Deccan Chronicle Holdings
-
డీసీ ప్రమోటర్లకు సెబీ డిమాండ్ నోటీసులు
న్యూఢిల్లీ: 2008–09 నుంచి 2011–12 ఆర్థిక సంవత్సరాల వరకూ చూపిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో అవకతవకల అంశానికి సంబంధించి రూ. 4.29 కోట్లు చెల్లించాలంటూ డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్) ప్రమోటర్లకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ డిమాండ్ నోటీసులు పంపించింది. టి వెంకట్రామ్ రెడ్డి, టి వినాయక్ రవి రెడ్డి, పి.కె. అయ్యర్లు 15 రోజులల్లోగా వడ్డీ, రికవరీ వ్యయాలు కలిపి ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ చెల్లించకపోతే డీసీహెచ్ఎల్ ప్రమోటర్ల స్థిరచరాస్తులను విక్రయించి రికవర్ చేసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అలాగే, వారి ఆస్తులు, బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడంతో పాటు, అరెస్టు చేసి జైల్లోనూ ఉంచే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో విధించిన జరిమానాను చెల్లించడంలో వారు విఫలం కావడంతో సెబీ తాజా నోటీసులు జారీ చేసింది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
డెక్కన్ క్రానికల్ కేసు విచారణ 23న
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణ భారంతో సతమతమవుతూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ముందు నిలుచున్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ కేసు ఈ నెల 23న మళ్ళీ విచారణకు రానుంది. విజన్ ఇండియా ఫండ్ జూలై 10న ప్రతిపాదించిన నూతన పరిష్కార ప్రణాళికను డీసీ ఇన్సాల్వెన్సీ రిసొల్యూషన్ ప్రొఫెషనల్ ఎన్సీఎల్టీ ముందు ఉంచుతారు. కొత్త ప్లాన్‌ను పరిశీలించడమా లేదా అన్నదానిపై ఆర్.మురళి నేతృత్వంలోని బెంచ్ తుది నిర్ణయం తీసుకోనుంది. పరిశీలించాల్సిందిగా ఎన్సీఎల్టీ ఆదేశిస్తే కొత్త ప్రతిపాదనపై రుణదాతల కమిటీ తిరిగి చర్చిస్తుంది. ఈసారి రివైజ్డ్ ప్లాన్‌ను కమిటీ తిరస్కరిస్తే డెక్కన్ క్రానికల్ ఆస్తులు అమ్మకానికి (లిక్విడేషన్) పెట్టాల్సి ఉంటుంది. మమతా బినానీ డెక్కన్ క్రానికల్ ఐఆర్‌పీగా వ్యవహరిస్తున్నారు. -
‘టోటెం’ ప్రమోటర్ల అరెస్టు
న్యూఢిల్లీ/చెన్నై: రూ. 1,394 కోట్ల మేర ఎనిమిది బ్యాంకుల కన్సార్టియంను మోసగించిన కేసులో టోటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రమోటర్లు తొట్టెంపూడి సలలిత్, తొట్టెంపూడి కవితలను సీబీఐ శుక్రవారం బెంగళూరులో అరెస్టు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీబీఐ అధికారులు తెలిపారు. టోటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఇచ్చిన రూ. 313.84 కోట్ల రుణాన్ని ఎగ్గొట్టారని, 2012లో ఆ రుణం నిరర్ధక ఆస్తుల జాబితాలో చేరిందని ఫిర్యాదులో యూబీఐ పేర్కొం ది. ఆ కంపెనీ మొత్తం రూ. 1394.84 కోట్ల మేర బ్యాంకుల కన్సార్టియంకు బకాయి పడిందని, వివిధ ప్రాజెక్టుల కోసం బ్యాంకుల నుం చి రుణాలు తీసుకుని సొంత పనులకు నిధుల్ని దారి మళ్లించిందని సీబీఐ ఆరోపించింది. నిధుల్లో కొంతమేర ప్రమోటర్ల వ్యక్తిగత ఖాతా ల్లోకి చేరాయని తెలిపింది. కాగా 2015లో ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన అతిపెద్ద పన్ను ఎగవేతదారుల జాబితాలో రూ. 400 కోట్ల ఎగవేతతో ఈ కంపెనీ కూడా ఉంది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌పై సీబీఐ కేసు యునైటెడ్ ఇండియా ఇన్సూ్యరెన్స్ కంపెనీ లిమిటెడ్(యూఐఐసీ)కి రూ. 30.54 కోట్ల మేర నష్టం కలిగించారన్న ఆరోపణలపై డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్(డీసీహెచ్ఎల్), దాని చైర్మన్ టి.వెంకటరామ్రెడ్డిలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ముంబైకి చెందిన కేర్ రేటింగ్ లిమిటెడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కో లిమిటెడ్, ఇద్దరు యూఐఐసీ మాజీ ఉద్యోగులు ఏ.బాల సుబ్రమణియన్, కె.ఎల్ కుంజిల్వర్ పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది. కంపెనీకి చెందిన ప్రీమియం డబ్బుల్ని ఆ ఇద్దరు ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా డీసీహెచ్ఎల్లో డిబెంచర్ల రూపంలో పెట్టబడి పెట్టారని, ఆ సమయంలో కేర్ రేటింగ్ లిమిటెడ్ సాయంతో రుణ అర్హత సామర్థ్యాన్ని డీసీహెచ్ఎల్ ఎక్కువ చేసి చూపించిందని ఫిర్యాదులో యూఐఐసీ పేర్కొంది. -
అమ్మకానికి ‘డీసీ’ ట్రేడ్‌మార్క్‌లు
♦ ఈ నెల 24న వేలం వేయనున్న ఐడీబీఐ బ్యాంకు ♦ లిస్టులో ఆంధ్రభూమి, ఏషియన్ ఏజ్, ఫైనాన్షియల్ క్రానికల్ ♦ ట్రేడ్‌మార్క్‌లు కూడా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్) ట్రేడ్‌మార్కులను వేలం వేసేందుకు ఐడీబీఐ బ్యాంకు సిద్ధమైంది. దాదాపు రూ. 444 కోట్ల బకాయిలను రాబట్టుకునేందుకు ఈ నెల 24న డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి, ఏషియన్ ఏజ్, ఫైనాన్షియల్ క్రానికల్ ట్రేడ్‌మార్క్‌లను ఆన్లైన్లో వేలం వేయనున్నట్లు ప్రకటించింది. బిడ్ల దాఖలుకు ఈ నెల 23 ఆఖరుతేదీగా పేర్కొంది. డెక్కన్ క్రానికల్‌కు రూ. 120 కోట్లు, ఆంధ్రభూమికి రూ. 3.5 కోట్లు, ది ఏషియన్ ఏజ్‌కు రూ. 18 కోట్లు, ఫైనాన్షియల్ క్రానికల్‌కు రూ. 3 కోట్లు రిజర్వ్ ధరగా ఐడీబీఐ బ్యాంకు నిర్ణయించింది. ఐడీబీఐ బ్యాంకుతో పాటు ఆంధ్రాబ్యాంకు, ఎస్బీహెచ్ తదితర 18 బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు డీసీహెచ్ఎల్ దాదాపు రూ. 4,000 కోట్ల పైచిలుకు బకాయి పడింది. దీంతో కంపెనీని ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా పలు బ్యాంకులు ఇప్పటికే ప్రకటించాయి. ఒకే పూచీకత్తుపై పలు సంస్థల నుంచి రుణాలు తీసుకోవడంతో న్యాయవివాదాలు కూడా నెలకొన్నాయి. ఐడీబీఐ బ్యాంకు పలుమార్లు ట్రేడ్‌మార్క్‌లను వేలం వేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఇతరత్రా రుణదాతల నుంచి అడ్డంకులు ఎదురవడంతో వీలు కాలేదు. తాజాగా రుణదాతలంతా ఒక అంగీకారానికి రావడంతో వేలానికి మార్గం సుగమమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
ప్రత్యేక ఖైదీలుగా ‘డీసీ’ నిందితులు
సాక్షి, హైదరాబాద్: రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసినకేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ వినాయక్ రవిరెడ్డిలను ప్రత్యేక ఖైదీలుగా గుర్తించి సౌకర్యాలు కల్పించాలని సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. -
డిపాజిట్ రేట్లు తగ్గించం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిపాజిట్ల సేకరణ కష్టంగా ఉండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించే ఆలోచన లేదని ఆంధ్రాబ్యాంక్ స్పష్టం చేసింది. ఇప్పుడు డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గిస్తే కొత్త డిపాజిట్లను సేకరించలేమని ఆంధ్రాబ్యాంక్‌కి కొత్తగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన సి.వి.ఆర్. రాజేంద్రన్ స్పష్టం చేశారు. ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా ఉంచడంతో డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించడం లేదని ఇదే సమయంలో రుణాలపై వడ్డీరేట్లను పెంచే ఆలోచన లేదని ‘సాక్షి’తో అన్నారు. ఇప్పటికే ఆంధ్రాబ్యాంక్ రిటైల్ రుణాలపై వడ్డీరేట్లను బాగా తగ్గించడంతో ప్రస్తుతం రుణాలపై వడ్డీరేట్లు కూడా తగ్గే అవకాశం లేదని, గతంలో వడ్డీరేట్లు పెంచిన కొన్ని బ్యాంకులు మాత్రమే ఇప్పుడు రుణాలపై వడ్డీరేట్లు తగ్గిస్తామన్న సంకేతాలు ఇస్తున్నాయన్నారు. అంతకుముందు ఆయన సీఐఐ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌పై ఏర్పాటు చేసిన ‘ఎస్టేట్ సౌత్ 2013’ రెండు రోజుల సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో రాజేంద్రన్ మాట్లాడుతూ ఈ త్రైమాసికంతో పాటు మరో 3 నెలలు బ్యాంకింగ్ రంగం ఎన్పీఏల బెడదను ఎదుర్కొంటుందన్నారు. సీఎండీగా బాధ్యతలు చేపట్టి కొద్ది రోజులే కావడంతో బ్యాంకు పరిస్థితి అధ్యయనానికి కొంత వ్యవధి పడుతుందని, ఆతర్వాతే అనుసరించాల్సిన వ్యూహంపై స్పష్టత వస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చిన్న ఇళ్లపై దృష్టిపెట్టండి తక్కువ ధరలో సామాన్యులకు అందుబాటులో ఉండే ఇళ్లకు మంచి డిమాండ్ ఉందని, ఈ రంగంపై రియల్ ఎస్టేట్ సంస్థలు దృష్టిసారించాల్సిందిగా రాజేంద్రన్ కోరారు. ఖరీదైన ఇల్లకంటే అఫర్డబుల్ హౌసింగ్ మార్కెట్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. సాధ్యమైనంత వరకు నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవాలని, పన్నుల భారం తగ్గించుకునే విధంగా అవసరమైతే రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రభుత్వం వద్ద లాబీయింగ్ చేసుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక మూలధనం అవసరమైన ఈ రంగంలోకి పెన్షన్ నిధులు వచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మంజీరా కన్స్ట్రక్షన్స్ సీఎండీ జి.యోగానంద్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రియల్టీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. -
బెయిలవుట్ యత్నాల్లో డెక్కన్ క్రానికల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన మీడియా సంస్థ డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్) తాజాగా పారిశ్రామిక ఆర్థిక పునర్వ్యవస్థీకరణ బోర్డును (బీఐఎఫ్ఆర్) ఆశ్రయించింది. ఖాయిలా కంపెనీల చట్టం కింద బెయిలవుట్ కోరింది. ఈ విషయాన్ని కంపెనీ బుధవారం బీఎస్ఈకి తెలియజేసింది. ఖాయిలా కంపెనీల చట్టం 1985 కింద బీఐఎఫ్ఆర్ తమ అభ్యర్థనను రిజిస్టర్ చేసుకున్నట్లు వివరించింది. ఈ చట్టంలో సెక్షన్ 15 (1) కింద కంపెనీ గానీ ఖాయిలా పడినట్లుగా భావించిన పక్షంలో గట్టెక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సదరు సంస్థల డెరైక్టర్ల బోర్డు..బీఐఎఫ్ఆర్ను ఆశ్రయించవచ్చు. కంపెనీ ఖాయిలాపడినట్లు నిర్ణయానికి వచ్చిన ఆరు నెలలలోగా లేదా.. ఆర్థిక ఫలితాల ఆడిటింగ్ పూర్తయిన తేదీ నుంచి 60 రోజుల్లోగా మేనేజ్మెంట్ ఈ పని చేయొచ్చు. అయితే, తాజా ఉదంతంలో.. కంపెనీ ఖాయిలాపడినట్లు డీసీహెచ్ఎల్ మేనేజ్మెంట్ ఎప్పుడు నిర్ధారణకి వచ్చినదీ.. బీఎస్ఈకి ఇచ్చిన సమాచారంలో పొందుపర్చలేదు. డీసీహెచ్ఎల్ దాదాపు రూ. 4,000 కోట్ల పైగా రుణాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే, రుణంగా తీసుకున్న నిధులను ఏం చేసినదీ కంపెనీ చెప్పడం లేదు. దీంతో రుణాలిచ్చిన పలు సంస్థలు ఇప్పటికే చట్టపరమైన చర్యలకు దిగాయి. అప్పులిచ్చిన కెనరా బ్యాంక్.. సీబీఐకి కూడా ఫిర్యాదు చేసింది.