స్టార్టప్స్‌కు ఊరట
న్యూఢిల్లీ: స్టార్టప్స్‌కు ప్రస్తుతం ఇస్తున్న పన్నురాయితీని కంపెనీ స్థాపించిన తొలి ఏడేళ్లలో మూడేళ్లకు పొడిగిస్తున్నట్లు ఆర్థికమంత్రి జైట్లీ బడ్జెట్లో ప్రకటించారు. ఇప్పటివరకు ఈ లాభాధారిత పన్ను (ప్రాఫిట్ లింక్డ్ డిడక్షన్) తొలి ఐదేళ్లలో మూడేళ్లుగా ఉండేది. అయితే పలు స్టార్టప్స్ స్థాపించిన తొలినాళ్లలో లాభాలను అందుకోలేపోతున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఈ పరిమితిని సవరించింది. పాత నిబంధనను పొడిగించి ఏడేళ్లలో మూడేళ్లుగా మార్చినట్లు జైట్లీ చెప్పారు.
స్టార్టప్స్ నష్టాలను దృష్టిలో ఉంచుకొని 51% ఓటింగ్ హక్కును కూడా సడలిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ సడలింపు కొన్ని పరిమితులకు లోబడి ఉంటుందన్నారు. అదేవిధంగా మ్యాట్‌ను పూర్తిగా ఎత్తేయడం, తొలగించడం కుదరదని, అయితే కంపెనీలు మ్యాట్ క్రెడిట్‌ను వినియోగించుకునేందుకు వీలుగా మ్యాట్ క్యారీఫార్వర్డ్‌ను 10 నుంచి 15 ఏళ్లకు పెంచారు.