మహిళా దినోత్సవానికి ఎక్స్ఛేంజీల ప్రత్యేక ‘రింగింగ్’
న్యూఢిల్లీ: మహిళా దినోత్సవం(8న) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఈ వారం గంట మోగించే (రింగింగ్ బెల్) కార్యక్రమాన్ని లింగ సమానత్వానికి అంకితం చేయనున్నాయి. దీంట్లో భాగంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ)నేడు (సోమవారం) ప్రత్యేకమైన క్లోజింగ్ బెల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. ఇక బీఎస్‌ఈ ఈ నెల 8న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
ఇంకా వివక్ష..: లింగ అసమానత్వ తేడాను తగ్గించడానికి వ్యాపారాలు, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు నిర్వహించగల, నిర్వహించాల్సిన కీలకమైన పాత్రపై అందరి దృష్టిని ఆకర్షించడం లక్ష్యంగా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. భారత్‌లోని ప్రైవేట్ రంగ వ్యాపార సంస్థలు లింగసమానత్వ ప్రయోజనాలను గుర్తించడం పెరుగుతోందని ఎన్‌ఎస్‌ఈ సీఈఓ ఇన్‌చార్జ్ జే.రవిచంద్రన్ తెలిపారు. అయితే ప్రపంచవ్యాప్తంగా వేతనాలు, విద్య, ఉన్నత స్థాయి నాయకత్వ స్థానాల విషయమై మహిళలు ఇంకా అసమానత్వాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారని అన్నారు.
ఈ నెల 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పలు ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి. హాంగ్‌కాంగ్ ఎక్సే్ఛం జేస్, నాస్‌డాక్, ఎన్‌వైఎస్‌ఈ, డాషే, యూరోనెక్స్‌ట్ ప్యారిస్, లండన్ స్టాక్ ఎక్సే్ఛంజ్, టొరంటొ స్టాక్ ఎక్సే్ఛంజ్, ఐరిష్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌తోసహా మొత్తం 43 స్టాక్ ఎక్సే్ఛంజ్‌లు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నాయి.