
ముంబై: చిన్న, మధ్య తరహా సంస్థలకు రూ. కోటి వరకు మూలధన రుణాలుగా అందిస్తున్నట్టు చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి) మంగళవారం ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా అత్యవసర పరిస్థితులకు స్పందనగా 48 గంటల్లోనే ఈ రుణాన్ని అందిస్తామని, ఇందుకు ఎటువంటి తనఖా లేదా హామీ అవసరం లేదని సిబ్బి తెలిపింది. అలాగే, ఎంఎస్‌ఎంఈలకు రుణ సదుపాయా న్ని రూ.2 కోట్ల వరకు పెంచినట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment