E-commerce sector
-
ఈ కామర్స్‌లో కొలువుల పండుగ
హైదరాబాద్: నిరుద్యోగులకు కొలువుల పండుగ రానుంది. పండుగల విక్రయాలకు ముందు ఈ కామర్స్ రంగంలో పెద్ద ఎత్తున నియామకాలు చోటు చేసుకోనున్నాయి. ఏటా దసరా, దీపావళి సమయాల్లో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు భారీ తగ్గింపులు, ఆఫర్లతో ప్రత్యేక విక్రయ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. దీంతో ఏడాది పండుగల సీజన్ సమయంలో డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తులు అందించేందుకు ఈ కామర్స్ సంస్థలు నెట్వర్క్ బలోపేతంపై దృష్టి సారించనున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిలో ఈ కామర్స్ రంగంలో తాత్కాలిక ఉద్యోగాలు పెద్ద ఎత్తున రానున్నాయని నియామక సేవలు అందించే టీమ్‌లీజ్ సరీ్వసెస్ సంస్థ తెలిపింది. పరిశ్రమలో నెలకొన్న ధోరణుల ఆధారంగా ఈ అంచనాకు వచి్చంది. కేవలం దక్షిణాదిలోనే 4 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా 7,00,000 తాత్కాలిక ఉద్యోగాలు ఏర్పడతాయని తెలిపింది. హైదరాబాద్‌లో 30 శాతం, బెంగళూరులో 40 శాతం, చెన్నైలో 30 శాతం చొప్పున కొలువులు ఏర్పడతాయని తెలిపింది. పండుగల సందర్భంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర టైర్–1 పట్టణాల్లో నియామకాలు పెద్ద ఎత్తున ఉంటాయని, కోయంబత్తూర్, కోచి, మైసూర్ తదితర ద్వితీయ శ్రేణి పట్టణాలకు సైతం నియామకాలు విస్తరించొచ్చని అంచనా వేసింది. వేర్‌హౌస్ కార్యకలాపాల్లో (గోదాములు) 30 శాతం, డెలివరీ విభాగంలో 60 శాతం, కాల్‌సెంటర్ కార్యకలాపాల కోసం 10 శాతం నియామకాలు ఉంటాయని పేర్కొంది. ‘‘గడిచిన త్రైమాసికం నుంచి ప్రముఖ ఈకామర్స్ సంస్థలు పండుగల సీజన్‌కు సంబంధించి ఆశావహ ప్రణాళికలను ప్రకటించాయి. వినియోగదారులు భారీగా ఉండడం, భారత్‌లో తయారీని కేంద్ర సర్కారు ప్రోత్సహిస్తుండడం, ఎఫ్‌డీఐ, డిజిటైజేషన్ తదితర చర్యలు దేశంలో తాత్కాలిక కారి్మకుల పని వ్యవస్థను అధికంగా ప్రభావితం చేస్తున్నాయి’’అని టీమ్‌లీజ్ సరీ్వసెస్ బిజినెస్ హెడ్ బాలసుబ్రమణియన్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తాత్కాలిక కారి్మకులు దేశవ్యాప్తంగా 25 శాతం మేర పెరుగుతారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. దక్షిణాదిలో అయితే ఇది 30 శాతంగా ఉంటుందన్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో లక్ష సీజనల్ ఉద్యోగాలు రానున్న పండుగల సీజన్ నేపథ్యంలో, వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్‌ను అనుగుణంగా తాము సరఫరా వ్యవస్థలో లక్ష తాత్కాలిక (సీజనల్) ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలు, సార్టేషన్ కేంద్రాలు, డెలివరీ హబ్‌లలో ఈ నియామకాలు చేపట్టనుంది. స్థానిక కిరాణా డెలివరీ భాగస్వాములు, మహిళలు, వికలాంగులను సైతం నియమించుకోనున్నట్టు తెలిపింది. తద్వారా వైవిధ్యమైన సరఫరా చైన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. ‘‘బిగ్ బిలియన్ డేస్ (డిస్కౌంట్ సేల్) నిజంగా భారీ స్థాయిలో జరుగుతుంది. ఈ కామర్స్‌లో ఉండే మంచి గురించి లక్షలాది మంది కస్టమర్లు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఎక్కువ మంది మొదటిసారి కస్టమర్లే ఉంటున్నారు’’అని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ బద్రి తెలిపారు. బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపులు, ఆకర్షణీయమైన ఆఫర్లతో విక్రయాలు చేపడుతుంటుంది. బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఉండే సంక్లిష్టతలు, స్థాయికి అనుగుణంగా తాము సామర్థ్యాన్ని, నిల్వ స్థాయి, సారి్టంగ్, ప్యాకేజింగ్, మానవవనరులను, డెలివరీ భాగస్వాములను పెంచుకోవాల్సి ఉంటుందని బద్రి పేర్కొన్నారు. ఈ ఏడాది 40 శాతానికి పైగా షిప్మెంట్లను స్థానిక కిరాణా భాగస్వాములతో డెలివరీ చేసే ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. -
రిలయన్స్ చేతికి ‘ఫ్యూచర్’ రిటైల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో బ్లాక్‌బస్టర్ డీల్‌కు తెరలేపింది. సంస్థ అనుబంధ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) తాజాగా కిషోర్ బియానీ ప్రమోట్ చేస్తున్న ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలతోపాటు, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ విభాగాలను కొనుగోలు చేయనున్నట్టు శనివారం ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ.24,713 కోట్లు. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన 1,800లకుపైగా బిగ్‌బజార్, ఎఫ్‌బీబీ, ఈజీడే, సెంట్రల్, ఫుడ్‌హాల్ స్టోర్లు దేశవ్యాప్తంగా 420లకు పైచిలుకు నగరాల్లో విస్తరించాయి. వీటిని వినియోగించుకునేందుకు రిలయన్స్‌కు మార్గం లభించింది. రిలయన్స్ రిటైల్ వ్యాపారాల విస్తరణ వేగంగా జరిగేందుకు, పోటీ కంపెనీలకు ధీటుగా ఈ–కామర్స్ రంగంలో పట్టు సాధించేందుకు ఈ లావాదేవీ దోహదం చేయనుంది. ఇక డీల్‌లో భాగంగా రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలు ఆర్‌ఆర్‌వీఎల్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్‌కు బదిలీ అవుతాయి. అలాగే లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ విభాగాలు ఆర్‌ఆర్‌వీఎల్‌కు బదిలీ చేస్తారు. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన పేరొందిన ఫార్మాట్స్, బ్రాండ్స్‌కు ఒక వేదిక ఇవ్వడం ఆనందంగా ఉందని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ సందర్భంగా తెలిపారు. కోవిడ్, ఆర్థిక పరిస్థితుల మూలంగా తలెత్తిన సవాళ్లకు.. పునర్వ్యవస్థీకరణ, తాజా లావాదేవీ ఫలితంగా సంస్థకు సంపూర్ణ పరిష్కారం లభిస్తుందని ఫ్యూచర్ గ్రూప్ సీఈవో కిషోర్ బియానీ వ్యాఖ్యానించారు -
మొబైల్స్‌దే మెజారిటీ వాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ఈ–కామర్స్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇద్దరు వినియోగదార్లలో ఒకరు తొలిసారిగా ఆన్లైన్ వేదికగా వస్తువులను కొనుగోలు చేస్తున్నవారే. ఈ ఏడాది మే–జూలైతో పోలిస్తే ఆగస్టు–అక్టోబరులో మొత్తం కస్టమర్లలో వీరి శాతం అత్యధికంగా 56 శాతానికి చేరుకుందని నీల్సన్ నివేదిక చెబుతోంది. 10 లక్షలకుపైగా జనాభా కలిగిన 52 నగరాల్లోని 1,90,000 మంది ఆన్లైన్ కస్టమర్ల షాపింగ్ తీరును ఈ నివేదికలో వివరించింది. కొత్త కస్టమర్లకు మొబైల్స్ తొలి ప్రాధాన్యతగా నిలిచింది. 28 సెప్టెంబరు–25 అక్టోబరు మధ్య ఫెస్టివ్ పీరియడ్‌లో వీరు ఖర్చు చేసిన మొత్తం విలువలో మొబైల్స్ వాటా ఏకంగా 53% ఉంది. అధిక ఆర్డర్లు ఎఫ్ఎంసీజీలో.. 2019 మే–ఆగస్టు కాలంలో జరిగిన షాపింగ్‌లో విలువ పరంగా మొబైల్స్ 48 శాతం, ఫ్యాషన్ 16 శాతం కైవసం చేసుకున్నాయి. ఇక అత్యధిక ఆర్డర్లు (పరిమాణం) ఎఫ్ఎంసీజీ విభాగంలో 56 శాతం చోటుచేసుకోవడం విశేషం. ఎఫ్ఎంసీజీలో ఎక్కువ ఆర్డర్లు 50 లక్షలు ఆపై జనాభా ఉన్న మెట్రో నగరాల నుంచే వస్తున్నాయి. 50 లక్షల లోపు జనాభా ఉన్న ప్రథమ శ్రేణి నగరాల నుంచి మొబైల్ ఫోన్ల కోసం 50 శాతం ఆర్డర్లు వస్తే.. మెట్రోల నుంచి ఇది 38 శాతంగా ఉంది. ఆన్లైన్ ఫ్యాషన్ విభాగంలో మే–అక్టోబరు మధ్య నాలుగింట మూడు భాగాలు దుస్తులు, పాదరక్షలు ఉన్నాయి. షాపింగ్ రాత్రిపూటే.. మొబైల్స్ తర్వాత ఫ్యాషన్, టీవీలు, ఎలక్ట్రానిక్స్ వంటివి కొనుగోలు చేస్తున్నారు. కొనుగోళ్ల విషయంలో రెండు, మూడవసారి మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్‌కు నూతన వినియోగదార్లు మొగ్గు చూపుతున్నారు. ఫెస్టివల్ సీజన్లో ప్రైమ్ టైంలో అంటే రాత్రి 8–11 గంటల మధ్య అత్యధికంగా 23 శాతం షాపింగ్ జరిగింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు 17 శాతం షాపింగ్ నమోదైంది. పండుగల సమయంలో మూడు నాలుగు రెట్ల అమ్మకాలు జరిగాయి. ఇండిపెండెన్స్ డే సేల్ తర్వాత సాధారణంగా నమోదైన విక్రయాలు తిరిగి ఫెస్టివ్ పీరియడ్ వచ్చే సరికి అనూహ్యంగా ఎగబాకాయి. 28 సెప్టెంబరుతో మొదలైన ఫెస్టివ్ సీజన్ తొలి వారంలో 43 శాతం సేల్స్ జరిగాయి. -
ఈ కామర్స్‌పై అతి నియంత్రణతో నష్టమే!
హైదరాబాద్: ఈ కామర్స్ రంగంపై అతి నియంత్రణ దేశంలో నూతన వ్యాపారాల ఏర్పాటు వాతావరణాన్ని దెబ్బతీస్తుందని పారిశ్రామిక సంఘం అసోచామ్ ఆందోళన వ్యక్తం చేసింది. ధరల్ని ప్రభుత్వం నియంత్రించడమనేది తిరిగి ఇన్స్పెక్టర్ రాజ్‌కు దారితీస్తుందని వ్యాఖ్యానించింది. ఈ కామర్స్, మొత్తం ఆన్లైన్ విభాగం ఇప్పడిప్పుడే ఎదుగుతోందని, దీని విస్తరణకు ఎంతో అవకాశం ఉందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. ‘‘ఏ వాణిజ్యానికి అయినా నిబంధనలన్నవి ఉండాల్సిందే. కానీ, అతి నిబంధనలు, అతి నియంత్రణలన్నవి అమలు చేయరాదు. ఇది వ్యాపార స్థాపన వృద్ధిని అణచివేస్తుంది’’ అని రావత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఈ కామర్స్ విధానాన్ని తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ విధాన ముసాయిదాపై భాగస్వాముల అభిప్రాయాలను కోరింది. దీంతో అసోచామ్ గట్టిగా స్పందించడం గమనార్హం. వివిధ రకాల ధరల్ని అమలు చేయడం లేదా భారీ తగ్గింపులకు కాల పరిమితి విధింపు కూడా ఈ కామర్స్ విధానంలో ఉంది. ఈ కామర్స్ కంపెనీలు భారీ డిస్కౌంట్లు ఇస్తూ సంప్రదాయ వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ నూతన విధానంపై దృష్టి సారించింది. కానీ భారీ తగ్గింపులన్నవి లేదా అసలు తగ్గింపులు లేకపోవడం అన్నది వ్యాపార పరమైన నిర్ణయాలని రావత్ పేర్కొన్నారు. భారీ తగ్గింపులపై ఆందోళన ప్రమోటర్లకు, వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్‌కే ఉండాలన్నారు. -
అర నిమిషంలో రూ.8 కోట్లు!
