4.55 లక్షల ధరతో మార్కెట్ లోకి ఫియట్ బుల్లికారు!
4.55 లక్షల ధరతో మార్కెట్ లోకి ఫియట్ బుల్లికారు!
Published Tue, Aug 5 2014 2:49 PM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM
న్యూఢిల్లీ: మార్కెట్ లో ఎదురవుతున్న పోటీని ఎదుర్కోవడానికి పుంటో ఏవో పేరుతో మార్కెట్ లోకి చిన్నకారును ఫియట్ గ్రూప్ ఆటోమొబైల్స్ ఇండియా విడుదల చేసింది. పుంటో ఏవో కారు విలువ 4.55 లక్షల నుంచి 7.19 (ఢిల్లీ ఎక్స్ షోరూం ధర) లక్షల వరకు ఉంటుందని ఫియట్ కంపెనీ వెల్లడించింది. మారుతి స్విఫ్ట్, హుందాయ్ ఐ20, హోండా బ్రియోలకు పోటీగా డీజిల్, పెట్రోల్ వెర్షన్లను మార్కెట్లోకి విడుదల చేసింది.
డీజీల్ వెర్షన్ 5.27 లక్షల నుంచి ప్రారంభమై.. 7.19 లక్షల వరకు ఉంటుందని ఫియట్ ఇండియా అధ్యక్షుడు, ఎండీ నాగేశ్ బసవ్వన్ హల్లీ తెలిపారు. కస్టమర్ల అవసరాలకు దృష్టిలో ఉంచుకుని, భారతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కార్లను డిజైన్ చేస్తున్నామని ఫియట్ కంపెనీ తెలిపింది. ఫియట్ కంపెనీకి దేశవ్యాప్తంగా 93 పట్టణాల్లో 116 అవుట్ లెట్లు ఉన్నాయని నాగేశ్ తెలిపారు.
Advertisement