శనివారం అర్ధరాత్రి నుంచి డీజిల్ ధరలు పెరగనున్నాయి. టాక్స్లు మినహా లీటర్కు 50 పైసలు చొప్పున పెంచాలని నిర్ణయించారు. కాగా పెట్రోలు ధరల్లో ఎలాంటి మార్పులూ ఉండవు. ఈ విషయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ వెల్లడించిండి. అంతర్జాతీయ చమురు ధరల్ని బట్టి పెట్రోల్ ధరల్ని సమీక్షిస్తారు. ఓఎంసీలు ప్రతి పదిహేను రోజులకోసారి పెట్రోలియం ధరల్ని సమీక్షిస్తాయి. గత నెల 31న డీజిల్ ధరను లీటర్కు 50 పైసలు చొప్పున పెంచి, పెట్రోల్ ధరను 1.15 రూపాయిలు తగ్గించారు.