న్యూఢిల్లీ: వచ్చే నెల 1 నుంచి రోడ్డు మీదకి రాబోయే కొత్త ఫోర్ వీలర్ వాహనాలన్నింటికి ’ఫాస్టాగ్’ పరికరం తప్పనిసరి కానుంది. ఆటోమొబైల్ తయారీ సంస్థలు లేదా అధీకృత డీలర్లు వీటిని ఆయా వాహనాల ముందు విండ్‌స్క్రీన్‌లపై వీటిని అమర్చాకే విక్రయించాల్సి ఉంటుంది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ గురువారం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఫాస్టాగ్ డివైజ్‌తో టోల్ గేట్ల దగ్గర చెల్లింపుల ప్రక్రియ సులువు కానుంది. వాహనం విండ్‌స్క్రీన్‌పై అమర్చే ఈ పరికరాన్ని ఆయా వాహనదారుల సేవింగ్స్ ఖాతా లేదా ప్రీపెయిడ్ ఖాతాకు అనుసంధానమై ఉంటుంది.
టోల్ గేట్ల నుంచి ప్రయాణించేటప్పుడు ఆయా ప్లాజాల్లోని పరికరం.. ఈ ఫాస్టాగ్‌లలో నిక్షిప్తమైన సమాచారాన్ని గ్రహించడం ద్వారా చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో ప్రత్యేకంగా నగదు చెల్లించేందుకు ప్లాజా వద్ద ఆగాల్సిన శ్రమ తప్పుతుంది. ప్రస్తు తం జాతీయ రహదారులపై 370 టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ విధానం అమల్లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment