ఈ-కామర్స్లో 2.5 లక్షల ఉద్యోగాలు: అసోచామ్ | 'E-commerce to generate 2.5 lakh jobs in 2016' | Sakshi
Sakshi News home page

ఈ-కామర్స్లో 2.5 లక్షల ఉద్యోగాలు: అసోచామ్

Published Sat, Feb 6 2016 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM

ఈ-కామర్స్లో 2.5 లక్షల ఉద్యోగాలు: అసోచామ్

ఈ-కామర్స్లో 2.5 లక్షల ఉద్యోగాలు: అసోచామ్

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ పరిశ్రమ ఈ ఏడాది కొత్తగా 2.5 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్) తన నివేదికలో పేర్కొంది.2016లో నియామకాలలో పెరుగుదల 60 నుంచి 65 శాతం ఉండొచ్చని రిపోర్టులో తెలిపింది.గత ఏడాది ఈ-కామర్స్ విభాగాల్లో టర్నోవర్ భారీగా పెరిగిందని ,అది మున్ముందు జరిగే అభివృద్ధికి ఎంతగానో తోడ్పడనుందని అసోచామ్ పేర్కొంది.2009లో దేశంలో ఈ-కామర్స్ మార్కెట్ విలువ 3.8 బిలియన్ డాలర్లు కాగా అది 2014లో 17 బిలియన్ డాలర్లకు చేరింది.ఇది గత ఏడాది 23 బిలియన్ డాలర్లుగా నమోదైంది.ఈ ఏడాది 38 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నట్లు రిపోర్టులో తెలిపింది.తాత్కాలిక ఉద్యోగాలు,సరఫరా,లాజెస్టిక్స్,సహాయక విభాగాలలో ఈ నియామకాలు ఉండొచ్చని అభిప్రాయపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement