స్టాక్ మార్కెట్లోకి మరిన్ని పెన్షన్ నిధులు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో పింఛన్ ఫండ్ల పెట్టుబడుల పరిమితిని మరింతగా పెంచాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తోందని పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్మన్ హేమంత్ జి. కాంట్రాక్టర్ చెప్పారు. ఈ విషయమై త్వరలోనే నిర్ణయం వెలువడవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(పీఎఫ్‌ఆర్‌డీఏ) తన మూలనిధుల్లో 15 శాతం వరకూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పరిమితిని 50% వరకూ పెంచాలని కేంద్రం యోచిస్తోందని హేమంత్ వివరించారు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్) పెట్టుబడుల మార్గదర్శకాలను సమీక్షించేందుకు పీఎఫ్‌ఆర్‌డీఏ నియమించిన జి.ఎన్. బాజ్‌పాయ్ కమిటీ సూచనల్లో ఈ పరిమితి పెంపు కూడా ఒకటి.