
ముంబై: జీడీపీలో కరెంటు ఖాతా లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.8 శాతానికి చేరుతుందని ఎస్‌బీఐ నివేదిక తెలియజేసింది. చమురు ధరలు బాగా పెరుగుతుండటం... అదే సమయంలో ఎగుమతుల్లో వృద్ధి ఒక మోస్తరు స్థాయిలోనే ఉండటం ఇందుకు కారణాలుగా పేర్కొంది. వాణిజ్యలోటు కూడా గత ఆర్థిక సంవత్సరంలో 160 బిలియన్ డాలర్లుగా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 188 బిలియన్ డాలర్లకు ఎగియవచ్చని ఎస్‌బీఐ పరిశోధన నివేదిక ‘ఎకోరాప్’ అంచనా వేసింది.
ఎగుమతుల్లో జోరు లేకపోవడం, అదే సమయంలో దిగుమతుల బిల్లు పెరగడం వల్ల జూలై నెలలో దేశ వాణిజ్య లోటు 18 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు పేర్కొంది. ముఖ్యాంశాలు చూస్తే...చైనా యువాన్ విలువ తగ్గింపు నేపథ్యంలో మే, జూన్‌లో ఆ దేశం నుంచి దిగుమతులు పెరిగాయి. అయితే తయారీ వస్తువుల దిగుమతుల్లో మార్పు లేదు. తయారీ వస్తువుల్లోనూ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగుమతులు ఈ ఏడాది ఇంత వరకు చూస్తే తగ్గాయి. కాబట్టి చైనా కరెన్సీ తరుగుదల అన్నది దిగుమతులు పెరిగేందుకు కారణమన్నది సహేతుకం కాదు.
Comments
Please login to add a commentAdd a comment