
న్యూఢిల్లీ: 2008–09 నుంచి 2011–12 ఆర్థిక సంవత్సరాల వరకూ చూపిన ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లలో అవకతవకల అంశానికి సంబంధించి రూ. 4.29 కోట్లు చెల్లించాలంటూ డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్‌ఎల్) ప్రమోటర్లకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ డిమాండ్ నోటీసులు పంపించింది. టి వెంకట్రామ్ రెడ్డి, టి వినాయక్ రవి రెడ్డి, పి.కె. అయ్యర్‌లు 15 రోజులల్లోగా వడ్డీ, రికవరీ వ్యయాలు కలిపి ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది.
ఒకవేళ చెల్లించకపోతే డీసీహెచ్‌ఎల్ ప్రమోటర్ల స్థిరచరాస్తులను విక్రయించి రికవర్ చేసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అలాగే, వారి ఆస్తులు, బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడంతో పాటు, అరెస్టు చేసి జైల్లోనూ ఉంచే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో విధించిన జరిమానాను చెల్లించడంలో వారు విఫలం కావడంతో సెబీ తాజా నోటీసులు జారీ చేసింది.
చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే!
Comments
Please login to add a commentAdd a comment