హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణ భారంతో సతమతమవుతూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ముందు నిలుచున్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ కేసు ఈ నెల 23న మళ్ళీ విచారణకు రానుంది. విజన్ ఇండియా ఫండ్ జూలై 10న ప్రతిపాదించిన నూతన పరిష్కార ప్రణాళికను డీసీ ఇన్సాల్వెన్సీ రిసొల్యూషన్ ప్రొఫెషనల్ ఎన్‌సీఎల్‌టీ ముందు ఉంచుతారు.
కొత్త ప్లాన్‌ను పరిశీలించడమా లేదా అన్నదానిపై ఆర్.మురళి నేతృత్వంలోని బెంచ్ తుది నిర్ణయం తీసుకోనుంది. పరిశీలించాల్సిందిగా ఎన్‌సీఎల్‌టీ ఆదేశిస్తే కొత్త ప్రతిపాదనపై రుణదాతల కమిటీ తిరిగి చర్చిస్తుంది. ఈసారి రివైజ్డ్ ప్లాన్‌ను కమిటీ తిరస్కరిస్తే డెక్కన్ క్రానికల్ ఆస్తులు అమ్మకానికి (లిక్విడేషన్) పెట్టాల్సి ఉంటుంది. మమతా బినానీ డెక్కన్ క్రానికల్ ఐఆర్‌పీగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment