సామాన్యులకూ ఫాంహౌస్!
షాద్‌నగర్‌లో రెండు ప్రాజెక్ట్‌లను ప్రారంభించిన స్పేస్ విజన్
సాక్షి, హైదరాబాద్ : గతంలో ఫాంహౌస్ అనగానే ధనవంతులకు మాత్రమే పరిమితమయ్యేవి. కానీ, నేడవి సామాన్య, మధ్యతరగతి ప్రజలకూ అందుబాటులోకి వచ్చేశాయి. అది కూడా మన స్థలంలో మలబార్ చెట్లు, సేంద్రియ పండ్ల మొక్కలని పెంచుతూ భవిష్యత్తులో ఎక్కువ మొత్తంలో లాభం ఆర్జించేలా చేయడమే మా ప్రాజెక్ట్‌ల ప్రధాన ఉద్దేశ్యమంటున్నారు స్పేస్ విజన్ ఎడిఫైస్ ప్రై.లి. సీఎండీ టీవీ నర్సింహారెడ్డి. హైదరాబాద్-విజయవాడ హైవేలోని షాద్‌నగర్‌లో పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించిన సందర్భంగా ఆయన ‘సాక్షి రియల్టీ’తో మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే..
స్థిరాస్తి వ్యాపారమంటే కొనుగోలుదారులకు స్థలాన్ని అమ్మేసి చేతులు దులుపుకోవటం కాకుండా.. ఆ స్థలంలో డిమాండ్ ఉన్న చెట్లను పెంచి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని యజమానులకూ అందించమే మా లక్ష్యం. అందుకే షాద్‌నగర్ దాటిన తర్వాత పోలేపల్లి ఫార్మా ఎస్‌ఈజెడ్‌లో 500 ఎకరాల్లో ‘గ్రీన్ ఎకర్స్’ పేరుతో ఫాంహౌస్ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. ధర ఎకరానికి రూ.12 లక్షలు.
భవిష్యత్తు అవసరాల రీత్యా ప్లాట్లపై పెట్టుబడులు పెట్టిన వారికి ఎకరం విస్తీర్ణంలో 300 మలబార్ వేప, 25 సేంద్రియ పండ్ల మొక్కలనూ పెంచుతున్నాం. ఇవి 6-8 ఏళ్లకు వాణిజ్య పరంగా విలువకొస్తాయి. చెట్ల పెంపకం నుంచి ట్రేడింగ్ వంటివాటిని గ్రీన్ అగ్రి సంస్థకు అప్పగించాం. వీకెండ్స్‌లో ఫాంహౌస్‌లో కొనుగోలుదారులు కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసేందుకు వీలుగా 5 ఎకరాల్లో క్లబ్ హౌస్‌ను నిర్మించాం. 24 గంటల పాటు పటిష్టమైన భద్రత, చెట్ల పెంపకం పూర్తిగా సేంద్రియ పద్ధతిలో చేయటం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత.
షాద్‌నగర్‌లోని ఎన్‌ఆర్‌ఎస్‌ఏ ప్రాంతంలో 800 ఎకరాల్లో డీటీసీపీ అనుమతి పొందిన అంబియెన్స్ టౌన్‌షి ప్ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నాం. ఇందులో 147-1,000 గజాల మధ్య ఉండే మొత్తం 15 వేల ఓపెన్ ప్లాట్లొస్తా యి. ధర గజానికి రూ.2,250. ఇందులో 12 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, స్పా, మెడిటేషన్ సెంటర్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, జా గింగ్, వాకింగ్ ట్రాక్స్ ఆధునిక వసతులెన్నో కల్పిస్తున్నాం. వాయిదాల రూపంలో ప్లాట్లను అందిస్తున్నాం.
శంషాబాద్ విమానాశ్రయానికి, ఔటర్ రింగ్ రోడ్డుకు 20 నిమిషాల ప్రయాణ వ్యవధి. ప్రాజెక్ట్‌కు సమీపంలో 60కి పైగా నివాస సముదాయాలతో పాటుగా రిసార్ట్‌లు, గోల్ఫ్‌కోర్ట్‌లున్నాయి. ఎయిర్ కార్గో, ప్రొక్టర్ అండ్ గ్యాంబెల్, నాట్కో, ఐటీ, హార్డ్‌వేర్ పార్క్‌లూ ఉన్నాయిక్కడ. ఇవి చాలు సమీప భవిష్యత్తులో షాద్‌నగర్ అభివృద్ధి గురించి చెప్పడానికి.