Big Billion Day
-
ఒక్కరోజు అమ్మకాలు.. రూ. 1400 కోట్లు!
ఆన్లైన్ అమ్మకాలలో స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లు పెడుతున్నారంటే చాలు.. మనవాళ్లు విచ్చలవిడిగా కొనేస్తారన్న విషయం మరోసారి రుజువైంది. ఐదు రోజుల పాటు ప్రత్యేక ఆఫర్లతో మోతెక్కిస్తున్న ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్.. ఇలాంటి సంస్థలన్నీ కూడా బ్రహ్మాండమైన వసూళ్లు సాధిస్తున్నాయి. అందులోనూ ఫ్లిప్‌కార్ట్ మొదటిరోజు అమ్మకాలు రికార్డు బద్దలుకొట్టాయి. ప్రారంభం రోజునే ఏకంగా రూ. 1400 కోట్ల అమ్మకాలను నమోదు చేసి ఫ్లిప్‌కార్ట్ ఈ రేసులో దూసుకుపోయింది. పోటీదారుల కంటే నాలుగు అడుగులు ముందే నిలిచింది. గత సంవత్సరం సాధించిన అమ్మకాల కంటే రెట్టింపునకు పైగా ఈసారి అమ్మకాలు సాగాయని తెలుస్తోంది. వాస్తవానికి ఈసారి వెయ్యి కోట్ల రూపాయల వరకు అమ్మకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుడు, సీఈఓ బిన్నీ బన్సల్ చెప్పారు. తొమ్మిదేళ్ల క్రితం ఆన్లైన్లో కేవలం పుస్తకాల అమ్మకాలతో వ్యాపారం ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్ తొలిసారి ఒక్క రోజులో వెయ్యి కో్ట్ల మార్కును దాటి రికార్డు సాధించింది. ఒక్క రోజులోనే గ్రాస్ అమ్మకాలు ఇంత స్థాయిలో ఉండటం ఇప్పటి వరకు మరే భారతీయ ఈ-టైలర్‌కు సాధ్యం కాలేదని అంటున్నారు. దసరా, దీపావళి సీజన్ సందర్భంగా మొత్తం అందరూ కలిసి ఐదురోజుల అమ్మకాల్లో దాదాపు రూ. 12 వేల కోట్లు సాధిస్తారని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఏడాది ఇదే సీజన్లో మొత్తం అమ్మకాలు కేవలం రూ. 7 కోట్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే భారతీయ రీటైల్ మార్కెట్ బాగా పుంజుకుందని అర్థమవుతోంది. -
సూపర్ ఆఫర్లతో బిగ్ బిలియన్ డేస్
-
ఫ్లిప్ కార్ట్ లో పుస్తకం ధర పై మళ్లీ జోకులు!
బిగ్ బిలియన్ డే ఘటనను ఇంకా మరిచిపోకముందే ఫ్లిప్ కార్ట్ మరో తప్పిదం చేసింది. ఆంటానియో సియాన్ రచించిన 'ఫోర్ టోల్డ్' పుస్తకం ధర 33,86,660 రూపాయలు అని.. 5 శాతం డిస్కౌంట్ తర్వాత 32,17,223 అంటూ వెబ్ సైట్ లో పెట్టారు. ఈ పుస్తకం ధరపై జోకులు పేలడంతో చేసిన తప్పును వెంటనే గుర్తించి ఫ్లిప్ కార్ట్ తన తప్పును సరిద్దిదుకుంది. ఈ పుస్తకం ధరపై ఇంటర్నెట్ లో లెక్కలేనని జోకులు పేలాయి. 'ఈ పుస్తకం కొనడానికి ప్రపంచ బ్యాంక్ తోపాటు అన్ని బ్యాంకులను సంప్రదించాం. కాని ఎలాంటి ఫలితం కనిపించలేదు. స్విస్ బ్యాంక్ లో భారతీయ రాజకీయ వేత్తలు దాచుకున్న నల్లధనంతో ఈ పుస్తకం కొనవచ్చేమో' అంటూ వ్యాఖ్యలు చేశారు. 'ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే.. కనీసం 155,993 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది' ఓ నెటిజన్ ట్విటర్ లో ఓసందేశాన్ని పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు లియోనార్డ్ డా విన్సీ రచించిన పుస్తకం అత్యంత ఖరీదైనదిగా రికార్డుకెక్కింది. 1994 నవంబర్ లో క్రిస్టీ హౌజ్ నిర్వహించిన వేలంలో 30.8 మిలియన్ డాలర్ల చెల్లించి మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సొంతం చేసుకున్నారు. Follow @sakshinews -
