
ఇక ఎగుమతులు పెరిగే అవకాశం: నిర్మల
న్యూఢిల్లీ : దిగుమతుల క్షీణ ధోరణి ఇక ముగిసినట్లేనని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇకమీదట ఎగుమతులు పెరిగే అవకాశాలే ఉన్నాయని బుధవారం పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంకా పరిస్థితులు కుదుటపడకపోయిన విషయం వాస్తవమైనప్పటికీ, క్షీణ ధోరణి సమస్య మాత్రం తొలగిపోయిందని తాము భావిస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. ఈ ఏడాది మే నెల వారకూ వరుసగా 18 నెలలు భారత ఎగుమతుల్లో వృద్ధి లేకపోగా, క్షీణతను నమోదుచేసుకుంటున్న సంగతి తెలిసిందే.