ప్రపంచ ఈ-కామర్స్ రంగం ఆదాయం ఇది... న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఈ-కామర్స్ రంగం ప్రతి 30 సెకన్లకు 1.2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8 కోట్లు) ఆదాయాన్ని గడిస్తోంది. ఈ ఆదాయ పెరుగుదలకు సోషల్ మీడియా విస్తరణే కారణంగా కనిపిస్తోంది. అసోచామ్-డెలాయిట్ నివేదిక ప్రకా రం.. ఈ-కామర్స్ రంగ ఆదాయంలో సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, పిన్టరెస్ట్, ట్వీటర్ల వాటా వరుసగా 5,483 డాలర్లుగా, 4,504 డాలర్లుగా, 4,308 డాలర్లుగా ఉంది. మార్కెట్లోని కొత్త ఉత్పత్తులు, వాటి గురించిన రివ్యూలు, రేటింగ్స్ వంటి తదితర మొత్తం సమాచారాన్ని సామాజిక మాధ్యమాలు యూజర్లకు అందిస్తున్నాయి. దీనితోపాటు వినియోగదారుల ప్రశ్నలను ఈ-కామర్స్ సంస్థలకు తెలిసేలా చేసి వారు వారి బ్రాండ్ల ఏర్పాటులో తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి సహాయపడుతున్నాయి. అలాగే ఈ-కామర్స్ సంస్థలు ప్రకటించే సీజనల్ సేల్స్, వివిధ రకాల ఆఫర్లను సాధ్యమైనంత మందికి తెలిసేలా చేస్తున్నాయి. ‘సామాజిక మాధ్యమాలు ప్రత్యక్షంగా ఈ-కామర్స్ సైట్లతో అనుసంధానమై ఉన్నాయి. దీంతో కొనుగోలుదారుడు ఆయా ఉత్పత్తులకు సంబంధించిన ధర, లభ్యత, డెలివరీ స్టేటస్, రివ్యూలు వంటి మొత్తం సమాచారాన్ని తెలుసుకుంటున్నాడు. దీని వల్ల కొనుగోలుదారుడు అతనికి నచ్చిన ఉత్పత్తిని కొనడానికి ఆస్కారం కలుగుతోంది’ అని అసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్. రావత్ తెలిపారు. ఈ-కామర్స్ సంస్థల ఆదాయ వృద్ధిలో ఆయా కంపెనీల యాప్స్ ప్రధాన భూమిక పోషిస్తున్నాయని వివరించారు. ఈ-కామర్స్ సంస్థల ఆదాయంలో దాదాపు సగ భాగం మొబైల్ ఫోన్ల నుంచే ఉందని తెలిపారు. -
ఈ-కామర్స్‌లోకి ఫేస్బుక్..!
షాపింగ్ సెర్చ్ ఇంజిన్ ‘ద ఫైండ్’ కొనుగోలు హ్యూస్టన్: సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్.. ఇక ఈ-కామర్స్ రంగంలోనూ తన సత్తా చాటనుంది. దీనిలో భాగంగానే షాపింగ్ సెర్చ్ ఇంజిన్ ‘ద ఫైండ్’ను చేజిక్కించుకుంది. అయితే, ఇందుకు ఎంత మొత్తాన్ని వెచ్చించిందో ఫేస్బుక్ వెల్లడించలేదు. ఇంటర్నెట్ వ్యాపార మార్కెట్లో అతికీలకమైన సెర్చ్.. ఈ-కామర్స్ రంగాల్లో అడుగుపెట్టడమే ఫేస్బుక్ తాజా టేకోవర్ ప్రధానోద్దేశంగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఫేస్బుక్ డిజిటల్ అడ్వర్టైజింగ్ వ్యాపారాన్ని మరింత పెంచడంలో కూడా ఈ కొనుగోలు ఉపకరిస్తుందని భావిస్తున్నారు. గతేడాది యాడ్ల రూపంలో ఫేస్‌బుక్‌కు 12.6 బిలియన్ డాలర్ల ఆదాయం లభించింది. ఇప్పుడు తమ ఇరు కంపెనీల కలయికతో యూజర్ల అవసరాలకు సంబంధించిన యాడ్లను మరింత మెరుగ్గా అందించగలుగుతామని ఫేస్బుక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచంలోని ఏ ఉత్పత్తినైనా అన్వేషించేందుకు వీలుకల్పించేలా 2006లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.దఫైండ్.కామ్ ఆవిర్భవించింది. దీని సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శివ కుమార్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ) శశికాంత్ ఖండేల్వాల్ ఇద్దరూ భారతీయులే కావడం గమనార్హం. -
స్టార్టప్‌లలో మహిళల ముందంజ
న్యూఢిల్లీ: భారత్‌లో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వివిధ స్టార్టప్‌లలో ముఖ్యంగా ఈ-కామర్స్ రంగంలో వీరు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఈ రంగంలో వీరి సంఖ్య పురుషులతో సమానంగా ఉంది. ఇదే పరిస్థితి నెమ్మదిగా కార్పొరేట్ కంపెనీలలో కూడా కనిపించనుంది. చాలా వ్యాపారాలలో మహిళలు సీనియర్ మేనేజ్మెంట్ హోదాలలో కూడా ఉన్నారు. జివామీ, ఎంబైబ్, గ్రాబ్‌హౌస్, లెబుల్ కార్ప్, లైమ్‌రోడ్ తదితర స్టార్టప్‌లతోపాటు ఆన్లైన్ వ్యాపారాలలో కూడా మహిళలు తమ ఉనికిని చాటుకుంటున్నారు. టెక్నాలజీ వృద్ధి, ఇంటర్నెట్ వినియోగం జోరు, మొబైల్స్ వాడకం పెరగటం వంటి తదితర అంశాలు మహిళా వ్యాపార వృద్ధికి దోహదపడుతున్నాయి. తన కంపెనీ సిబ్బందిలో దాదాపు 50 శాతం మంది మహిళలే ఉన్నారని జామ్బే వ్యవస్థాపకురాలు సురుచి వాగ్ అన్నారు. భారత వ్యాపార రంగంలో మహిళల శాతం పెరగటానికి విస్తృతమైన, సమాన అవకాశాలు చాలా దోహదపడతాయని రీసెర్చ్ సంస్థ గ్లోబల్‌హంట్ ఎండీ సునీల్ గోయల్ చెప్పారు. ‘కెరీర్‌ను సవాలుగా తీసుకొని ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఎంతో మంది మహిళా పారిశ్రామికవేత్తలు మన ముందు ఉన్నారు. వీరందరూ సంప్రదాయ భారతీయ మహిళా సంకె ళ్లను బద్దలుకొడుతూ నూతనంగా వివిధ వ్యాపార రంగాలలోకి అడుగుపెడతారు’ అని గ్రాబ్‌హౌస్.కామ్ సహ వ్యవస్థాపకులు పంఖూరీ శీవత్సవా అన్నారు. గ్రాభౌస్లో దాదాపు 40 శాతం మంది మహిళా ఉద్యోగులే. వ్యాపార అవకాశాలు పెరగటంతోపాటు మహిళా సాధికారతకు దోహదపడే వివిధ పథకాలను, పాలసీలను ప్రభుత్వం ప్రవేశపెడుతుండటంతో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య పెరుగుతోందని లేబర్‌నెట్ సహ వ్యవస్థాపకులు గాయత్రి వసుదేవన్ చెప్పారు. -
సీఏ, సీఎస్, సీఎంఏ.. ప్రాక్టికల్ ట్రైనింగ్.. పరిపూర్ణతకు మార్గం
చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ); కంపెనీ సెక్రటరీ (సీఎస్); కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్ (సీఎంఏ).. కామర్స్ రంగంలో దశాబ్దాలుగా ఆదరణ పొందుతున్న ప్రొఫెషనల్ కోర్సులు. నేటి పారిశ్రామికీకరణ, గ్లోబలైజేషన్ యుగంలో వీటికి మరింత డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు వీటి విషయంలో ఎదురవుతున్న సమస్య... నైపుణ్య లేమి. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన నియంత్రణ సంస్థలు ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు ప్రాధాన్యమిచ్చాయి. మరే ఇతర కోర్సుల్లో లేని విధంగా ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను తప్పనిసరి చేశాయి. క్షేత్ర నైపుణ్యాలు పెంపొందించుకోవడం కరిక్యులంలో భాగం చేశాయి. ఈ నేపథ్యంలో సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సుల ప్రాక్టికల్ ట్రైనింగ్‌పై ఫోకస్.. సీఏ.. ఆర్టికల్‌షిప్‌కు అత్యంత ప్రాధాన్యం చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులో ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను ఆర్టికల్షిప్గా పేర్కొంటున్నారు. కోర్సు నియంత్రణ సంస్థ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్‌డ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఆర్టికల్‌షిప్‌నకు అత్యంత ప్రాధాన్యమిస్తూ నిబంధనలు అమలు చేస్తోంది. మూడేళ్ల ఆర్టికల్‌షిప్ పూర్తి చేసినవారిని మాత్రమే కోర్సు ఫైనల్ పరీక్షల్లో హాజరుకు అనుమతిస్తోంది. సీఏ విద్యార్థులు కోర్సు రెండో దశ ఐపీసీసీలో పేరు నమోదు చేసుకున్నప్పటి నుంచే గుర్తింపు పొందిన ఆడిటర్ లేదా ఆడిట్ సంస్థ వద్ద ఆర్టికల్ ట్రైనింగ్‌లో అడుగుపెట్టాలి. విద్యార్థులు తాము థియరిటికల్‌గా చదువుతున్న అంశాలను అప్పటికప్పుడు ప్రాక్టికల్‌గా అన్వయించే నైపుణ్యాలు సొంతం చేసుకునేలా చేయడమే ఈ నిబంధన ప్రధాన ఉద్దేశం. ఫలితంగా ఫైనల్ సర్టిఫికెట్ చేతికందేనాటికి విద్యార్థికి ఒక పూర్తిస్థాయి సీఏకు అవసరమైన అన్ని నైపుణ్యాలు లభిస్తాయి. ఆర్టికల్‌షిప్ సమయంలో ట్రైనీకి నిర్ణీత మొత్తంలో స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. అదే విధంగా విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా సెలవులు ఇవ్వాలని కూడా ఐసీఏఐ స్పష్టం చేసింది. సమస్యలివే ట్రైనీలు తమ ఆర్టికల్‌షిప్ సమయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమను సదరు సంస్థ లేదా సర్టిఫైడ్ ఆడిటర్ అన్ని విభాగాల్లో పాల్పంచుకోనీయడం లేదని, దీనివల్ల అన్ని అంశాలపై అవగాహన లభించట్లేదని ట్రైనీలు అంటున్నారు. అంతేకాకుండా సీఏ పరీక్షల ప్రిపరేషన్ కోణంలో ఐసీఏఐ నిర్దేశించిన విధంగా సెలవుల మంజూరు కూడా ఉండట్లేదని చెబుతున్నారు. దీనికి ప్రిన్సిపల్ ఆడిటర్స్ స్పందిస్తున్న తీరు భిన్నంగా ఉంటోంది. ఆర్టికల్ ట్రైనీలు ఒక సంస్థలోని అన్ని కార్యకలాపాల్లో పాల్పంచుకోవాలనే విషయంలో ఆ సంస్థ లేదా ఆడిటర్ దృక్పథం ప్రధాన పాత్ర పోషిస్తుందంటున్నారు. క్లయింట్లు ఎక్కువగా ఉన్న సంస్థలో ఆడిటర్ తమ క్లయింట్లకు త్వరగా సేవలందించాలనే లక్ష్యంగా ఉంటారు. ఇలాంటి సంస్థల్లో ఆర్టికల్ ట్రైనీలకు అన్ని అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఎక్కువ సమయం కేటాయించే పరిస్థితి ఉండదు. కాబట్టి అభ్యర్థులే సహజ చొరవతో పరిశీలన నైపుణ్యాలను పెంచుకుని సంస్థలో జరుగుతున్న కార్యకలాపాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. సెలవుల మంజూరు కూడా సంస్థ లేదా ఆడిటర్పైనే ఆధార పడి ఉంటుంది. ‘చిన్న సంస్థల్లో సిబ్బంది తక్కువగా ఉంటారు. అలాంటి వారు విధుల పరంగా ఆర్టికల్ ట్రైనీలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతోవారికి సెలవులు మంజూరు చేయడంలో కొంత సమస్య ఎదురవుతోంది’ అంటున్నారు హైదరాబాద్‌లోని ప్రముఖ ఆడిట్ సంస్థ నిర్వాహకులు. ఆర్టికల్షిప్తోపాటు అదనంగా.. నిర్దేశించిన ఆర్టికల్‌షిప్ పూర్తయిన తర్వాత మూడు నెలలపాటు జనరల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్(జీఎంటీ) కూడా చేయాలి. అకౌంటింగ్ నైపుణ్యాలతోపాటు నిర్వహణ పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో ఐసీఏఐ ఈ జీఎంటీకి రూపకల్పన చేసింది. కానీ.. చాలామంది విద్యార్థులు సిలబస్ విస్తృతంగా ఉండే సీఏ కోర్సు పరీక్షలో ఉత్తీర్ణతకే ప్రాధాన్యమిస్తున్నారు. థియరిటికల్ ప్రిపరేషన్‌కే ఎక్కువ సమయం కేటాయిస్తూ డమ్మీ ఆర్టికల్స్‌ను అన్వేషిస్తున్నారనే అభిప్రాయముంది. తప్పనిసరిగా ప్రత్యక్షంగా ఆర్టికల్‌షిప్ పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్టికల్స్, థియరీ రెండింటికీ ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగితే ప్రాక్టికల్ నైపుణ్యాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి. ఆర్టికల్‌షిప్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారం కోసం ఐసీఏఐను సంప్రదించవచ్చు. సీఎంఏలోనూ మూడున్నరేళ్లు.. