ఫ్లిప్ కార్ట్ లో పుస్తకం ధర పై మళ్లీ జోకులు!
ఫ్లిప్ కార్ట్ లో పుస్తకం ధర పై మళ్లీ జోకులు!
Published Wed, Nov 5 2014 10:45 AM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM
బిగ్ బిలియన్ డే ఘటనను ఇంకా మరిచిపోకముందే ఫ్లిప్ కార్ట్ మరో తప్పిదం చేసింది. ఆంటానియో సియాన్ రచించిన 'ఫోర్ టోల్డ్' పుస్తకం ధర 33,86,660 రూపాయలు అని.. 5 శాతం డిస్కౌంట్ తర్వాత 32,17,223 అంటూ వెబ్ సైట్ లో పెట్టారు. ఈ పుస్తకం ధరపై జోకులు పేలడంతో చేసిన తప్పును వెంటనే గుర్తించి ఫ్లిప్ కార్ట్ తన తప్పును సరిద్దిదుకుంది.
ఈ పుస్తకం ధరపై ఇంటర్నెట్ లో లెక్కలేనని జోకులు పేలాయి. 'ఈ పుస్తకం కొనడానికి ప్రపంచ బ్యాంక్ తోపాటు అన్ని బ్యాంకులను సంప్రదించాం. కాని ఎలాంటి ఫలితం కనిపించలేదు. స్విస్ బ్యాంక్ లో భారతీయ రాజకీయ వేత్తలు దాచుకున్న నల్లధనంతో ఈ పుస్తకం కొనవచ్చేమో' అంటూ వ్యాఖ్యలు చేశారు.
'ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే.. కనీసం 155,993 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది' ఓ నెటిజన్ ట్విటర్ లో ఓసందేశాన్ని పోస్ట్ చేశారు.
ఇప్పటి వరకు లియోనార్డ్ డా విన్సీ రచించిన పుస్తకం అత్యంత ఖరీదైనదిగా రికార్డుకెక్కింది. 1994 నవంబర్ లో క్రిస్టీ హౌజ్ నిర్వహించిన వేలంలో 30.8 మిలియన్ డాలర్ల చెల్లించి మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సొంతం చేసుకున్నారు.
Advertisement