
న్యూఢిల్లీ: డీఎల్‌ఎఫ్ డైరెక్టర్ల బోర్డ్ సమావేశం వచ్చే నెల 1న జరగనున్నది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్(క్విప్) విధానంలో నిధుల సమీకరణ, ప్రమోటర్లకు వారంట్లు, డిబెంచర్ల జారీ తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చిస్తారు. వారంట్లు, డిబెంచర్ల ద్వారా ప్రమోటర్లు ఈ కంపెనీలో రూ.10,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నారు. క్విప్ ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించనున్నారు. మొత్తం 13,500 కోట్లు పెట్టుబడులు డీఎల్‌ఎఫ్‌కు రానున్నాయి. ఈ నిధులను భారీగా పేరుకుపోయిన రూ.27,000 కోట్ల నికర రుణ భారాన్ని తగ్గించుకోవడానికి వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో డీఎల్‌ఎఫ్ ప్రమోటర్లు.. డీఎల్‌ఎఫ్ సైబర్ సిటీ డెవలపర్స్(ఇది డీఎల్‌ఎఫ్ రెంటల్ విభాగం)లో 40 శాతం వాటాను రూ.11,900 కోట్లకు విక్రయించారు. ఈ నిధులనే ఇప్పుడు వారంట్లు, డిబెంచర్ల ద్వారా డీఎల్‌ఎఫ్‌లో పెట్టుబడులు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment