ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కు ముందు...
ఫైనాన్షియల్ బేసిక్స్..
మార్కెట్‌లో ప్రస్తుతం చాలా ఫండ్ హౌస్‌లు ఉన్నాయి. అవి బ్యాలెన్స్‌డ్, ఈక్విటీ, ఇండెక్స్, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ వంటి పలు రకాల ఫండ్స్‌కు సంబంధించిన స్కీమ్స్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తుంటాయి. ఒక్కొక్క ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాధాన్యాలు ఒక్కోలా ఉంటాయి. అందుకే మనకు తగిన స్కీమ్‌ను ఎంపిక చేసుకోవాలి. స్కీమ్ ఎంపిక అనేది మన ఇన్వెస్ట్‌మెంట్ విధానం, రిస్క్ భరించే సామర్థ్యం వంటి తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంటే ఈక్విటీ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే రాబడితోపాటు రిస్క్ ఉంటుందనే అంశాన్ని గమనించాలి. ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెడితే స్థిర ఆదాయం పొందొచ్చు. ఇక్కడ రిస్క్ కొంత తక్కువగా ఉంటుంది.
స్కీమ్ ఎంపికలో కొన్ని అంశాలను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. స్కీమ్‌ను ఆఫర్ చేస్తున్న ఫండ్ హౌస్ ట్రాక్ రికార్డ్‌ను పరిశీలించాలి. దాని బ్రాండ్ విలువ ఎలా ఉందో చూడాలి. గత మూడేళ్లలో అది ఎలాంటి పనితీరును ప్రదర్శించిందనే అంశాన్ని గమనించాలి. మార్కెట్ అస్థిర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఫండ్ హౌస్ ఎలా స్పందించిందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఫండ్ హౌస్ స్థిర పనితీరుకు అధిక ప్రాధాన్యమివ్వాలి. ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లో కూడా ఫండ్ ఎలాంటి పనితీరును కనబరిచిందనే అంశమే మనకు ముఖ్యం.