక్షల మందికి ఉపాధి పొందుతున్నారు. ఐదేళ్ల తర్వాత టెలికంలో, టెలికం రంగ తయారీలోనూ కలిపి ఉపాధి పొందే వారి సంఖ్య 1.43 కోట్లు ఉంటుంది’’ అని టెలికం రంగ నైపుణ్య మండలి (టీఎస్‌ఎస్‌సీ) సీఈవో ఎస్‌పి కొచర్ తెలిపారు.
జాతీయ నైపుణ్య శిక్షణ కార్పొరేషన్ పరిధిలో టీఎస్‌ఎస్‌సీ పనిచేస్తోంది. మెషిన్ నుంచి మెషిన్ మధ్య సమాచారం, టెలికం తయారీ, మౌలిక సదుపాయలు, సేవల విభాగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడుతుందని తాము అంచనా వేస్తున్నట్టు కొచర్ చెప్పారు. తయారీ రంగ అవకాశాలు భారత్‌కు వస్తున్నాయని, దీంతో టెలికం రంగంలో ఉపాధి అవకాశాలపై ఎక్కువ ఆశాభావంతో ఉన్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment