యూకే లేకుండానే బ్రెగ్జిట్ చర్చలు!
యూకే లేకుండానే బ్రెగ్జిట్ చర్చలు!
Published Sat, Apr 29 2017 8:06 PM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM
యూకే లేకుండానే యూరోపియన్ యూనియన్ దేశాలు బ్రెగ్జిట్ చర్చలు జరుపబోతున్నాయి. ఈమేరకు ఈయూ సభ్య దేశాలు బ్రుస్సెల్స్ లో సమావేశం కాబోతున్నాయని శనివారం రిపోర్టులు వచ్చాయి. ఈ చర్చలో 27 ఈయూ దేశాలు పాల్గొంటాయని బీబీసీ రిపోర్టు చేసింది. భవిష్యత్తు వాణిజ్య సంబంధాల గురించి ఎలాంటి చర్చలైనా ప్రారంభించబోయే ముందు యూకే లేకుండా తమ పురోగతి గురించి ఓసారి చర్చించాలని ఈయూ నిర్ణయించినట్టు తెలిసింది. జూన్ 8న యూకేలో సాధారణ ఎన్నికల ముగిసే వరకు ఈయూ సైతం లండన్ తో ఎలాంటి అధికారిక చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేదు.
ఈయూలోని 27 దేశాల లీడర్లకు లేఖ రాసిన యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్.. యూకేతో భవిష్యత్తు సంబంధాలు గురించి చర్చించే ముందు ప్రజలు, నగదు, ఐర్లాండ్ విషయంలో ఓ అగ్రిమెంట్ కు రావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు గురించి చర్చించే ముందు మన గతాన్ని కూడా ఓసారి గుర్తుచేసుకోవాలని టస్క్ ఈయూ సభ్యులకు తెలిపారు. ఈయూ నుంచి యూకే వైదొలిగిన ప్రధాన సమస్యలపై తాము పురోగతి సాధించేంత వరకు యూకేతో భవిష్యత్తు సంబంధాలపై చర్చించేది లేదని తేల్చిచెప్పారు. ఒక్కసారి బ్రెగ్జిట్ చర్చలు ముగిశాక, ఎలాంటి ప్రయోజనాలను ఈయూ సభ్యుల నుంచి యూకే పొందడానికి లేదని జర్మన్ ఆర్థిక మంత్రి వోల్ఫ్గ్యాంగ్ స్చ్యూబ్లే చెప్పారు.
Advertisement
Advertisement