6 నెలల్లో 20,000 మందికి ఫేస్‌బుక్‌ వ్యాపార శిక్షణ | Facebook to train 20000 entrepreneurs pan-India with EDI | Sakshi
Sakshi News home page

6 నెలల్లో 20,000 మందికి ఫేస్‌బుక్‌ వ్యాపార శిక్షణ

Published Wed, Jul 19 2017 12:54 AM | Last Updated on Fri, Jul 27 2018 12:33 PM

6 నెలల్లో 20,000 మందికి  ఫేస్‌బుక్‌ వ్యాపార శిక్షణ - Sakshi

6 నెలల్లో 20,000 మందికి ఫేస్‌బుక్‌ వ్యాపార శిక్షణ

ఈడీఐఐతో భాగస్వామ్యం
 గాంధీనగర్‌: సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ‘ఫేస్‌ బుక్‌’ తన ‘బూస్ట్‌ యూవర్‌ బిజినెస్‌’ కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. తొలి దశలో భాగంగా దేశంలోని 100 పట్టణాల నుంచి ఆరు నెలల కాలంలో 20,000 మంది ఎంట్రప్రెన్యూర్లకు శిక్షణనివ్వాలని, తద్వారా వారి వ్యాపారాభివృద్ధికి సహకారం అందించాలని చూస్తోంది.

ఇందులో భాగంగా ఫేస్‌బుక్‌ తాజాగా గాంధీనగర్‌లోని ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాతో (ఈడీఐఐ) జట్టుకట్టింది. ‘బూస్ట్‌ యూవర్‌ బిజినెస్‌ కార్యక్రమాన్ని 2015లో ప్రారంభించాం. అయితే ఇప్పుడు ఈడీఐఐ భాగస్వామ్యంతో 6 నెలల్లో 20 రాష్ట్రాల్లోని 100 పట్ట ణాలకు విస్తరించనున్నాం’ అని దక్షిణాసియా ప్రోగ్రామ్స్‌ హెడ్‌ రితేశ్‌ మెహ్‌తా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement