ఆరు ఎఫ్డీఐప్రతిపాదనలకు ఆమోదం
న్యూఢిల్లీ: అంతర్ మంత్రిత్వశాఖల విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డ్ (ఎఫ్‌ఐపీబీ) ఆరు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) మంగళవారం ఆమోదముద్ర వేసింది. ప్రతిపాదనల విలువ దాదాపు రూ.105 కోట్లు. మొత్తం 13 ప్రతిపాదనలను పరిశీలించి ఆరింటిని ఖరారు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. నేడు ఆమోదం పొందిన పెట్టుబడుల్లో రూ.88 కోట్ల సెవా శాంటి యానిమేలీ ప్రధానమైనది. పలు రంగాలకు సంబంధించి ఎఫ్‌డీఐలను భారత్ ఆటోమేటిక్ రూట్‌లోనే ఆమోదిస్తోంది.