న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఇది 20 శాతంగా ఉంది. దీన్ని 49 శాతానికి పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. బ్యాంకులకు భారీగా మూలధనం అవసరమైన నేపథ్యంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ కసరత్తు చేస్తోందని సమాచారం. బడ్జెట్లో దీనిపై ప్రకటన చేసే అవకాశముంది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఆ మేరకు చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. ప్రయివేటు బ్యాంకుల్లో ఎఫ్‌ఐఐలు, ఎఫ్‌పీఐలు, క్యూఫ్‌ఐల పెట్టుబడి పరిమితిని 49 శాతం నుంచి గతేడాది 74 శాతానికి పెంచారు. యాజమాన్య నియంత్రణలో మాత్రం మార్పులు చేయలేదు.