ఆన్‌లైన్ రిటైలర్లపై ఈడీ దర్యాప్తు | ED begins probe against a dozen online e-retail firms | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ రిటైలర్లపై ఈడీ దర్యాప్తు

Published Mon, Sep 1 2014 12:37 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

ఆన్‌లైన్ రిటైలర్లపై ఈడీ దర్యాప్తు - Sakshi

ఆన్‌లైన్ రిటైలర్లపై ఈడీ దర్యాప్తు

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను ఉల్లంఘించాయన్న ఆరోపణలపై సుమారు డజనుకుపైగా ప్రముఖ ఆన్‌లైన్ రిటైల్ సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. గడిచిన కొన్నేళ్లుగా ఈ-రిటైలింగ్ జోరు నేపథ్యంలో ఆయా సంస్థల వ్యాపార కార్యకలాపాలను అధ్యయనం చేసే పనిలో ఈడీకి చెందిన ప్రత్యేక అధికారుల బృందం ఉన్నట్లు సమాచారం.
 
ప్రస్తుత ఎఫ్‌డీఐ పాలసీ ప్రకారం బిజినెస్ టు కన్జూమర్(బీటూసీ) విభాగంలో ఉన్న దేశీయ ఈ-కామర్స్ కంపెనీల్లోకి ఎఫ్‌డీఐలకు అనుమతి లేదు. అయితే, బిజినెస్ టు బిజినెస్(బీటూబీ)లో మాత్రం 100% ఎఫ్‌డీఐలకు అనుమతిస్తున్నారు. అయితే, కొంతమంది విదేశీ ఇన్వెస్టర్లు దేశీ ఈ-రిటైలింగ్ సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెడుతుండటం, ఆయా కంపెనీలు భారీగా నిధులను సమీకరిస్తుండటంతో ఈడీ తొలిసారిగా వాటి కార్యకలాపాలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement