
రూ.49కే 1 జీబీ 4జీ డేటా: ఆర్‌కామ్
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తాజాగా కొత్త 4జీ యూజర్లకు రూ.49లకే 1 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. అలాగే 3 జీబీ డేటాను రూ.149లకు పొందొచ్చని పేర్కొంది. ‘జాయ్ ఆఫ్ హోలీ’ ఆఫర్‌లో భాగంగా ఆవిష్కరించిన ఈ ప్లాన్‌లలో వినియోగదారులు ఆర్‌కామ్ నుంచి ఆర్‌కామ్‌కు ఉచిత అపరిమిత లోకల్, ఎస్‌టీడీ కాల్స్ చేసుకోవచ్చని తెలిపింది.
కాగా ఈ ప్లాన్స్ వాలిడిటీ 28 రోజులని పేర్కొంది. అలాగే ఏపీ సర్కిల్‌లోని కొత్త 2జీ కస్టమర్లు రూ.49లకే అపరిమిత 2జీ డేటాను వినియోగించుకోవచ్చని, రూ.20ల టాక్‌టైమ్ పొందొచ్చని, నిమిషానికి 25 పైసలు కాల్ చార్జీలు చెల్లిస్తే సరిపోతుందని వివరించింది. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులని పేర్కొంది. ‘మేం ఇంకా 3జీ, 2జీ మార్కెట్‌లో వృద్ధి అవకాశాలున్నాయని భావిస్తున్నాం. అం దుకే ప్రత్యేకమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చాం’ అని ఆర్‌కామ్ కొ–సీఈవో గుర్‌దీప్ సింగ్ తెలిపారు.