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ).. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించే కోర్సు. మారిన నిబంధనలతో సర్వీసెస్ నుంచి సాఫ్ట్వేర్ వరకు అన్ని రంగాల్లోనూ ఇప్పుడు కాస్ట్ అకౌంటెంట్ల అవసరం ఏర్పడింది. ప్రధానంగా ఉత్పత్తి సంస్థల్లో కాస్ట్ అకౌంటెంట్ల డిమాండ్ ఎక్కువ. సీఏంఏ కోర్సు నిర్వహణ సంస్థ ఐసీఎంఏఐ విద్యార్థుల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలకు పెద్దపీట వేస్తోంది. సీఏ మాదిరిగానే మూడున్నరేళ్ల ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను తప్పనిసరి చేసింది. అయితే సీఎంఏ కోర్సు విషయంలో విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ పరంగా కొంత వెసులుబాటు ఉంది. సీఏలో మాదిరిగా మూడేళ్లు ఆర్టికల్ చేస్తేనే ఫైనల్ పరీక్షకు అర్హత అనే నిబంధన సీఎంఏలో లేదు. కోర్సు రెండోదశగా పేర్కొనే ఇంటర్మీడియెట్ తర్వాత ఆరు నెలలు తొలి దశ ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను పూర్తి చేసుకుంటే.. ఫైనల్ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతి లభిస్తుంది. తర్వాత ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాక తప్పనిసరిగా మూడేళ్లపాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేయాలి. అప్పుడే సంస్థ నుంచి స్టూడెంట్‌షిప్ లభిస్తుంది. అంతేకాకుండా సీఎంఏ విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు సీఏతో పోల్చితే ఎక్కువ మార్గాలు ఉన్నాయనేది నిపుణుల అభిప్రాయం. కేవలం ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ల వద్దే కాకుండా సంస్థల్లోనూ ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేసుకునే వీలుంది. సీఎంఏ ప్రాక్టికల్ ట్రైనింగ్ విషయంలో విద్యార్థులు పేర్కొంటున్న సమస్యలు.. అన్ని విభాగాలపై అవగాహన కల్పించకపోవడం, పరీక్షలకు సెలవులు ఇవ్వకపోవడం. అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చే సంస్థ ఏదో ఒక విభాగంలో వారిని నియమిస్తోంది. దాంతో అన్ని అంశాలపై అవగాహన లభించడం లేదు. విద్యార్థులు చొరవగా ఆయా విభాగాల్లోని వారితో మాట్లాడం ద్వారా అక్కడి పనితీరును తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సీఎస్.. ట్రైనింగ్ తప్పనిసరి.. కానీ.. కంపెనీ సెక్రటరీ కోర్సు... ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా మూడు దశలుగా నిర్వహించే ఈ కోర్సులోనూ ప్రాక్టికల్ ట్రైనింగ్ తప్పనిసరి. ప్రస్తుతం ఫౌండేషన్ కోర్సు, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అనే మూడు దశలుగా సీఎస్ కోర్సు స్వరూపం ఉంది. తాజా నిబంధనల ప్రకారం- ప్రాక్టికల్ ట్రైనింగ్ పరంగా ఫౌండేషన్ కోర్సు నుంచే దీన్ని ప్రారంభించొచ్చు. ఫౌండేషన్ కోర్సు నుంచి మూడేళ్లు; ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ తర్వాత రెండేళ్లు; ప్రొఫెషనల్ కోర్సు తర్వాత ఒక ఏడాది ప్రాక్టికల్ ట్రైనింగ్ (అప్రెంటీస్‌షిప్) పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ తాజా మార్పు విషయంలోనే ఈ రంగంలోని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎస్ తుది దశ అయిన ప్రొఫెషనల్ కోర్సు తర్వాత ఏడాది వ్యవధిలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేస్తే చాలు అనే వెసులుబాటు కారణంగా.. అత్యధిక శాతం మంది అభ్యర్థులు ప్రాక్టికల్స్‌కు అత్యల్ప ప్రాధాన్యమిస్తారని అంటున్నారు. ముందుగా పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా వ్యవహరిస్తారని పర్యవసానంగా క్షేత్ర నైపుణ్యాలు కొరవడతాయని చెబుతున్నారు. ఇది భవిష్యత్ కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఔత్సాహికులు వెసులుబాట్లు గురించి అన్వేషించకుండా.. క్షేత్ర నైపుణ్యాలు పెంచుకునే విధంగా వీలైనంత ఎక్కువ సమయం ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు కేటాయించాలి. అప్పుడే తాము అకడమిక్‌గా చదువుకున్న అంశాలకు సంబంధించి రియల్‌టైం అప్లికేషన్స్‌పై అవగాహన ఏర్పడుతుంది. కంపెనీల చట్టం, ఇతర న్యాయ పరమైన సబ్జెక్ట్‌ల ప్రాధాన్యం ఎక్కువగా ఉండే సీఎస్‌లో పరిపూర్ణత లభించాలంటే ప్రాక్టికల్ అప్రోచ్‌కు పెద్దపీట వేయాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాక్టికల్ ట్రైనింగ్ (అప్రెంటీస్‌షిప్) విషయంలో వ్యక్తిగతంగానైనా చొరవ చూపి ముందుకు సాగాలి. అప్పుడే కోర్సులో చేరిన లక్ష్యం నెరవేరడంతోపాటు సుస్థిర భవిష్యత్తు సొంతమవుతుంది. ప్రొఫెషనల్‌గా రూపొందాలంటే.. ప్రాక్టికల్ నాలెడ్జ్, స్కిల్ సెట్ల అవసరం సీఏ, సీఎంఏ, సీఎస్ కెరీర్‌కు చాలా ఎక్కువ. కారణం.. తాము చదివిన అంశాలను తక్షణమే అన్వయించాల్సిన విధంగా విధులు ఉంటాయి. దాంతో ఈ రంగంలో మంచి ప్రొఫెషనల్‌గా పేరు గడించాలంటే తప్పనిసరిగా ప్రాక్టికల్ అప్రోచ్ పెంపొందించుకోవాలి. పరీక్షల్లో ఉత్తీర్ణత గురించి ఆందోళన చెందకుండా అకడమిక్ సిలబస్ ప్రిపరేషన్ సాగిస్తూనే ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో వాటిని అన్వయించే నైపుణ్యాలు పెంచుకుంటే సర్టిఫికెట్ సొంతం చేసుకోవడం ఎంతో సులభం. చేయూతనిస్తున్న ఇన్స్టిట్యూట్లు.. సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సుల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ పరంగా విద్యార్థులకు సదరు నిర్వహణ ఇన్స్టిట్యూట్లు చేయూతనిస్తున్నాయి. ట్రైనింగ్ మార్గాలు అన్వేషిస్తున్న అభ్యర్థులకు సహకరిస్తున్నాయి. ఆయా ఇన్స్టిట్యూట్ల చాప్టర్లను సంప్రదిస్తే ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు అవకాశం కల్పిస్తున్న సంస్థలు, ప్రాక్టీసింగ్ ఆడిటర్స్/సెక్రటరీస్ సమాచారం తెలియజేస్తున్నాయి. పోస్టల్ కోచింగ్ ద్వారా కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులు; నాన్-మెట్రోస్లోని విద్యార్థులకు ఈ సదుపాయం ఎంతో మేలు చేస్తోంది. ప్రాక్టికల్ థింకింగ్ ఉంటేనే... సీఏ కెరీర్లో అడుగుపెట్టే విద్యార్థులు ముందుగా తమలో ప్రాక్టికల్ థింకింగ్ లెవెల్స్‌పై స్పష్టతకు రావాలి. ఎందుకంటే.. సీఏ కోర్సులో ప్రాక్టికాలిటీ ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఈ రంగంలోని సీనియర్లను, సంస్థలను, ప్రాక్టీసింగ్ సీఏలను సంప్రదించి తమ అవగాహన స్థాయి తెలుసుకోవాలి. ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఆర్టికల్ షిప్) విషయానికొస్తే.. పకడ్బందీ అన్వేషణ సాగించాలి. సదరు సంస్థ లేదా ఆడిటర్‌కు ఉన్న గుర్తింపు, క్లయింట్ల సంఖ్య-స్థాయి ఆధారంగా ఆర్టికల్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఆర్టికల్‌షిప్ సమయంలో సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకునే కోణంలో కృషి చేస్తే పరిపూర్ణ అవగాహన లభిస్తుంది. ‘పరీక్షలో ఉత్తీర్ణతకే ప్రాధాన్యమిద్దాం. తర్వాత విధుల్లో చేరి ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతం చేసుకోవచ్చు’ అనే ఆలోచన సరికాదు. - ఎం.దేవరాజ రెడ్డి, చైర్మన్, బోర్డ్ ఆఫ్ స్టడీస్,ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సీఎంఏ.. క్షేత్ర నైపుణ్యాలు ఎంతో ముఖ్యం సీఎంఏ కోర్సు విషయంలో క్షేత్ర నైపుణ్యాలు ఎంతో ముఖ్యం. అందుకే మూడున్నరేళ్ల ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను తప్పనిసరి చేశాం. ఇదే సమయంలో విద్యార్థుల కోణంలోనూ ఆలోచించి వెసులుబాటు కల్పించాం. దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. వీలైనంత వరకు ఫైనల్ పరీక్ష నాటికి అధిక శాతం ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను పూర్తి చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రాక్టికల్ ట్రైనింగ్ సమయంలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాటు చేశాం. కాబట్టి ఒకటిరెండు సంఘటనలు చూసి ఆందోళన చెందకుండా.. నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేయాలి. - ఎ.ఎస్. దుర్గా ప్రసాద్, చైర్మన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిరంతర అవగాహనతోనే సీఎస్‌లో రాణింపు సీఎస్ కోర్సులో రాణించాలంటే నిరంతర అవగాహనే ప్రధానం. ఇందుకు సాధనం ప్రాక్టికల్ ట్రైనింగ్(అప్రెంటీస్‌షిప్). దీని విషయంలో ప్రస్తుతం పలు వెసులుబాట్లు ఉన్నాయి. ఔత్సాహిక విద్యార్థులు వాటి గురించి పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందే విధంగా అడుగులు వేయాలి. ముఖ్యంగా లీగల్ నాలెడ్జ్ ఆవశ్యకత ఎక్కువగా ఉండే సీఎస్ కోర్సులో రియల్‌టైం ఎక్స్పోజర్ ఎంతో అవసరం. దీన్ని గుర్తించి ఎగ్జిక్యూటివ్ దశ నుంచే ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రారంభించడం మంచిది. - డి. వాసుదేవరావు, చైర్మన్, ఐసీఎస్ఐ-హైదరాబాద్ చాప్టర్ ఎడ్యూ ఇన్ఫో విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు ఏఐసీటీఈ చర్యలు భారతదేశంలోని ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్స్‌లో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను పెంచే దిశగా ఏఐసీటీఈ చర్యలు తీసుకుంటోంది. ఉన్నత విద్యను అంతర్జాతీయీకరణ చేయాలనే ఉద్దేశంతోపాటు, అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరిగితే ఇన్స్టిట్యూట్లలో సాంస్కృతిక వైవిధ్యం కూడా పెరుగుతుందని, ఫలితంగా మన విద్యార్థులు భవిష్యత్తులో విదేశాల్లోనూ రాణించేందుకు ఆస్కారం లభిస్తుందని ఏఐసీటీఈ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో భారత్‌లో చదవాలనుకుంటున్న ఔత్సాహిక విదేశీ విద్యార్థుల కోసం అమెరికాలో నిర్వహిస్తున్న స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మాదిరిగా ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేసే దిశగా ఏఐసీటీఈ వేగంగా అడుగులు వేస్తోంది. విదేశాల నుంచి భారత్‌కు ఉన్నత విద్య కోసం వస్తున్న విద్యార్థుల సంఖ్య 2013 నాటికి 1.3 లక్షలు ఉండగా ప్రతి ఏటా వస్తున్న సంఖ్యను పరిగణిస్తే అది 15 శాతంలోపే ఉంటోంది. తాజాగా తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
ఆన్లైన్లో సగటు కొనుగోళ్లు రూ.10 వేలు!
2015లో ఒక్కో కస్టమర్ చేయనున్న వ్యయం ఇది.. ఈ ఏడాది సగటు ఖర్చు రూ.6 వేలు అసోచాం-పీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఈ-కామర్స్ రంగం దూసుకుపోతోంది. వచ్చే ఏడాది వివిధ ఉత్పత్తుల కోసం భారతీయ ఆన్లైన్ కస్టమర్ సగటున రూ.10 వేలు ఖర్చుచేయనున్నట్లు అసోచాం-పీడబ్ల్యూసీ నివేదిక వెల్లడించింది. ఆన్లైన్ షాపర్ల ఈ ఏడాది సగటు వ్యయం రూ.6 వేలుగా లెక్కగట్టింది. భారత్‌లో ఆన్లైన్ మార్కెట్ హవా ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఈ అంకెలే నిదర్శనం. దేశంలో ప్రస్తుతం ఆన్లైన్ రిటైల్ మార్కెట్ పరిమాణం రూ.24,000 కోట్లుంది. నివేదిక ప్రకారం.. ఆన్లైన్లో 2014లో సుమారు 4 కోట్ల మంది కస్టమర్లు పలు ఉత్పత్తులను కొనుగోలు చేశారు. మెరుగైన రవాణా, బ్రాడ్‌బ్యాండ్, ఇంటర్నెట్ సౌకర్యమున్న మొబైల్స్ విస్తృతి కారణంగా కస్టమర్ల సంఖ్య 2015లో 6.5 కోట్లకు ఎగబాకుతుంది. మొత్తం ఈ-కామర్స్ మార్కెట్ రూ.1.02 లక్షల కోట్లుంది. 35% వార్షిక వృద్ధి రేటుతో అయిదేళ్లలో వ్యాపార పరిమాణం రూ.6 లక్షల కోట్లకు చేరుతుంది. మొబైల్స్ హవా.. ఆన్లైన్ రిటైల్ వ్యాపారంలో దుస్తులు అగ్రస్థానాన్ని కొనసాగిస్తాయి. దుస్తులతోపాటు కంప్యూటర్, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగాలు మార్కెట్ వృద్ధికి దోహదం చేయనున్నాయి. యాక్సెసరీస్‌తో కలిపి వీటి వాటా ప్రస్తుతం 39 శాతముంది. 2015లో 42 శాతానికి చేరనుంది. ఇక స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ పీసీ కొనుగోలుదారులు ఈ-రిటైల్ వృద్ధికి కీలకం కానున్నారు. ఇప్పటికే మొబైల్ ఫోన్ల వాటా 11 శాతముంది. 2017 నాటికి 25 శాతానికి చేరనుందని అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. అజీమ్ ప్రేమ్‌జీ, రతన్ టాటా వంటి ప్రముఖ ఇన్వెస్టర్లను పరిశ్రమ ఆకట్టుకుందని అన్నారు. దేశంలో అమెజాన్ వంటి అంతర్జాతీయ కంపెనీల కంటే ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లు తమ హవాను కొనసాగిస్తున్నాయి. ట్రావెల్ వాటా 75 శాతం.. ట్రావెల్, టూరిజం వ్యాపారంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్‌లో మొత్తం ట్రావెల్ సంబంధ వ్యాపారంలో 75 శాతం ఈ-కామర్స్ వేదికగా జరుగుతోంది. కాగా, దేశంలో ఇంటర్నెట్ వినియోగదార్లలో మూడింట ఒక వంతు ఆన్లైన్ కొనుగోళ్లు జరుపుతున్నారు. తొలిసారి ఆన్లైన్ కొనుగోలుదార్ల కంటే పాత కస్టమర్లు అధికంగా వ్యయం చేస్తున్నారట. ఈ-టైలింగ్లో గిడ్డంగుల నిర్వహణ, సరుకు రవాణాలో 25 వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ రెండు విభాగాల్లోనే 2017-20 నాటికి ఒక లక్ష మంది అదనంగా అవసరమని అంచనా. -
ఈ-కామర్స్‌లో ఉద్యోగాల వెల్లువ..!
న్యూఢిల్లీ: దేశంలో ఆన్లైన్ వ్యాపార(ఈ-కామర్స్) రంగం జోరుతో ఉద్యోగాలు వెల్లువెత్తనున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే రెండు మూడేళ్లలో ఈ-కామర్స్ పరిశ్రమ 20-25 శాతం వృద్ధిని సాధించనుందని.. కనీసం 1.5 లక్షల కొత్త కొలువులను అందించనుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఈ పరిశ్రమ పరిమాణం రూ.18,000 కోట్లుగా ఉంది. 2016 నాటికి ఇది రూ.50 వేల కోట్లకు చేరవచ్చని నిపుణులు లెక్కగడుతున్నారు. దీనిప్రకారం చూస్తే ఉద్యోగాల్లోనూ ఇదే స్థాయిలో వృద్ధి ఉంటుందనేది వారి అభిప్రాయం. ప్రస్తుతం తాము ఈ-కామర్స్ పరిశ్రమపై చాలా బుల్లిష్‌గా ఉన్నామని ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఇండియా ఎండీ జోసెఫ్ దేవసియా చెప్పారు. రెండుమూడేళ్లలో 1.5 లక్షల ఉద్యోగాలను ఈ-కామర్స్ రంగం సృష్టించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఈబే, మింత్రా వంటి దిగ్గజాలు భారీగా ఆదాయాలను ఆర్జిస్తున్నాయని.. ఈ ఏడాది తమ సంస్థ నుంచి మరింత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకోవచ్చని బిట్స్ పిలానీలో నియామకాల విభాగం చీఫ్ మణిశంకర్ గుప్తా చెప్పారు. దండిగా వేతనాలు..: గడిచిన ఏడాది వ్యవధిలో దేశీయంగా చాలావరకూ ఈ-కామర్స్ కంపెనీలు తమ ఉద్యోగులకు 10-40 శాతం మేర వేతనాలను పెంచాయని గుప్తా చెప్పారు. ప్రస్తుతం రూ.10-23 లక్షల మేర వేతనాలను ఆఫర్ చేస్తున్నాయని.. పెద్దసంఖ్యలో ప్రారంభస్థాయి ఉద్యోగులను ఎక్కువగా నియమించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మధ్య-సీనియర్ స్థాయి సిబ్బంది వేతనాలు వార్షికంగా 10-15% పెరుగుతున్నాయని.. దీనికితోడు ప్రోత్సాహకంగా ఇస్తున్న షేర్ల(ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్)తో ఆయా ఉద్యోగుల పంట పండుతోందని కూడా గుప్తా పేర్కొన్నారు. ఈ-కామర్స్‌లో జూనియర్ స్థాయి సిబ్బందికి వార్షికంగా రూ.1.45 లక్షలు-రూ.3 లక్షలు.. మధ్యస్థాయి(మిడ్ మేనేజ్మెంట్) ఉద్యోగులకు ఏటా రూ.12-30 లక్షల మేర వేతన ప్యాకేజీలు లభించనున్నాయని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ఈడీ సుచితా దత్తా చెప్పారు. -
ఆన్లైన్ రిటైలర్లపై ఈడీ దర్యాప్తు
