ఫ్లిప్ కార్ట్ కు ఈడీ 1000 కోట్ల జరిమానా?
ఫ్లిప్ కార్ట్ కు ఈడీ 1000 కోట్ల జరిమానా?
Published Tue, Oct 14 2014 9:13 PM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM
న్యూఢిల్లీ: ఆన్ లైన్ బిజినెస్ వెబ్ పోర్టల్ ఫ్లిప్ కార్ట్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల బిగ్ బిలియన్ డే సేల్ ను నిర్వహించడంలోనూ, ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించడలోనూ ఫ్లిఫ్ కార్ట్ విఫలమైందనే ఆరోపణలపై ప్రశ్నించడానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది.
ఫ్లిప్ కార్ట్ పై ఈడీ 1000 కోట్ల రూపాయల జరిమానా విధించే అవకాశం కనిపిస్తోంది. అయితే తాము నిబంధనల్ని పూర్తిగా పాటించామని, ఈడీ అధికారుల విచారణకు సహకరిస్తామని ఫ్లిప్ కార్ట్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Advertisement
Advertisement