సాక్షి,ముంబై: ఫ్లిప్‌కార్ట్ కో ఫౌండర్, గ్రూప్ సీఈవో బిన్నీబన్సల్ (37)అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. తీవ్రమైన వ్యక్తిగత దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన పదవినుంచి తప్పుకున్నారు. బిన్నీ బన్సల్ రాజీనామాను ఆమోదించిన వాల్మార్ట్ ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది.
బిన్నీబన్సల్ వ్యక్తిగత ప్రవర్తన సరిగా లేదంటూ ఈ మధ్య కాలంలో ఆరోపణలతో వెల్లువెత్తాయి. కానీ ఈ ఆరోపణలను బిన్సీ బన్సాల్ తోసిపుచ్చారు. అయితే ఈ ఆరోపణలపై ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ సంయుక్తంగా స్వతంత్ర విచారణ చేపట్టాయి. బన్సల్ ఆరోపణలను తిరస్కరించినప్పటికీ తాము విచారణ చాలా జాగ్రత్తగా, నిశితంగా చేశామని వాల్‌మార్ట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అదే సమయంలో బిన్నీపై చెలరేగిన ఆరోపణలపై సాక్ష్యం కనుగొన లేకపోయినప్పటికీ, తీర్పులో ఇతర లోపాలను, ముఖ్యంగా బిన్నీ సమాధానంలో పారదర్శకత లేని కారణంగా బిన్నీ రాజీనామాను ఆమోదించామని తెలిపింది. అలాగే ఫ్లిప్‌కార్ట్ గ్రూపు సీఈవోగా కళ్యాణ్ కృష్ణమూర్తి కొనసాగుతారని ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక ప్లాట్‌ఫాంలుగా ఉన్న మింత్రా, జబాంగ్‌ను కలపనున్నామని తెలిపింది.
కాగా అమెజాన్ మాజీ ఉద్యోగులైన సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రపంచ వ్యాపార దిగ్గజంవాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో 77శాతం వాటాను కొనుగోలు చేయడంతో సచిన్ బన్సల్ తన పూర్తి వాటాను అమ్ముకొని వెళ్లిపోగా.. బిన్నీ బన్సల్ మాత్రం సీఈవోగా ఉన్నారు. ఈ-కామర్స్ మార్కెట్‌లో మెగాడీల్‌గా పేరొందిన ఈ ఒప్పందం జరిగిన కొన్ని నెలల వ్యవధిలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. దీంతో ఫౌండర్లు ఇద్దరూ కంపెనీని వీడినట్టయింది.
బిన్నీ బన్సల్ ప్రకటన
మరో రెండు క్వార్టర్‌లు కంపెనీలో కొనసాగాలనుకున్నాను. కానీ వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే నాపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నాను. ఇది నాకు, కుటుంబానికి పరీక్ష సమయం. సీఈవోగా రాజీనామా చేసినా ఫ్లిప్‌కార్ట్‌లో వాటాదారుడిగా, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడిగా కొనసాగుతాను.
Comments
Please login to add a commentAdd a comment