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను ఉల్లంఘించాయన్న ఆరోపణలపై సుమారు డజనుకుపైగా ప్రముఖ ఆన్లైన్ రిటైల్ సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. గడిచిన కొన్నేళ్లుగా ఈ-రిటైలింగ్ జోరు నేపథ్యంలో ఆయా సంస్థల వ్యాపార కార్యకలాపాలను అధ్యయనం చేసే పనిలో ఈడీకి చెందిన ప్రత్యేక అధికారుల బృందం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత ఎఫ్‌డీఐ పాలసీ ప్రకారం బిజినెస్ టు కన్జూమర్(బీటూసీ) విభాగంలో ఉన్న దేశీయ ఈ-కామర్స్ కంపెనీల్లోకి ఎఫ్‌డీఐలకు అనుమతి లేదు. అయితే, బిజినెస్ టు బిజినెస్(బీటూబీ)లో మాత్రం 100% ఎఫ్‌డీఐలకు అనుమతిస్తున్నారు. అయితే, కొంతమంది విదేశీ ఇన్వెస్టర్లు దేశీ ఈ-రిటైలింగ్ సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెడుతుండటం, ఆయా కంపెనీలు భారీగా నిధులను సమీకరిస్తుండటంతో ఈడీ తొలిసారిగా వాటి కార్యకలాపాలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. -
ఆన్లైన్ స్టోర్స్‌లో పెట్టుబడుల ‘క్లిక్’
జోరే కారణం.. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల వినియోగం జోరు, ఖర్చుచేసే మధ్యతరగతి వర్గాలు పెరుగుతుండటం... యువత ఆన్లైన్ షాపింగ్‌కు మొగ్గుచూపుతుండటంతో భారత్‌లోనూ ఈ-కామర్స్ రంగం కళకళలాడుతోంది. ప్రస్తుతం దేశీ ఈ-కామర్స్ మొత్తం మార్కెట్ విలువ 13 బిలియన్ డాలర్లుగా అంచనా. ఇందులో ఈ-రిటైలింగ్ పరిశ్రమ మార్కెట్ విలువ దాదాపు 3 బిలియన్ డాలర్లు(సుమారు రూ.18,000 కోట్లు)గా ఉంది. ఇది 2018 నాటికి ఏడింతలకు పైగా ఎగబాకి 22 బిలియన్ డాలర్లకు చేరవచ్చని విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. అపార అవకాశాలు... ఈ-కామర్స్ మార్కెట్‌ను మరీ ఎక్కువచేసి చూపుతున్నారన్న వాదనలు ఉన్నప్పటికీ.. స్టార్టప్‌లలో పెట్టిన పెట్టుబడులను ప్రస్తుతం వాటి వ్యాపారాలు, వేల్యుయేషన్స్‌తో పోలిస్తే చాలా చౌకగానే భావించవచ్చని కలారి క్యాపిటల్ అనే వీసీ సంస్థ అంటోంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ బిలియన్ డాలర్ల(రూ.6,000 కోట్లు) ఆదా య మైలురాయిని అధిగమించగా... ఢిల్లీకి చెందిన మరో ఈ-రిటైలింగ్ అగ్రగామి స్నాప్‌డీల్ కూడా ఈ ఏడాది చివరికల్లా బిలియన్ డాలర్ల అమ్మకాల మార్కును అందుకోనుంది. గతేడాది ఈ-కామర్స్ పరిశ్రమ 50 కోట్ల డాలర్ల(సుమారు రూ.3,000 కోట్లు) పెట్టుబడులను ఆకర్షించింది. ఈ ఏడాది పెట్టుబడులు మరింత పెరిగే అవకాశాలున్నాయి. భారత్‌లోని టాప్-15 ఈ-కామర్స్ కంపెనీల వేల్యుయేషన్ 4.5 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా మింత్రాను ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసిన డీల్‌లో ఇన్వెస్టర్లకు 5-10 రెట్ల లాభాలు వచ్చినట్లు పరిశ్రమ వర్గాల అంచనా. అయితే, కొందరు విశ్లేషకులు మాత్రం మార్కెట్‌తో పోలిస్తే ప్రస్తుతం కంపెనీల వేల్యుయేషన్స్ మరీ ఎక్కువగా ఉన్నాయని భిప్రాయపడుతున్నారు. అన్‌లిస్టెడ్ సోషల్నెట్వర్కింగ్ అప్లికేషన్(యాప్) వాట్స్‌యాప్‌ను ఫేస్బుక్ ఏకంగా రూ.1.2 లక్షల కోట్లకు కొనుగోలు చేయడం తెలిసిందే. ఇంత ఎక్కువ వేల్యుయేషన్‌కు భారీగా యాక్టివ్ వినియోగదారుల సంఖ్య, భవిష్యత్తులో మరింత వ్యాపార విస్తరణకు అవకాశమే కారణం. ఇప్పుడు మన ఈ-కామర్స్ కంపెనీల వేల్యుయేషన్స్ పెరగడానికి ఇలాంటి అంశాలే దోహదం చేస్తున్నాయనేది నిపుణులు మాట. విస్తరిస్తున్న వ్యాపారం.. ఆన్లైన్ గ్రాసరీ స్టోర్ బిగ్‌బాస్కెట్ రూ.240 కోట్లను సమీకరించే యత్నాల్లో ఉంది. కంపెనీ విలువ బిలియన్ డాలర్లు(రూ.6,000 కోట్లు) ఉంటుందని తాజా అంచనా. టీవీ, ఆన్లైన్ షాపింగ్స్టోర్ నాప్తోల్ కూడా సుమారు రూ. 240 కోట్లను ప్రైవేటు ఈక్విటీ(పీఈ)/వెంచర్‌క్యాపిటల్(వీసీ) ఫండ్స్ నుంచి సమీకరించాలని భావిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో డీఎస్టీ గ్లోబల్ అనే పీఈ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో తాజాగా 21 కోట్ల డాలర్లను(సుమారు రూ.1,260 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. ఇప్పటికే టైగర్ గ్లోబల్, నాస్పెర్స్, ఐకోనిక్ క్యాపిటల్ ఫ్లిప్‌కార్ట్‌లో వాటాదారులుగా ఉన్నాయి. సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్న దేశీ ఈ-కామర్స్ రంగంలోకి పెట్టుబడుల ప్రవాహం వెల్లువెత్తుతోంది. అత్యంత ఆకర్షణీయమైన స్టార్టప్ పరిశ్రమగా నిలుస్తున్న ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్‌కు అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. ప్రతిరోజూ కనీసం రెండు కొత్త ఈ-రిటైలింగ్ వెంచర్లు పుట్టుకొస్తుండటమే దీనికి నిదర్శనం. అత్యుత్తమ పనితీరు, ఆదాయాల జోరున్న ఆన్లైన్ రిటైల్ కంపెనీల్లో డాలర్లను మరింతగా కుమ్మరించేందుకు ప్రైవేటు ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ ముందుకొస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీల వేల్యుయేషన్స్(విలువ) కూడా అంతకంతకూ దూసుకెళ్తున్నాయి. ఆయా కంపెనీలపై ఆన్లైన్ కస్టమర్లు ఉంచుతున్న భరోసాయే దీనికి దోహదం చేస్తోంది.