ఫ్లిప్‌కార్ట్‌పై కొనసాగుతున్న ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు
న్యూఢిల్లీ: ఆన్లైన్ రిటైల్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న ఈకామర్స్ బిజినెస్‌కు సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనల ఉల్లంఘన జరిగిందా అన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే మీడియాలో వస్తున్నట్లు గత వారం బిగ్ బిలియన్ డే పేరుతో నిర్వహించిన ఆన్లైన్ అమ్మకాలపై ఎలాంటి దర్యాప్తునూ చేపట్టలేదని స్పష్టం చేసింది. గత వారం భారీ డిస్కౌంట్లతో నిర్వహించిన అమ్మకాలపై పలువురు ట్రేడర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఈ అంశంపై తగిన పరిశీలన చేపట్టనున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, నిబంధనలమేరకే తాము బిజినెస్ నిర్వహిస్తున్నామని, అవసరమైనప్పుడు అధికారులకు తగిన విధంగా సహకరిస్తామని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ప్రధానంగా ఎఫ్‌డీఐ నిబంధనలకు సంబంధించి ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఇతర ఈరిటైల్ కంపెనీలపై దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారి ఒకరు వివరించారు. -
ఫ్లిప్ కార్ట్ కు ఈడీ 1000 కోట్ల జరిమానా?
న్యూఢిల్లీ: ఆన్ లైన్ బిజినెస్ వెబ్ పోర్టల్ ఫ్లిప్ కార్ట్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల బిగ్ బిలియన్ డే సేల్ ను నిర్వహించడంలోనూ, ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించడలోనూ ఫ్లిఫ్ కార్ట్ విఫలమైందనే ఆరోపణలపై ప్రశ్నించడానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఫ్లిప్ కార్ట్ పై ఈడీ 1000 కోట్ల రూపాయల జరిమానా విధించే అవకాశం కనిపిస్తోంది. అయితే తాము నిబంధనల్ని పూర్తిగా పాటించామని, ఈడీ అధికారుల విచారణకు సహకరిస్తామని ఫ్లిప్ కార్ట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
సారీ.. ఫెయిలయ్యాం: ఫ్లిప్‌కార్ట్
అంచనాలు అందుకోలేకపోయాం బిగ్ బిలియన్ డే వైఫల్యంపై ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యం న్యూఢిల్లీ: బిగ్ బిలియన్ డే పేరిట నిర్వహించిన సేల్స్ స్కీమ్‌పై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ .. కొనుగోలుదారులకు క్షమాపణలు చెప్పింది. పనితీరులో అంచనాలను అందుకోవడంలో విఫలమైనట్లు పేర్కొంది. ఈసారి మరింత మెరుగ్గా నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. ‘ఇంత పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు మాపై విశ్వాసముంచడం సంతోషం కలిగించింది. అయితే, మా వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయాలనుకున్న మరెన్నో కోట్ల మంది అంచనాలకు తగ్గట్లుగా పనితీరు కనపర్చలేకపోవడం మమ్మల్ని నిరాశపర్చింది. ఇది మాకు ఎంత మాత్రం ఆమోదయోగ్యంగా లేదు. ఇకపై ఇలా జరగకుండా, మా బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంటున్నాం. ఈసారి మరింత మెరుగ్గా నిర్వహిస్తాం’ అంటూ ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ కస్టమర్లకు సంయుక్తంగా పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. కస్టమర్ల నుంచి గతంలో ఎన్నడూ లేనంతగా స్పందన కనిపించిందని, ఇంత భారీ స్థాయిలో ట్రాఫిక్‌ను ఊహించకపోవడంతో తగినన్ని ఏర్పాట్లు చేసుకోలేకపోయామని చెప్పారు. అవసరానికి తగ్గ స్థాయిలో ఉత్పత్తులను అందుబాటులో ఉంచలేకపోయామని పేర్కొన్నారు. తాము సాధ్యమైనంత వరకూ పలు ఉత్పత్తులను వందలు, లక్షల సంఖ్యలో అందుబాటులో ఉంచినప్పటికీ.. అవి ఏ మూలకు సరిపోలేదన్నారు. ఇకపై మరిన్ని జాగ్రత్తలు..: సర్వర్‌పై ఒక్కసారిగా భారం పడటంతో వెబ్సైట్ పలుమార్లు క్రాష్ కావడం, షాపింగ్ అనుభూతిపై ప్రతికూల ప్రభావం చూపడం జరిగిందని సచిన్, బిన్నీ తెలిపారు. దీనివల్ల కొనుగోలుదారులు తమపై ఉంచిన నమ్మకం సడలిపోతుంది కనుక.. ఇకపై ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అవుటాఫ్ స్టాక్ సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తామని వారు వివరించారు. భారీ అమ్మకాలు.. పండుగ సీజన్ సందర్భంగా ఆన్లైన్ షాపింగ్ సైట్లు భారీ స్థాయిలో డిస్కౌంట్లు ఆఫర్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 6న ఒక్క రోజే చెరి రూ. 600 కోట్ల మేర వ్యాపారం చేసినట్లు ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వెల్లడించాయి. ఫ్లిప్‌కార్ట్ 6వ తారీఖు ఉదయం 8 నుంచి మర్నాడు ఉదయం 8 గం.ల దాకా బిగ్ బిలియన్ డే పేరుతో నిర్వహించిన సేల్‌లో దాదాపు 15 లక్షల మంది పైగా కొనుగోలుదారులు షాపింగ్ చేసినట్లు అంచనా. కేవలం పది గంటల్లోనే రూ. 600 కోట్ల విలువ చేసే ఉత్పత్తులను విక్రయించినట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఈ లెక్కన చూస్తే.. రూ. 18,000 కోట్ల వార్షిక అమ్మకాల లక్ష్యాన్ని సులువుగా సాధించవచ్చని అంచనాలు నెలకొన్నాయి. అటు స్నాప్‌డీల్ సైతం నిమిషానికి రూ. 1 కోటి మేర విక్రయాలు జరిపినట్లు చెప్పుకొచ్చింది. అయితే, సదరు కంపెనీలు తమ డిస్కౌంట్ స్కీములు భారీగా హిట్టయ్యాయి అంటున్నా.. మెజారిటీ షాపర్లు ఫ్లాప్ ముద్ర వేశారు. ఫిర్యాదుల వెల్లువ .. బిగ్ బిలియన్ డేలో ఫ్లిప్‌కార్ట్.. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, బంగారం నాణేలు, ఇతరత్రా ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఉదాహరణకు నోకియా 1020 మొబైల్‌ని రూ. 19,999కే అందిస్తున్నట్లు పేర్కొంది. ఇది సదరు మొబైల్ అసలు లాంచింగ్ ధర కన్నా 60% తక్కువ. అలాగే, రూ. 13,990 విలువ చేసే శామ్సంగ్ ట్యాబ్2ని అసలు ధరలో పదో వంతు రూ. 1,390కే అందిస్తున్నామంటూ ఫ్లిప్‌కార్ట్ ఊదరగొట్టింది. కొందరు కస్టమర్లకు డిస్కౌం ట్లపై కొన్ని ఉత్పత్తులు లభించినా.. మిగతా వారి నుంచి బిగ్ బిలియన్ డేపై భారీ స్థాయిలోనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పేరుకు డిస్కౌంటు ఆఫర్ అయినా ఒకే ఉత్పత్తి వివిధ సమయాల్లో వివిధ రకాల రేట్లలో దర్శనమివ్వడం ఇందుకు కారణం. పెపైచ్చు వెబ్సైట్ క్రాష్ కావడం పలువురికి అసహనం కలిగించింది. అయి తే, 100 కోట్లకు పైగా హిట్స్ రావడంతో సాంకేతిక సమస్యల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఫ్లిప్‌కార్ట్ సమర్థించుకుంది. బిగ్ బిలియన్ డే భారీ ఈవెంట్ కోసం సాధారణం కంటే 20 రెట్లు అధిక ట్రాఫిక్‌ను అంచనా వేసి 5,000 సర్వర్లను ఉపయోగించినట్లు పేర్కొంది. -
పది గంటల్లో రూ. 600 కోట్ల అమ్మకాలు!
బిగ్ బిలియన్ డే.. ఈ మాట సోమవారం నాడు లక్షలాది మంది ఫ్లిప్‌కార్ట్ యూజర్లను ఎంతగానో ఊరించింది. 40 అంగుళాల ప్లాస్మా టీవీ 20వేల రూపాయలకే అంటే అవసరం ఉన్నవాళ్లు, లేనివాళ్లు కూడా పోటీలు పడి మరీ కొన్నారు. ఇలా మొత్తం అందరి కొనుగోళ్లు కలిపి కేవలం పది గంటల్లో జరిగిన మొత్తం అమ్మకాలు.. అక్షరాలా 600 కోట్ల రూపాయలు! అయితే, ఈ అమ్మకం సమయంలో సవాలక్ష సమస్యలు తలెత్తాయంటూ చాలామంది యూజర్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు. ఉదయం 8 గంటల నుంచే కస్టమర్లు కొనుగోళ్లు మొదలుపెట్టారని, నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకు రావడంతో రోజంతా అమ్మకాలు విపరీతంగా సాగాయని, భారతీయ ఈ-కామర్స్ చరిత్రలోనే ఇదో రికార్డని ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. అయితే, లావాదేవీలు పూర్తి చేయడంలో కొన్ని సమస్యలు తలెత్తిన మాట కూడా వాస్తవమేనని వారు ఆ ప్రకటనలో అంగీకరించారు. వచ్చిన ఎర్రర్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని సరిచేయడానికి తమ టెక్నాలజీ బృందం నిరంతరం శ్రమించిందని చెప్పారు. కేవలం ఒక్క సోమవారం రోజునే వంద కోట్ల హిట్లు తమ సైట్‌కు వచ్చాయన్నారు. పది గంటల అమ్మకాల్లో సుమారు రూ. 615 కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. ఇక ఫ్లిప్‌కార్ట్‌కు ప్రత్యర్థి అయిన స్నాప్‌డీల్ కూడా దివాలీ బంపర్ సేల్ అంటూ సోమవారం నడిపించింది. తాము నిమిషానికి కోటి రూపాయల చొప్పున అమ్మినట్లు ఆ సైట్ ప్రతినిధులు తెలిపారు. అది సుమారుగా ఫ్లిప్‌కార్ట్ అమ్మకాలకు సమానం అవుతుంది. -
ఫ్లిప్‌కార్ట్‌కు ‘బిలియన్’ హిట్స్..
బెంగళూరు: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డే’ పేరుతో సోమవారం ఇచ్చిన భారీ డిస్కౌంట్ ఆఫర్లకు అనూహ్య స్పందన లభించింది. 24 గంటల్లో తాము 10 కోట్ల డాలర్ల(సుమారు రూ.615 కోట్లు) స్థూల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకోగా.. ఆఫర్ మొదలైన(సోమవారం ఉదయం 8 గంటలకు) 10 గంటల్లోనే దీన్ని సాధించగలిగామని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఆన్లైన్ వినియోగదార్లు భారీగా పోటెత్తడంతో సోమవారం బిలియన్(100 కోట్లు) వెబ్సైట్ హిట్స్‌ను కూడా నమోదుచేశామని వెల్లడించింది. కాగా, వెబ్ ట్రాఫిక్ ఊహించనంతగా రావడంతో ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ క్రాష్ అయింది. కొంతసేపు సైట్ స్తంభించడంతో యూజర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆఫర్ పేరు చెబుతూ.. డిస్కౌంట్ ముందు ధరలకే విక్రయిస్తోందన్న విమర్శలు కూడా సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. అయితే, ఒకేసారి లక్షల సంఖ్యలో యూజర్లు వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడంతో సాంకేతిక సమస్యలు వచ్చాయని.. తమ సిబ్బంది దీన్ని సరిచేసినట్లు కంపెనీ వివరణ ఇచ్చింది. అక్టోబర్ 6(6-10) రోజు.. బెంగళూరులో ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు 2007లో ఫ్లిప్‌కార్ట్‌ను ప్రారంభించిన ఫ్లాట్ నంబర్ కూడా 610 ఒకటే కావడంతో ఈ ‘బిగ్ బిలియన్ డే’ పేరుతో అసాధారణ డిస్కౌంట్లను కంపెనీ ఆఫర్ చేసింది. ‘ఇది మాకు మరపురాని రోజు.. దేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ అమ్మకంగా ఇది నిలిచింది. కస్టమర్లు ఉదయం 8 నుంచే కొనుగోళ్లకు సిద్ధమయ్యారు. అనూహ్యమైన స్పందన లభించింది’ అని ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ-కామర్స్ కంపెనీలను నియంత్రించాలి న్యూఢిల్లీ: ఆన్లైన్ విక్రయ(ఈ-కామర్స్) కంపెనీల భారీ డిస్కౌంట్ల కారణంగా సాంప్రదాయ వ్యాపారులు(ఆఫ్‌లైన్ మార్కెట్) తీవ్రంగా దెబ్బతింటున్నారని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య(సీఏఐటీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ-కామర్స్ సంస్థల నియం త్రణ, పర్యవేక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఏఐటీ నేషనల్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల్ ఒక లేఖను రాశారు. దేశంలో ఈ-కామర్స్ పరిశ్రమకు నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఫ్లిప్ కార్ట్ 'బిలియన్' సేల్ పై జోకుల పేలాయి!
హైదరాబాద్: బిగ్ బిలియన్ డే సేల్ వినియోగదారుల్ని నిరుత్సాహానికి గురిచేస్తోంది. తక్కువ ధరకే నచ్చిన వస్తువులను సొంతం చేసుకుందామని ప్రయత్నించిన ఆన్ లైన్ వినియోగదారుల్ని ఫ్లిప్ కార్ట్ సంస్థ వెబ్ సైట్ చికాకుపరిచింది. భారీ డిస్కౌంట్ ధరకు వస్తువులను 8 గంటలకే సొంతం చేసుకుందామని కాచుకు కూర్చున్న ఇంటర్నెట్ యూజర్ల ఉత్సాహంపై ఫ్లిప్ కార్ట్ నీళ్లు చల్లింది. అవుటాఫ్ స్టాక్, అమ్ముడయ్యాయి, 505 error, ధరలు మారుతుడటం లాంటి అంశాలపై వినియోగదారులు జోకులు పేల్చుతున్నారు. బిగ్ బిలియన్ సేల్ పై ఇంటర్నెట్ యూజర్లు సోషల్ మీడియాలో కామెంట్లు విసురుతున్నారు. ఏదిఏమైనా అట్టహాసంగా ఫ్లిప్ కార్ట్ ప్రారంభించిన ప్రచారం వ్యూహాం వినియోగదారుల్ని నిరుత్సాహపరిచాయి. బిగ్ బిలియన్ సేల్ లోని లోపాలు గుర్తించిన పోటీ వెబ్ సైట్లు వినియోగదారుల్ని ఆకర్షించడానికి కొత్త డిస్కౌంట్లను ప్రకటించాయి. Sold out , out of stock , error 505 , vanishing cart , fluctuating prices , #bigbillionday ?? Really #flopkart— Darshan Majithia (@darshanmajithia) October 6, 2014What Flipkart is saying as #BigBillionDay, is what you see every other day at Ameerpet #Lulz— Ratnakar Sadasyula (@ScorpiusMaximus) October 6, 2014Waited for #bigbillionday , and the tripod in my cart became more expensive— Varsha Mohan (@varshamohan) October 6, 2014Flipkart’s The Big Billion Day – a pricing SCAM? http://t.co/3Jft6OgCtP #flipkart #BigBillionDay— Monish Menon (@monishmenon) October 5, 2014